ఆత్మాన్వేషణ:మనుష్యుల్ని కలిసి వారిని గమనిస్తూన్నందువల్ల, మనిషి తనని తాను కూడా కొంత తెలుసుకోగలడు. రెండూ జంటగా సంభవిస్తే.: రెండూ తప్పనిసరిగా జంటగా సంభవిస్తే అనడానికి వీలులేదు.ఒక దానిని రెం
ఆత్మాన్వేషణ: అలా పనిచేయదు. అద్దం, మనిషి ప్రతిబింబాన్ని చూపిస్తుంది; కానీ ఆ ప్రతిబింబం అద్దాన్ని మెరుగుపర్చదు. నువు అద్దానివీ కాదు, ఆ అద్దంలోని ప్రతిబింబమూ కాదు, అద్దం బాగా చక్కగా నీ ప్రతిబింబాన్ని చూపించేటట్లు దానిని పరిపూర్ణంగా తయారుచేసినప్పుడు, అచ్చం నీ రూపాన్ని అది ప్రతిబింబిస్తుంది – అద్దం నీ రూపాన్ని చూపించే విషయంలో అది పరిపూర్ణంగానే చూపిస్తుంది. కానీ ఆ ప్రతి బింబం నీవు కాదు – నువు ప్రతిబింబాన్ని చూస్తున్నవాడివి. ఇది తిన్నగా అర్థం చేసుకో ఏది నువ్వు చూచి గ్రహిస్తున్నా, ఆ చూడబడుతున్నది నీవు కాదు. నేను అద్దాన్ని మాత్రమే, అందులో కనిపించే ప్రతిబింబం ఈ ప్రపంచం. : ప్రతిబింబాన్నీ చూడగలవు, అద్దాన్ని చూడగలవు. కానీ ఈ రెండూ నీవు కావు. మరైతే ఎవరు నువ్వు? సూత్రాల (formulas) ననుసరించి ఆలోచించద్దు. సమాధానం పదాలలో లేదు. అతి సమీపమైన పదాల్లో చెప్పదలచుకుంటే, చూచి గ్రహించడానికి (perception) వీలు కలుగజేసే సాధనాన్ని నేను; అనుభవించే వాడు అనుభవించబడేది అనే వాటికి ఆవలనున్న జీవితాన్ని (life) నేను’ అనవచ్చు.
ఇక ఇప్పుడు అద్దం నుంచి, అద్దంలోని ప్రతిబింబం నుంచి విడివడి, ఏకాంతంగా (alone) నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలిగి వున్నావా?

ప్ర : నిలబడలేను.
ఆత్మాన్వేషణ: నిలబడలేను, అని నీకెలా తెలుసు? ఎలా చేయాలో తెలియకుండా జీవితంలో నువ్వు ఎన్నో చేస్తున్నావు. ఆహారం జీర్ణించుకుంటున్నావు, నీ రక్తాన్ని, మేధస్సును ప్రసారం చేస్తున్నావు, నీ కండరాలను కదిలిస్తున్నావ్ – ఇవన్నీ ఎలా చేస్తున్నావు
ఆత్మాన్వేషణ:అనేది తెలియకుండానే చేస్తున్నావు. అదే విధంగా, చూచి గ్రహిస్తుంటావు, అనుభూతి అలా ఎందుకున్నావో తెలీకుండానే వుంటున్నావు. ఆత్మగా నీలో వున్న దోషమేసీ, చేస్తున్నావో తెలియకుండానే చేస్తున్నావు. అలాగే నువ్వు నీవుగా వుంటం కూడా. లేదు. అది వుండవలసినట్లు, పరిపూర్ణంగానే వుంది. తేటతెల్లంగా లేని, సత్యంగా లేని అద్దాన్ని గురించి చెప్తున్నాను, అందుకనే అది అనృతమైన ప్రతిబింబాలను అందిస్తున్నది. నిన్ను నువ్వు సరిదిద్దుకోనక్కర లేదు – నిన్ను గురించిన నీ సరిచేసుకో, అంతే. నీ ప్రతిబింబం నుండి అద్దం నుండి విడివడడం నేర్చుకో, పొడుగూతా ఇలా జ్ఞప్తికి తెచ్చుకుంటూ వుండు నేను మనసునూ, అందులోని భావాలనూ కాను’ : ఈ మాటని దృఢ విశ్వాసంతో, ఓర్పుతో గుర్తుతెచ్చుకుంటూ వుండు. నీ స్వస్వరూపం చెంతకు చేరుకుంటావ్. సత్తకు – తెలుస్తుండడానికి – ప్రేమించడానికి, శాశ్వతత్వానికీ, అన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఎల్లెడలా వ్యాపించి యున్న దానికీ మూలం నువ్వేననే విషయం నిశ్చయంగా కనుగొంటావ్. అనంతమై నీ దేహంలో కేంద్రీకృతమై వున్నది. ఇప్పుడైతే నీవు దేహాన్ని మాత్రమే చూడగలిగి వున్నావ్. శ్రద్దగా ప్రయత్నించావంటే, ఆ అనంతమైన దానినే చూస్తావ్.
ఆత్మాన్వేషణ: ఈ వాస్తవానుభవం సంభవించినప్పుడు, అది కొనసాగుతుందా? : అన్ని రకాల అనుభవాలు తప్పనిసరిగా తాత్కాలికమైనవే. కానీ సమస్తానుభవానికి క్షేత్రమైనది, కదల్చరానిది (immovable). సంఘటన అనేది ఏది కూడా ఎక్కువ కాలం నిలవదు. కానీ కొన్ని సంఘటనలు మనసును పరిశుద్ధం చేస్తే, మరికొన్ని మనసుమీద మచ్చపడేట్లు చేస్తే. లోతైన ప్రావీణ్యం (Insight) తోనూ, అన్నిటినీ తనలో ఇముడ్చుకునే ప్రేమతోనూ కూడిన క్షణాలు, మనసును శుద్ధి చేసై; కోరికలూ భయాలూ, ఈర్ష్యాసూయలు, ఆగ్రహం, గ్రుడ్డి నమ్మకాలు మేధాపరమైన గర్వంతో కూడిన క్షణాలు మనస్సును (psyche) మలినంచేసి, మందగింపజేస్తే. : ఆత్మసాక్షాత్కారం అంత ముఖ్యమంటారా?
ఆత్మాన్వేషణ: అది లేకపోయినట్లయితే, కోరికలు భయాలు నిన్ను హరించి వేసై; అర్థరహితంగా మళ్ళీ మళ్ళీ సంభవిస్తూ అంతులేని దుఃఖానికి గురిచేస్తే. బాధకు అంతం వున్నదని మనుష్యుల్లో చాలామందికి తెలియదు. కానీ శుభకరమైన ఈ మాట విన్న తర్వాత,
అన్ని రకాల జగడం, తర్జన భర్జన నుండి దాటి వెళ్ళాలనేదే అత్యంత ముఖ్యంగా కనిపిస్తుంది. నీవు వీటి నుంచి విడివడగలవని తెలుసుకున్నావు కాబట్టి, ఇక ఇప్పుడు, యావత్తూ నీ చేతిలో వుంది. ఎప్పటికీ ఇలాగే ఆకలిదప్పులతో, దీర్ఘకాలిక కోరికతో (Longing) వెతుకుతూ, స్వాధీనం చేసుకుంటూ పిడికిలిలో బిగించుకుంటూ, ఎప్పుడూ కోల్పోతూ, దుఃఖిస్తూ వుండిపోవచ్చు. లేదా కాలంతో నిమిత్తంలేని పరిపూర్ణతకై – దేనికైతే నువ్వేమీ కలపలేవో, దేనినుంచైతే నువ్వేమీ తీసెయ్యలేవో – దానికై హృదయపూర్వకంగా వెతుక్కుంటూ ముందుకు సాగవచ్చు. అందులో కోరికలు, భయాలు వుండవు; అందుకు కారణం, వాటిని నువు వదలిపెట్టినందువల్ల కాదు, వాటికి అర్థం లేకుండా పోయింది కాబట్టి.
–
ఆత్మాన్వేషణ: ఇంతవరకూ మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చేయాల్సిందేమిటి? : చేయాల్సిందేమీ లేదు. కేవలం నీవుగా వుండిపో. ఏమీ చేయద్దు. అలా ఉండిపో, కూడా నేననడంలేదు. కొండలూ ఎక్కడం లేదు, గుహల్లోనూ కూచోనక్కరలేదు. ‘నీవుగా వుండిపో’ అని కారణమేమంటే, నువ్వెవరో నీకు తెలియదు. కేవలం ఉండు. కనిపించెడి వస్తువులతో కూడిన బాహ్య ప్రపంచానివి నీవు కాదని చూశావు, ఆలోచించగలిగిన అంతర్ ప్రపంచానివీ నీవు కావు; దేహానివీ కావు, మనసువీ కావు అని చూశావు – ఇక కేవలం అలా ఉండిపో.
ఆత్మాన్వేషణ: సాక్షాత్కరింప జేసుకోవడంలోనైనా శ్రేణులుండి తీరాలి.
: ఆత్మసాక్షాత్కారానికి మెట్లులేవు. క్రమబద్ధంగా ఎక్కేది అంటూ ఏమీ వుండదు. అది అకస్మాత్తుగా సంభవిస్తుంది; వెనక్కు త్రిప్పగలిగింది కాదు. మరో నూతన పరిమాణం (Dimension) లో, చక్రంవలె తిరుగుతావు; అక్కడి నుండి చూస్తే అంతకు మునుపటివన్నీ అమూర్త (Abstract) మైనవిగా కనిపిస్తే. సూర్యుడుద యించగానే వస్తువులు ఉన్నవి ఉన్నట్లుగా ఎలా కనిపిస్తాయో, అదే విధంగా ఆత్మ సాక్షాత్కారమైన పిదప, ప్రతిదీ యథాయథంగా కనిపిస్తుంది. భ్రమలతో కూడిన ప్రపంచాన్ని దాని స్థానంలో దానిని వదిలేస్తావు.
ప్ర : సాక్షాత్కారమైన స్థితిలో, వస్తువులు మార్పు చెందుతాయా? అవి మనోరంజకంగా (colourful) నూ అర్థవంతంగానూ రూపొందుతాయా?
ఆత్మాన్వేషణ: అనుభవం సరి అయినదే, కానీ అది వాస్తవం యొక్క అనుభవం
– అనగా
సదానుభవం కాదు. అది విశ్వంయొక్క సామరస్యానుభవం – సత్యానుభవం.
ప్ర : అయినప్పటికీ ప్రగతి
ప్ర
సాధించినట్లే.
ఆత్మాన్వేషణ: సాధన కార్యక్రమంలో ప్రగతి ఉండగలదు. సాక్షాత్కారం మాత్రం అకస్మాత్తుగానే కిందపడడం హఠాత్తుగా పడుతుంది, ఇక తిరిగి రావడమనే ప్రశ్నే లేదు. ” జరుగుతుంది. కాయ పండడడం మెల్లగా సంభవిస్తుంది, కానీ చెట్టు నుండి : శారీరకంగానూ, మానసికంగానూ, నేను శాంతంగానే జీవిస్తున్నాను. నాకింకేమి
కావాలి?
ఆత్మాన్వేషణ: నీది అంతిమ స్థితి కాకపోవచ్చు. ఏ మాత్రం కోరిక, భయం లేకుండా పోయినప్పుడు సహజమైన స్థితికి నీవు తిరిగి వచ్చావని గుర్తిస్తావు. నిజానికి నీవేదై వున్నావో ఆ అనుభూతి కలుగక పోవడమే, ఈ కోరిక భయం అనే వాటి మూల కారణం. స్వరూపం, స్వస్థలం మారినప్పుడు దేహంలోని కీలు ఏ విధంగా బాధ కలగజేస్తుందో, దానిని సరిచేయగానే, దాని గురించి మరచిపోవడం సంభవిస్తుంది. అలాగే తనని గురించిన ఆందోళన ప్రారంభమైనదంటే మనసు వక్రీకరించిందన డానికి లక్షణమనచ్చు; మనషి మామూలు స్థితికి రాగానే, ఆ ఆందోళన మాయ మవుతుంది.
సాక్షాత్కారమందుకోగానే, నువు పూర్తి అయినావని తోస్తుంది, కృతకృత్యుడి వైనావనిపిస్తుంది, సుఖ దుఃఖాల చట్రం నుండి విడివడ్డావనిపిస్తుంది. కానీ ఏమి జరిగిందో ఎందుకు ఎలా జరిగిందో వివరించి చెప్పగలిగి వుండవు. నకారాత్మక పదాలతోనే మాట్లాడగలవు. ‘నాకిక ఏ రొష్టూ లేదు’. గతంతో పోల్చుకున్నప్పుడే నువ్వా రొష్టు నుండి బయటపడ్డావని తెలుస్తుంది. లేదంటే నీపాటికి నీవు వుంటావు. ఈ అనుభూతిని ఇతరులకు తెలియజేయడానికి ప్రయత్నించకు. దానిని చెప్పగలిగి వున్నావంటే అది ‘అసలు’ వస్తువు కాదు. నిశ్శబ్దంగా వుండు; కర్మాచరణలో ఎట్లా అభివ్యక్తీకరింపబడుతుందో, గమనిస్తూ వుండు.
అది
ఆత్మాన్వేషణ : నేను ఏమి అవనున్నానో నాకు మీరు చెప్పగలిగితే, నా అభివృద్ధిని గమనించడానికి
నాకది సహాయపడుతుంది.
ఆత్మాన్వేషణ: అవడమనేది లేదు అని తెలిసినప్పుడు, నువ్వేమి కానున్నావో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? కేవలం నువ్వెవరో నువు కనుగొంటావ్. ఒక నమూనాలో తనని తాను రూపొందించుకోడం అతి బాధాకరమైన కాలహరణం. గతాన్ని : కేవలం అలా ఎలా ఉండిపోగలను? మార్పులు అనివార్యం కదా? గురించి కాని, భవిష్యత్తును గురించి కానీ ఆలోచించకు, కేవలం ‘ఉండిపో’. : మారేటటువంటి విషయంలో మార్పులు అనివార్యమే, కానీ నీవు వాటి అధీనంలో లేవు. నువ్వు వాటన్నిటి వెనుకనున్న మార్పులేని నేపథ్యానివి; ఈ మార్పులన్నీ, ఆ
నేపథ్యం మీద కనిపిస్తుంటై.
: అన్నీ మారుతుంటై, నేపథ్యమూ మారుతుంది. మార్పుల్ని చూడడానికి, మార్పులేని నేపథ్యమక్కరలేదు. ఈ ‘సెల్ఫ్’ అనేది క్షణికం – గతం భవిష్యత్తును కలిసే క్షణ
కాలం మాత్రమే.
: ఆ మాట నిజమే. స్మృతి ఆధారమైన ‘సెల్ఫ్’ క్షణికమైనదే. కానీ అలాంటి ‘సెల్ఫ్’ దాని వెనుక అంతరాయంలేని నిరంతర (continuity) ను ఆశిస్తుంది. కానీ నీ అనుభవంలో, నీ సెల్‌ని మరచిపోయిన సందర్భాలు నీకు తెలుస్తూనే వుంటై. మరి దానికి ప్రాణం పోస్తున్నదెవరు? ప్రొద్దున్నే నిన్ను లేపుతున్నది ఎవరు? మన చైత్యన్యంలోని ఖాళీలను నింపి, దానిని కొనసాగించడానికి ఏదో స్థిరమైన అంశం వుండుండాలి. నువు జాగ్రత్తగా గమనిస్తే, నీ రోజువారీ చైతన్యం కూడా మధ్య మధ్యలో మెరుపు మెరిసినట్లు కనిపిస్తుంది, తఱచు అనేక ఖాళీలు వుంటుంటై. ఈ ఖాళీల్లో ఏముంటుంది అంటావ్? కాలంతో నిమిత్తంలేని నీ నిజమైన సత్త తప్పితే, మరేది వుండగలదు? మనసు కానీ, మనోరాహిత్యం కానీ, ఆ రెండూ దానికి ఒకటే.
ప్ర : (విషయం మారుస్తూ) ఇటూ అటూ తిరుగుతూ వుండే ఈ గుణానికి ప్రేరణ ఏమై వుంటుంది అంటారు?
ని కారణమేమీ లేదు. తిరుగుతున్నానని నీవు కలలు కంటూంటావ్. కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో నీవు గడిపిన కాలం నీకు స్వప్నంలాగా కనిపిస్తుంది. అప్పుడు మరేదో కలకంటావ్. ఒక కల నుండి మరో కల వద్దకు కదులుతున్నది నువు కాదు; ఈ కలలన్నీ నీ ముందు కదలాడుతున్నై, వీటన్నిటినీ,
గమనిస్తున్న మార్పులేని సాక్షివి. ఏ సంఘటన కూడా నీ నిజమైన సత్తను
బాధించదు – ఇది పరమ సత్యం.
: ఆత్మానుభవానికి, బ్రహ్మన్ అనుభవానికి ఏమైనా తేడా వుందా?
: బ్రహ్మన్ మనిషి అనుభవానికి అందేది కాదు. ప్రతి అనుభంలోనూ అది సంభవించి అది ప్రామాణికం చేస్తుంటుంది. ప్రపంచం నిండా ఎంతో విలువైన వస్తువులు నప్పుడల్లా ‘సెల్ఫ్’ యే అనుభవించే అంశం; ఆ విధంగా అనేక రకాల అనుభవాలను ఉండవచ్చు గాక, కానీ వాటిని కొనేవాడు ఎవరూ లేకపోతే వాటికి ధరే వుండదు. ఆ ‘పరమం’ (Absolute) లో అనుభవించ గలిగినవన్నీ ఉన్నై, కానీ అనుభవించే వాడు గనక లేకపోతే, అవి వుండీ లేనట్టే. అనుభవాన్ని సాధ్యమయ్యేట్టు చేసేది ఆ ‘పరమం’ (Absolute). అనుభవాన్ని యథార్థం చేసేది సెల్ఫ్.
: అనుభవాలు క్రమక్రమంగా పెరుగుతూ కదా మనం పరమాన్ని చేరుకునేది? అతి ముతక అనుభవాలతో మొదలిడి, అతి ఉన్నతమైన అనుభవాలలో ముగిస్తాం. : కోరుకోనటువంటి అనుభవమంటూ వుండదు. కోర్కెల మధ్య శ్రేణులుండవచ్చు. కానీ అతి ఉన్నతమైన కోరిక కలిగున్న స్థితీ, సమస్తమైన కోరికల నుండి విముక్తినొందిన స్థితీ మధ్య దాటాల్సిన చాలా పెద్ద అగాధమున్నది. అవాస్తవమైనది వాస్తవంగా కనిపించ వచ్చు, కానీ అది కొంచెంసేపే అలా వుంటుంది. వాస్తవమైన
దానికి కాలాన్ని చూసి భయంలేదు.
ప్ర : అవాస్తవమైనది, వాస్తవమైన దాని అభివ్యక్తీకరణ కాదా?
: ఎలా అవుతుంది? ‘సత్యం స్వప్నాల్లో అభివ్యక్తీకరింపబడుతుంది’, అన్నట్లుంటుంది. వాస్తవం దృష్టిలో అవాస్తవమనేది లేదు. అది సత్యంగా కనిపించడానికి కారణం, నువ్వు దానిని నమ్ముతావు కాబట్టి. సందేహించు, అది అంతమైపోతుంది.
నువ్వెవరినైనా ప్రేమిస్తూ వుంటే దానికి వాస్తవికతను ఆపాదిస్తావు – నీ ప్రేమ సర్వశక్తిమంత మైనదని, చిరకాలం నిలిచేదని ఊహిస్తావు. అది అంతమవగానే, ‘నేను అది వాస్తవమైనదనుకున్నాను, కానీ అది వాస్తవమైనది కాదు’ అని అంటావు. ఇప్పుడు వుండి తర్వాత లేకపోవడమనేది అవాస్తవానికి అంతిమ రుజువు. దేశ కాలావస్థల్లో ఏదైతే పరిమితమై వుంటుందో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే వర్తిస్తుందో అది వాస్తవమైనది కాదు. వాస్తవమైనది ఎల్లరికీ చెందినది, శాశ్వతమైనది.