ఉనికి లోని వాస్తవం: ఒక అంతర్ముఖ అన్వేషణ1

ఉనికి : ముఖ్యంగా నీ మనసులో నీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చు కుంటావ్, నీ ఉనికికి బదులుగా ఏది ఇచ్చినా తీసుకోవు. ‘ఉండాలి ఉండాలి’ అనే కోరిక అన్ని కోరికలకన్నా బలమైనది; నీ నిజ స్వభావాన్ని నువు వాస్తవం

చేసుకున్నాక మాత్రమే అది వదులుతుంది.

ప్ర : అవాస్తవంలో కూడా రవంత వాస్తవం పాళ్ళ

ఉనికి: దానిని వాస్తవమనుకొని నువ్వు దానికి ఇచ్చిన ప్రాధాన్యం. అది నిజమేనని నువ్వనుకొని నమ్మినప్పుడు, నీ నమ్మకానికి నువ్వు కట్టుబడి వుంటావు. సూర్యుడు వెలుతురు విరజిమ్ముతూ వుంటే, రంగులు కనిపించ నారంభిస్తే. సూర్యుడు అస్తమిస్తే, రంగులు మాయమవుతై. వెలుతురు లేకపోతే రంగులు ఏమైనై?

: ఇది ద్వంద్వంతో కూడిన ఆలోచన.

ఉనికి,

: ఆలోచన యావత్తూ ద్వంద్వంలోనే వుంటుంది. ఏకత్వంలో ఏ ఆలోచనా మిగలదు. ఆత్మధ్యానము

ఉనికి: శిశువుకు తన శరీరం తెలుసు కానీ, శరీర ఆధారిత భేదాలు తెలియవు. శిశువు కేవలం చైతన్యంతో సంతోషంగా వుంటుంది. నిజానికి అది పుట్టింది అందుకే. ‘ఉండుట’ అనే సుఖమే అతి సహజమైన ఆత్మ – ప్రేమ; అదే ఆ తర్వాత ఆత్మను ప్రేమించుటగా పరిణతి చెందుతుంది. శరీరానికి ఆత్మకు మధ్య ఏ రకమైన అడ్డు లేకుండా శిశువు ఎలా వుంటుందో నువ్వలా వుండు. మానసిక కోలాహలం ఉండదు. గాఢ నిశ్శబ్దంలో, ఆత్మ శరీరాన్ని ధ్యానిస్తూ వుంటుంది. అప్పటికింకా ఏ అక్షరమూ రాయని తెల్లకాగితంలా వుంటుంది. ఆ శిశువులాగా వుండు; ఇదవాలని అదవాలని ప్రయత్నించకుండా, ‘ఉన్నానని’ ఆనందించు. మొత్తం చైతన్య క్షేత్రానికి, నువు సంపూర్తిగా మేల్కొన్న సాక్షివవుతావు. కానీ నీకూ ఆ క్షేత్రానికీ మధ్య ఏ రకమైన ‘ఫీలింగ్స్’, భావాలు అడ్డు ఉండరాదు. ప్ర : కేవలం సత్త (being) తోనే సంతృప్తి చెందుతూ కాలక్షేపం చేయడం, చాలా స్వార్థంతో కూడుకున్న వ్యవహారంలా కనిపిస్తున్నది.

ఉనికి : స్వార్థంతో వుండటం అమిత యోగ్యమైన పద్ధతి! ఒక్క ఆత్మను తప్పితే మిగతా వన్నిటినీ విడిచిపెట్టి, స్వార్థంతోనే వుండు. ఆత్మను తప్పితే, మరి దేనినీ ప్రేమించ కుండా ఉంటే, స్వార్థం నిస్వార్థం రెంటినీ దాటి ఆవలికి వెళ్తావు. అన్ని తేడాలు

సహజమైన ప్రేమలో కలిసిపోతై; ఈ ప్రేమ ఎవరినీ నిర్దేశించికాదు, ఎవరికీ అర్థరహితమవు. ఒకర్ని ప్రేమించడం అందర్నీ ప్రేమించడం, స్వచ్ఛమైన కడు. ఆ ప్రేమలో వుండు, దాని లోతుల్లోకి మరింత లోతుల్లోకి సమస్యలనే కాక మానవాళి యొక్క సమస్యలను కూడా పరిష్కరిస్తావు. ఏమి వెళ్ళు. నిన్ను నువ్వు పరిశోధించుకో, ఆ పరిశోధనను ప్రేమించు; ఆ విధంగా నీ చేయాలో నీకు తెలుస్తుంది. లోతులు లేని ప్రశ్నలు అడుగకు; మౌలికమైన విషయాలు, నీ సత్త (being) యొక్క వ్రేళ్ళకు (roots) కు సంబంధించిన వాటిపై

మనసు పెట్టు.

శిశువు ఈ ప్రపంచానికి రాజు

అది పెరిగి పెద్దయింతర్వాత, తన

ఉనికి:రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. దాని శైశవంలో అది తీవ్రమైన వ్యాధికి గురియైనప్పుడు వైద్యుడు నయం చేశాడని ఊహించుకో. ఇప్పుడీ యౌవనంలోని రాజు తనకు రాజ్యం దక్కినందుకు ఆ వైద్యుడికి రుణపడి వున్నట్లా? నిమిత్తమాత్రమైన సహాయక కారణాలలో బహుశా ఒకటి అని మాత్రమే అనవచ్చు. ఇంకెన్నో కారణాలున్నై, అన్నీ సహాయపడినై. కానీ ప్రధానాంశం, అతి కీలకమైన అంశం ఏమిటంటే, అతడు రాజుగారి కుమారుడై పుట్టడం. అదే విధంగా గురువు సహాయపడచ్చు గాక. కానీ సహాయపడే ప్రధానమైన విషయం నీలో ఈ వాస్తవం ఉండడం. అది తనను తాను దృఢంగా ప్రకటించుకుంటుంది.

ఉనికి:నీవు నిబ్బరంగా నిలబడలేక పోతున్నావంటే కారణం ఏనాడూ నీ మీద నీవు దృష్టిపెట్టకుండా, ఎంతసేపూ నీ అనుభవాల మీదే దృష్టిసారించడం. అనుభవాల కతీతంగా, కేవలం నీ యెడల నీ ఆసక్తిని మెండుగా కలిగివుండు, నీతో నువ్వుండు, నిన్ను నువ్వు ప్రేమించుకో; అంతిమ భద్రత కేవలం ఆత్మ జ్ఞానంలోనే లభిస్తుంది. ప్రధానమైన విషయం నీ చిత్తశుద్ధి, నీ యెడల నీవు నిజాయితీతో వుండు, ఏదీ నిన్ను నమ్మకద్రోహానికి గురిచేయదు. సద్గుణాలు, శక్తులు కేవలం పిల్లలు ఆడుకోడానికి పనికివచ్చే ప్రతీకలు (Tokens). ప్రపంచంలో వాటికి కొంత ప్రయోజనం వుండవచ్చు కానీ నిన్ను ప్రపంచం నుండి బయట పడెయ్యలేవు. ఆవలికి వెళ్ళాలంటే, నీకు కావలసినవి అప్రమత్తమైన నిశ్చలత, నెమ్మదితో కూడిన సావధానత.

మనసులేని స్థితి

ఉనికి:శరీరం భౌతిక పదార్థం కాబట్టి మారడానికి కాలంయొక్క అవసరముంటుంది. మనస్సంటే కొన్ని మానసిక అలవాట్లు, ఆలోచన అనుభూతుల విధానాలు; వాటిని మార్చాలంటే, వాటిని ఉపరితలం మీదికి తీసుకువచ్చి పరీక్షించాలి. దీనికీ కొంత కాలం కావాలి. కేవలం సంకల్పించుకొని పట్టుదలతో కృషిచేస్తూ వుండు, మిగతాదంతా తనంతట తాను చూసుకుంటుంది.

ఉనికి:(ఈ రంగంలో) నీకేమి చేయాలనిపిస్తుందో అదే చేయ్. నిన్ను నువ్వు వేధించుకోవద్దు. హింస, మనిషిని కఠినుడిగానూ, వంగే స్వభావం లేని వానిగానూ తయారుచేస్తుంది. నీకు మార్గంలో ఆటంకాలుగా కనిపించే వాటితో పోరాడకు. వాటిని ఆసక్తితో చూడు, గమనించు, పరిశీలించు, విచారణ సలుపు. ఏది ఎలాగైనా జరగనీ – మంచి కానీ, చెడుకానీ. కానీ ఏది జరిగినా, దానిలో మునిగిపోకు.

ఉనికి:అవలోకించిగలిగినదీ, అనుభవించగలిగినదీ, ఏదీ కూడా నీవు కాదనీ, నిన్ను బంధించగలిగినదీ కాదని తెలుసుకో. ఏది నువ్వు కాదో దానిని పరిగణించ వద్దు. మనసు దేహంలో కేంద్రీకరింపబడవచ్చు గాక, చైతన్యం మనసులో కేంద్రీకరింప బడవచ్చు గాక, ఎఱుక మాత్రం స్వేచ్ఛాయుతమైనది. శరీరానికి, దాని ప్రేరణలు దానికి వుంటై, మనసుకు దానికుండే బాధలు సుఖాలు దానికుంటై. ఎఱుక మాత్రం ఏ అనుబంధానికీ లోను కాదు, ఏమాత్రం చలించదు. అది తెలివిలో, నిశ్శబ్దంలో, శాంతిలో వుంటుంది; జాగరూకతతో, నిర్భయంగా, కోరిక – భయరహితంగా వుంటుంది. అదే నీ నిజమైన సత్త (being) అని ధ్యానించు, నిత్య జీవితంలో అదిగానే వుండటానికి ప్రయత్నించు, ఆ విధంగా దాని పరిపూర్ణతను నీవు నిజం చేసుకుంటావు.

ఉనికి:ఏమి జరుగుతుంటుందో, ఆ విషయమై మనసు ఆసక్తి చూపుతుంటుంది, ఎఱుక అసలు ఆ మనసు విషయంలోనే ఆసక్తిగొని వుంటుంది. పిల్లవాడు తానాడుకునే బొమ్మమీదనే దృష్టి వుంచుతాడు, మరి తల్లేమో పిల్లవాడ్నే కనిపెట్టి వుంటుంది కానీ, బొమ్మని కాదు.

యాను; ఆ ఖాళీతో, ఒక్క నా మనసు తప్పితే

అయివిసుగూ విరామం లేకుండా చూస్తున్నందువల్ల, నేను మొత్తం ఖాళీ ల

పో

అంతా తిరిగి వచ్చింది. ఇక

ఇప్పుడు నా మనసును తిరిగి పొందలేని స్థితికి వచ్చానని కనుగొన్నాను. ఇప్పుడు మాతో మాట్లాడుతున్నప్పుడు, మీరు అచేతనావస్థ (unconscious) లో

నున్నారా?

(states) అవస్థలు (conditions), వీటన్నిటినీ దాటి అవతల వున్నాను. _మానసిక ప్రక్రియ అంతమైపోయింది. ఏ రకమైన భేదాలు వుండవు.

ఉనికి: మీరు ఆలోచించే మనిషిలాగే ప్రవర్తిస్తారు.

: ఎందుకు ప్రవర్తించకూడదు? కానీ నా ఆలోచన, నా

వస్థకు చెందినది, ప్రయోజనాత్మకమైనది.

జీర్ణక్రియలాగా, అచేతనా

ప్ర : మీ ఆలోచన అచేతనాత్మక స్థితి నుండి పుట్టుకువస్తే, అది సరి (Right) అయినదే

అని మీకెలా తెలుసు?

: ఏ కోరికా, ఏ భయమూ దాని నడ్డుకోవడం లేదు. ఏది దానిని తప్పుగా చేయ గలుగుతుంది? నన్ను నేనెఱిగున్న తర్వాత, నేను దేనికి కట్టుబడి వున్నానో తెలిసిన తర్వాత, ఎల్లవేళలా నన్ను నేను పరీక్షించుకుంటూ కూచోనక్కరలేదు. నీ గడియారం సరియైన ‘టైమ్’ చూపిస్తుందని తెలిసినప్పుడు, దానివంక ‘టైమ్’ కోసం చూచినప్పుడల్లా సంకోచిస్తూ వుండవు.

ప్ర : ఈ క్షణాన, మనసుకాక, మరెవరు మాట్లాడుతున్నారు?

: ఏది ప్రశ్నను వింటున్నదో, అది సమాధానం చెప్తున్నది.

అన్వేషణే అంతిమ వాస్తవం

ని : అన్వేషకుని దృష్టిలో లక్ష్య మొకటే ఉంటుంది : తన నిజమైన సత్త (being) ను కనుగొనడం. అన్ని కోరికల్లోనూ, ఇది అత్యంత ఆకాంక్ష (Ambition) తో కూడు కున్నది; ఎందుకంటే ఏదీ, ఎవరూ తీర్చగలిగి లేరు. అన్వేషకుడూ, అన్వేషింపబడే ఒకటే; అన్వేషణే ప్రధానమైన విషయం.

ప్ర : అన్వేషణ అంతమవుతుంది. అన్వేషకుడు ఉండిపోతాడు.

: అలా కాదు, అన్వేషకుడు కరిగిపోతాడు, అన్వేషణ మిగిలిపోతుంది. అన్వేషణే కాలాతీతమైన, అంతిమ వాస్తవం (Reality)

: అన్వేషణ అంటే లేమి, అక్కర, అసమగ్రత, అపరిపూర్ణత్వం..

: కాదు, అన్వేషణ అర్థమేమిటంటే, అసంపూర్తిని (incompleteness) అపరిపూర్ణత

(imperfection) తిరస్కరించుట, నిరాకరించుట. వాస్తవాన్ని అన్వేషించడమే వాస్తవం యొక్క కదలిక. ఒక విధంగా చెప్పాలంటే అన్వేషణ యావత్తూ వాస్తవమైన ఆనందాతిశయం (bliss) కోసం, లేక వాస్తవం యొక్క ఆనందాతిశయం కోసం అనవచ్చు. కానీ ఇక్కడ మనం అంటున్న అన్వేషణ మనిషి తన కోసం తాను చేస్తున్న అన్వేషణ – తన సత్త చేతన (being consciounness) యొక్క వేరు (root) కోసం, తన మనసు కావల నున్న కాంతి కోసం. ఈ అన్వేషణ ఎప్పటికీ అంతమవదు; అయితే నిజమైన ప్రగతి సాధించాబడాలంటే మిగతావాటన్నిటి కోసమై ఉండే తీవ్రవాంఛ మాత్రం అంతమవక తప్పదు.

వాస్తవం కోసంగానీ, పరమాత్ముడూ గురువూ కోసంగానీ, ఆత్మకోసంగానీ జరిగే అన్వేషణ అన్నీ ఒకటేనని అర్థం చేసుకోవాలి; ఒకటి కనుగొంటే అన్నీ కనుగొన్నట్లే. నీ మనసులో ‘నేనున్నాను’ (అస్మిత్), ‘పరమాత్ముడున్నాడు’ అనే పదాలు, వేరుగా తెలియరానివైనప్పుడు, అప్పుడు ఏదో సంభవిస్తుంది – నువ్వు వున్నావు కాబట్టే భగవంతుడున్నాడనీ, భగవంతుడున్నాడు కాబట్టే నువ్వు ఉన్నావనీ, లేశమాత్రమైనా సందేహం లేకుండా తెలియవస్తుంది. రెండూ ఒకటే. : అంతా విధి లిఖితమే కాబట్టి, మన ఆత్మసాక్షాత్కారం కూడా విధి లిఖితమేనా? లేక కనీసం ఆ విషయంలోనైనా మనకు స్వేచ్ఛ వున్నదా?

: విధి అనేది నామరూపాలకు మాత్రమే వర్తిస్తుంది. నువ్వు దేహానివి, మనసువు కాదు కాబట్టి, విధికి నీ మీద అదుపు లేదు. నువ్వు పూర్తిగా స్వేచ్ఛ కలిగివున్నావు. కప్ (cup), దాని యొక్క ఆకారం, అది తయారు చేయబడిన పదార్థమూ, అది ఎందుకు ఉపయోగిస్తున్నదీ మొదలైన వాటిచే నిబద్ధీకృతమై (conditioned) వుంటుంది. కానీ కప్లోని ఖాళీస్థలం (space) మాత్రం, స్వేచ్ఛ కలిగి వున్నది. కప్ దృష్ట్యా ఆ ఖాళీ స్థలం కప్లోనే వున్నది. కానీ నిజానికి అది కేవలం ఖాళీ స్థలమే, అఖండ ఆకాశమే.

: ధ్యాన (Meditation) మంటే ఏమిటి. దాని ప్రయోజనాలేమిటి?

: నువు ప్రారంభ దశలో వుంటే, కొన్ని నిర్దిష్టమైన ఆకృతిగల (formalized) అన్వేషించే వారికి ఒకే ఒక్క ధ్యానమే ఉన్నది – ఆలోచనలకు ఆశ్రయ మివ్వకుండా, విధానాలు, లేక ప్రార్థనలు, ఉపయోగకరమైనవిగా ఉండవచ్చు. కానీ వాస్తవాన్ని వాటిని కఠినంగా తిరస్కరించడం. ఆలోచనల నుండి విముక్తి సిద్ధంచడమే ధ్యానం.

: అదెలా సాధించాలి?

: ఆలోచనలను ప్రవహింపనిచ్చి, వాటిని గమనిస్తూ వుండడంతో ప్రారంభిస్తావు. వాటిని తిన్నగా పరిశీలించడమే మనసును నెమ్మదింపజేసి, చివరకు పూర్తిగా ఆగిపోయేట్లు చేస్తుంది. ఒకసారి మనసు గనక నిమ్మళిస్తే దానిని నెమ్మదిగానే వుంచేసెయ్. మనసులోని శాంతితో విసుగు చెందక, అందులోనే వుండిపోయి,

దాని లోతుల్లోకి వెళ్ళు.

ప్ర : ఒక ఆలోచననే పట్టుకు ఉండిపొమ్మనీ, ఆ విధంగా ఇతర ఆలోచనలను దరికి రానివ్వద్దనీ, చెప్పగా విన్నాను. కానీ ఇతర ఆలోచనలను చెంతకు రానివ్వకుండడ మెలా? అలాంటి భావమే స్వయాన ఒక ఆలోచన అవుతుంది.

: పాత అనుభవాల మాట వదిలేసి, కొత్తగా ప్రయోగంచేసి చూడు. ఆలోచనలను గమనించు. ఆలోచనలను గమనిస్తున్న నిన్ను గమనించు. అన్ని ఆలోచనల నుండి విముక్తస్థితి హఠాత్తుగా సంభవిస్తుంది; దాని యొక్క మహదానందం (bliss) మూలాన ఆ స్థితిని నువ్వు గుర్తించి తీరుతావు.

ఇంకా ఏది వదిలేయకుండా ఉన్నాను?

అని కనుగొనడమే సాధన.

We will be happy to hear your thoughts

Leave a reply

mobispecifications.com
Logo
Shopping cart