కథలు:చేయడమే గాక, ఏదైనా పని చేయాలంటే గిఫ్టులు కావాలి! ముడుపులు బల్ల మీదైనా… క్రింది నుంచి ఇవ్వాలి. అలాచేసే వాళ్ళకే అతను ప్రాధాన్యతను ఇస్తాడు. శంకరం నీతి, నిజాయితీ కలవాడు. ఏ పనైనా రూల్సు ననుసరించి చేస్తాడు. ప్రతి గురువారం గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకొనుటయే గాక, బీద సాదలకు దాన, ధర్మాలు చేస్తాడు. అందరి నుండి గౌరవాదరాలు పుష్కలంగా లభిస్తాయి అతనికి. అది ఆనంద్న ఆశ్చర్య పరుస్తుంది. ఈ సంఘటనలు అతిసహజంగా చిత్రిస్తాడు రచయిత ఇరుకు అనే
కథా రూపంలో. కథలో పాత్ర చిత్రణ చక్కగా అమరింది.
కథలు:చురుకైన పిల్లలకు అవకాశం లభిస్తే, తమ పరిశ్రమతో జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. రాజుకు టెన్త్ (Xth) లో మంచి మార్కులు వస్తాయి. ఇంటరులో చేరి పైచదువులు చదవాలని అతని అభీష్టం. తండ్రి అందుకు ఒప్పుకోడు. బలవంతాన ఒక పెట్రోలు బంకులో నౌకరుగా జేరుస్తాడు. అచ్చట రాజు చేసిన ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని మార్చేస్తుంది! ఈ చిన్న సంఘటన చక్కని కథగా రూపొందుతుంది రచయిత హస్తాలలో! మౌనం మాట్లాడుతుంది లో శంకర్రావు పాత్రను చాకచక్యంతో పోషిస్తాడు రచయిత రాంబాబు. కథా సంవిధానం చెప్పుకో తగినది.

కథలు:వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకొనడానికి వెనకాడుతున్నారు ఈ తరం పిల్లలు కొంతమంది. ఈ నిరాదరణ మంచి సూచన కాదు. రానున్న కాలంలో మానవ సంబంధాలు విచ్ఛిన్న మవుతాయేమో నన్న శంకను కలిగిస్తున్నది. గంగాధరం కాన్సరు వ్యాధితో మరణిస్తాడు. అతని భార్య జానకమ్మను పోషించే బాధ్యతను గురించి పిల్లలు ముగ్గురూ వంతు లాడుకుంటారు. అది తెలుసుకొనిన జానకమ్మ బాధ పడుతుంది. కాలధర్మం అని సరిపెట్టుకుని, పిల్లలెవరికి కష్టం కలిగించకుండా ఒక వృద్ధాశ్రమంలో ఉండటానికి నిర్ణయించుకుంటుంది! ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా పిల్లలకు సూచిస్తుంది. గంగాధరానికి వచ్చిన డబ్బుల్ని తను ఆ ఆశ్రమానికి ఇస్తున్నట్లు తెలియ పరుస్తుంది. తన నిర్ణయాన్ని గురించి వాదులాడు కోవలసిన అగత్యం ఏమాత్రం లేదని పిల్లలకు తెలియజేస్తుంది! తల్లి పోషణా బాధ్యత లేకుండా డబ్బు మాత్రమే కావాలని కోరుకున్నవారు ఆమె నిర్ణయాన్ని హర్షించరు. “మా అమ్మ మమ్మల్ని రోడ్డుమీద పడేసింది” అనుకొంటారు! వారిలో పశ్చాత్తాప ఛాయలు అసలు గోచరించవు. కాలధర్మం కథా సంవిధానం, ముగింపు ఆహ్లాదకరంగా ఉన్నాయి. రచయిత మరోకథ నిర్ణయం లో కూడా ఇలాంటి సాంఘిక సమస్యనే ప్రస్తావించారు.
కథలు:టెక్నాలజీ మనజీవన విధానాల్లో తెచ్చేమార్పును, ముఖ్యంగా తల్లిదండ్రుల – పిల్లల మధ్య జరిగే మాటా మంతీ లో కనిపిస్తున్న తగ్గుముఖం, పిల్లలు రోజంతా కంప్యూటరుకు అతుక్కుపోవడం మనం రోజూ చూచే దృశ్యమే! దీనిని కథా వస్తువుగా స్వీకరించి, కోరికను
ఇంపైన కథగా రూపొందించాడు రాంబాబు! కథ చిన్నదైన తమాషాగా వుంది. చదువరులను తప్పక ఆకర్షిస్తుంది. స్వ
కథలు:ఫ్యాక్టరీలలో యాజమాన్యం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి అనుకోని సంఘటనలకు దారితీస్తాయి. అలాంటిదే జరిగింది వెంకటయ్య పనిజేసే ఫ్యాక్టరీలో. మేనేజిమెంటు ముప్పైయేండ్ల సర్వీసు అయిపోయిన వారి విషయంలో వి.ఆర్.ఎస్. అమలు జేయాలని తీర్మానించింది. ముప్పై యేండ్ల నుండి కంపెనీని నమ్ముకొని కంపెనీకే తన జీవితాన్ని అర్పించిన వెంకటయ్యలాంటి వాండ్ల ఫీలింగ్సు గురించి తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. ఇది వెంకటయ్యను మానసిక క్షోభకు గురిచేసి, అతని ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటనను చిత్రిస్తూ వ్రాసిన కథానిక ఋణానుబంధం. మానవ స్వభావాన్ని బాగా వ్యక్తీకరించారు రచయిత వెంకటయ్య పాత్రద్వారా.
కథలు:ఉద్యోగ విరమణ తరువాత ఎక్కడ స్థిరపడాలి అన్న సమస్య పరమేశం భావజాలంలో కలిగించిన సంఘర్షణ, తండ్రీ కొడుకుల ఆలోచనలలోని వ్యత్యాసం, చివరకు కొడుకు రవి, తండ్రి మానసిక స్థితిని అవగాహన జేసుకొని తండ్రి నిర్ణయాన్ని గౌరవించి, దానితో ఏకీభవించడం చక్కగా చెప్పబడింది పితౄణం కథలో. ఇందులో వ్యక్తపరిచిన సెంటిమెంట్ను మెచ్చుకో దగినవి. కథానిక శైలి, వాడిన భాష ప్రశంసింప తగినవి. మనిషిలోని సంఘర్షణ చిత్రించుటలో రచయిత సఫలుడయ్యాడు.
కథలు:’థ్యాంక్యూ అబూమియా’ అనేది ఒక వ్యక్తి చిత్రణ (Sketch)! అబూమియాతో కథకున కున్న అనుబంధం హృదయాన్ని కదిలించే విధంగా చిత్రితమైనది. కథలోని సంభాషణ సామాన్యంగా హైదరాబాదీ మధ్యవర్గపు ముస్లిములు మాట్లాడికునే విధంగా వున్నది. హైద్రాబాదు నగర జీవితంలో వస్తున్న మార్పులు అబూమియా కథాని:రచయిత తన రచనలలో ఎక్కడో ఒకచోట పాఠకులకు తప్పక దర్శనమిస్తాడు! తన అనుభవాలు, అనుభూతులు వెల్లడిస్తాడు. తండ్రీ నిన్ను తలంచి అనే కథ అలాంటిదే. కథలో చిత్రితమైన సెంటిమెంట్సు రచయిత జీవితానికి సంబంధించిన వైనప్పటికీ, అతి సహజంగా కథలో కలిసిపోతాయి. తండ్రిని కోల్పోయిన తర్వాత, ఆయన వ్యక్తిత్వపు విలువ అవగత మౌతుంది కథకునికి! మానవీయ దృష్టికోణంతో వ్రాసిన కథ ఇది. న విదేశంలో బాగా ధనమార్జించిన ఒక NRI డాక్టరు తన స్వగ్రామం, స్వజనుల వైపు తన కర్తవ్య బాధ్యతలు నిర్వహించ లేదన్న అపరాధ భావం కలరూపంలో అతని స్మృతిపథంలో మెలగి అతనిని బాధింప మొదలెడుతుంది. ఆ అపరాధ భావన నుండి విముక్తికై అతడు కొంతమంది మిత్రులతో కలిసి తన స్వగ్రామానికి వెళ్ళి అచ్చట స్థిర
కథలు:కుంటాడు. ఆ వివరాలను చక్కగా చిత్రించాడు రచయిత ‘స్వప్నగీత’ కథానిక రూపంలో. పడి, ఆ గ్రామానికి, గ్రామ ప్రజలకు అనేక విధాలుగా సేవ చేయుటకు నిర్ణయించు ఇశంతో కూడుకొన్న కథ. వర్తమాన కాలంలో NRIలు ఇటువంటి కలాపాల్లో ఆసక్తి కనబరచి, ఆంధ్రదేశం పట్ల తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ సంపుటిలోని చివరి కథ పసిడిమనసులు, తెలుగు మీడియంలో చదివిన పిల్లలూ, మనలో చాలామందికి ఉంది. అది సరియైన అభిప్రాయం కాదని, వాండ్లలో కూడా గవర్నమెంటు స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఏమీరాదు అని ఒక తప్పుడు అభిప్రాయం చురుకైన విద్యార్థులు ఉంటారని పసిడిమనసులు కథలోని పాత్రలైన కశ్యప్, మోహనులు నిరూపిస్తారు. పాత్రేచిత్యమైన వాడుక భాషలో వ్రాసిన ఈ కథ చాలామంది చదువరులను
ఆకర్షిస్తుంది.
కథలు:ఈ సంపుటి కథా రచయిత శ్రీ సి.ఎస్.రాంబాబు ఆధునిక కథకుడు. తన చుట్టూ వున్న సమాజంలో విషయాలను తీసుకొని చక్కని కథలను రూపొందించే యువ రచయిత. అన్ని ప్రాంతాల వ్యవహారిక భాషను కథా సంవిధానంలో ఇమడ్చడంలో ప్రావీణ్యం కల. అందరు నవీనుల వలె తనకథలలో ఇంగ్లీషు పద ప్రయోగం విరివిగా చేస్తాడు. ఇతని కథలలో లోకావృత్త పరిశీలన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాంబాబు కథలన్నీ వైవిధ్యంతో కూడి, చదువరులను ఆకర్షిస్తాయి. (ఒక మంచి కథ చదివామన్న తృప్తినిస్తాయి). ఇతనిని గురించి స్థూలంగా ఒక్క విషయం మాత్రం చెప్పవచ్చు. కథ ఎలా మొదలెట్టాలి, ఎలా నడపాలి, ఎలా ముగించాలి, కథకుడు పాత్రలచేత ఎలా మాట్లాడించాలి అనే విషయాలు చక్కగా అవగాహన చేసుకున్న వాడు రాంబాబు. ఇతనికి మంచి భవిష్యత్తు
వుంది.
ఈ సంపుటిలోని కథలన్నీ వైవిధ్యంతో కూడి, రచయిత స్పృశించని వస్తువు లేదా అన్నంత విస్తృతంగా ఉన్నాయి. కథానికలలో చదివించే గుణం, చెప్పే విధానంలో నవ్యత, వస్తువుని రసస్ఫోరకం చేసే ప్రతిభ ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందరూ తప్పక చదివి ఆనందించ వలసిన కథాసంపుటి ఇది. దీనిని తెలుగు పాఠక లోకం ఆదరిస్తుందని
ఆశిస్తూ,
రచన ఎప్పుడూ ఓ ఉత్సాహమే!
నువ్వు రచనలు ఎందుకు చేస్తున్నావు అంటే నా దగ్గర ఖచ్చితమయిన సమాధానం లేదు. అందమయిన అక్షరాల్లో అచ్చులో కనిపించే ఓ థ్రిల్లు కోసం ఓ అనుభూతి కోసమేమో అని ఎక్కడో అనుమానం. నా చిన్నప్పుడు ఆ రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఉన్నట్టు గానే మా ఇంట్లో పత్రికలకు కొదవుండేది కాదు. మా నాన్నగారి రాజకీయ చైతన్యం వలన న్యూస్ పేపర్లు ఎక్కువ చదివినా అక్కయ్యల ప్రభావం వల్ల పత్రికలవైపే మనసు లాగుతుండేది. ‘ప్రమదావనం’ ‘ఫాలాక్షుడి డెయిరీ’ ‘హైదరాబాద్ నోట్ బుక్’ (తిరుమల రామచంద్ర) వంటి శీర్షికలు, కథలు, సీరియళ్ళు చదువుతున్నప్పుడు ఏదో లోకంలో విహరిస్తున్నట్టుండేది. ఏదన్నా రాయాలన్న ఉబలాటమొకటి తొలిచేస్తుంటే నోట్ బుక్కులో రాసుకున్న కథలాంటిదాన్ని ఇంట్లో వాళ్ళు చూసి వీడికీ జబ్బు పట్టుకుందా అని నవ్విన గుర్తు. దెబ్బకి మళ్ళీ రాస్తే ఒట్టు.
AVG కానీ చదివే అలవాటు వదల్లేదు. డిగ్రీ చదువులో అది ఇంగ్లీషులోకి మారింది. ఆకాశవాణిలో చేరటం విజయవాడ లాంటి కేంద్రంలో పనిచేయటం మళ్ళా తెలుగు పుస్తకం వైపు మనసు మళ్ళింది. 1996-97 ప్రాంతంలో సీనియర్ కొలీగ్ డా. నాగసూరి వేణుగోపాల్ కాలమ్స్, వ్యాసాలు రాస్తున్నప్పుడు అది నాకు ఒక ప్రేరణ. అప్పుడే కథలు రాయాలన్న కోరిక కలిగింది. రేడియో స్టేషన్ లో డా. వి. చంద్రశేఖర రావు, పి.సత్యవతి వంటి వారి కథలని రికార్డు చేస్తున్నప్పుడు ఒక అలౌకిక అనుభూతి వెంటాడినప్పుడు కలం పట్టాను. ఆ తర్వాత వరంగల్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు వరంగల్ నగరంలోని సాహిత్య వాతావరణం మరింత ప్రేరణ ఇచ్చింది. కొలీగ్ మిత్రుడు సి. జయపాల్ రెడ్డి అప్పటికే చాలా కథలు రాసి పుస్తకం తెచ్చాడు. డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, అనిల్ ప్రసాద్, గిరిజా మనోహర్ బాబు వంటి మిత్రుల సాంగత్యం కాస్త పునాదిని విశాలం
చేసింది.
ఉద్యోగపర్వం తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కథల శిఖరం మంత్రవాది మహేశ్వర్ మళ్ళీ నన్ను ఆకర్షిస్తూ నాచేత కలం పట్టించారు. నిజం చెప్పాలంటే నా రచనా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన, అసలు నాకో ప్రత్యేక మార్గ నిర్దేశం చేసింది ఆదిలాబాదులో పనిచేసిన కాలం. నవ్య వారపత్రిక సంపాదకులు – ఏ.ఎన్.జగన్నాథశర్మ గారు, పాలపిట్ట సంపాదకులు గుడిపాటిగారు సాహిత్యం పట్ల నాకో తన అవగాహన కల్పించారు. జగన్నాథ శర్మ గారి వలన పుస్తక సమీక్షలు, రచయితల ఇంటర్వ్యూలు, వారి రచనా వ్యాసంగం, దృక్పథం, సాహితీ సమావేశాల కవరేజ్ వంటివి నాకు సాహిత్యపు పొరలను పరిచయం చేయటమే కాకుండా వాటిల్లో నన్ను పాల్గొనేలా చేశాయి. వారికి సర్వదా కృతజ్ఞుణ్ణి. అలాగే గుడిపాటి గారు ఫీచర్లు రాయించారు. పరిచయాలు చేయించారు. వీరిరువురితో ఎప్పుడు మాట్లాడినా ఎన్నో కొత్త అంశాలు తెలిసేవి. ఆదిలా ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు కథకుల మీట్ పెట్టే అవకాశం కలిగింది. రెండు
రాజధాని వాతావరణం అంతగా అనుకూలించలేదు.
రోజులపాటు జరిగిన కథా సదస్సు అది.
మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సాహిత్యం నా జీవనయానంలో భాగమయి పోయింది. వస్తువు, శిల్పం వంటి అంశాలపై ఎవరు చెబుతున్నా వినే అలవాటయింది. కథల పుస్తకం ఎప్పుడు తెస్తావని పలకరించేవాళ్ళు, కొత్తగా ఏం రాస్తున్నారు అని అడిగే వాళ్ళు, ఇలా రచన ఓ నూతనోత్సాహాన్ని నింపటం ప్రారంభమయింది.
నా కథ పడితే అందరికీ గొప్పగా చెప్పే మా అమ్మ, నువ్వు తెలుగు పేపర్ల ఎడిటోరి యల్స్ బాగా చదువు ఇంగ్లీషు పుస్తకాలు తగ్గించు అని ప్రేమగా చెప్పే నాన్నగారు వెళ్ళి పోయారు. వాళ్లున్నప్పుడు ఈ ప్రయత్నం చేసుంటే ఎంత సంతోషించే వారో. ఇక నా కథల్ని లోతుగా చదివి ఘాటుగా విమర్శించే అర్ధాంగి శారద సహకారం లేకపోతే నా కథా ప్రయాణం ఎప్పుడో ఆగిపోయేది. మావాడో రైటర్ అని చెప్పే కుటుంబ సభ్యులే – మా అన్నయ్యలు (సుబ్బారావు, విశ్వేశ్వర ప్రసాద్), అక్కయ్యలు (బాలసత్యవతి, లక్ష్మి, సరస్వతి), చెల్లెలు మాధవి నా ఊపిరి. నేను రాయటం వల్లనో, చదవటం వల్లనో నా పిల్లలు ప్రఫుల్, రాహుల్కి తెలుగు సాహిత్యం పట్ల ఇప్పుడిప్పుడే అభిమానం పెరుగుతోంది. వేగం ఇక నా కధలను అందంగా టైపు చేసి ఇచ్చిన మిత్రుడు కృష్ణ ప్రసాదు, మొదటి ప్రూఫ్ చూసిన మిత్రుడు విజయరాఘవ రెడ్డికి, రెండో సారి నా కథలను చదివి దిద్దిన ప్రముఖ రంగస్థల దర్శకులు రచయిత డి.వి.రమణమూర్తి గారికి, కథను చదివి తప్పొప్పులు చెప్పే సహోద్యోగులు మడిపల్లి దక్షిణామూర్తి, గోపీచంద్లకి, పుస్తకం ఎప్పుడేస్తున్నావని పదే పదే అడిగిన కవిమిత్రులు సుధామ గారికి, నా కథలను అడిగి మరీ నాకు ప్రవేశిక