రాంబాబు:కేవలం ‘కుటుంబ జీవులు’ మాత్రమే కాదు రాంబాబు కథల్లోని భార్యలు, భర్తలు. కుటుంబ స్వామే పరమార్థంగా చూసే ధోరణికి లోను కారు. వీలైనంతగా సమాజానికి చేయూతనిచ్చే సంకల్పం, ఆకాంక్ష, చొరవ, ఆచరణ గల పాత్రలే ఈ కథల్లో కనిపిస్తాయి. సవ్యమైన కుటుంబ జీవనంతో పాటు సమాజంలో ప్రజాస్వామిక మార్పులు కోరుకునే లక్షణం రాంబాబు పాత్రలకు ఉంది. దీనిని కేవలం ‘ఉదారవాదం’గా చెప్పలేం. అంతకుమించిన బాధ్యత ఏదో ఉందన్న అవగాహన కథల్లో మిళితమై ఆవిష్కృతమైంది.

రాంబాబు దేన్ని వాచ్యం చేయరు. అందంగా, సున్నితంగా చెబుతారు. ఇతివృత్తాన్ని ఎంచుకోడంలోనూ, కథానిర్మాణంలోనూ వైవిధ్యాన్ని పాటించారు. పాత్రలు తమ చైతన్యస్థాయికి తగ్గట్టు నడుచుకుంటాయి. పాత్రలకు ఆవేశకావేషాలుంటాయి తప్పితే
రచయిత ఆవేశానికి లోను కారు. ఇదొక మంచి లక్షణం.
ఇప్పటివరకు అతను రాసిన కథల్ని గమనిస్తే ఒక రచయితగా ఎంతటి అందుకని ప్రయాణాల్లోని మనుషులు పరిశీలన కలిగిన వారో అర్థమవుతుంది. అనుభవాలు, సంవేదనలు కథా వస్తువులయ్యాయి. తన అనుభవ పరిధిలోకి వచ్చిన సంఘటనల్ని కథానుగుణంగా మలచడంలో నేర్పుతో వ్యవహరించారు.
కొన్ని సమస్యలకు వ్యవస్థలో సమూలంగా మార్పులు వస్తే తప్ప పరిష్కారాలు లభించవు. అంతదాక ఆగడం సాధ్యం కాదు. అందుకే మనుషులు తమ పరిధిలో తాము ఏదో మేరకు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తారు. ఇది అనివార్యం. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోడం తప్ప మరో మార్గం ఉండదు. ఈ స్పృహని పాఠకుల్లో ప్రోది చేయడంలో ఒక రచయితగా రాంబాబు నిర్వహించిన
పాత్ర విలువైంది.
గ్లోబలైజేషన్ విధానాల విపరిణామాల్ని తన కథల్లో సృజించారు రాంబాబు. వ్యవస్థలో పెనుమార్పులు రావల్సిన అవసరాన్ని చెబుతూనే, తక్షణ పరిష్కారం కోసం ఏం చేయాలో చిత్రించారు. తమ జీవితాల్ని తమకు నచ్చినట్టు మలుచుకునే క్రమాన సమాజ హితం, తమ పరిధిలోని మనుషుల క్షేమం తలపోస్తాయి రాంబాబు కథల్లోని పాత్రలు. ఈ కథల్లోని ఆత్మీయత, ఆర్ద్రత వంటి లక్షణాలు రాంబాబులోనూ చూస్తాం.
చాలా కథలు ఉత్తమ పురుషలో ఉండటం గమనార్హం. జీవితం పట్ల సానుకూల, సంయమన దృక్పథం ఉన్న రచయిత దృష్టికోణంలోని వైశాల్యం సాహిత్యానికి మేలు చేస్తుంది. పాఠకుల చైతన్యపరిధిని విశాలం చేస్తుంది. కథ చదివాక పొంగులెత్తే ఆలోచనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. అందుకే పాత్రల్లో ఔన్నత్యం, ఔచితీమంతం కనిపించాలంటే అది రచయిత వ్యక్తిత్వంలో అంతర్నిహితమై ఉండాలి. ఈ కారణంగానే ఈ కథలు
కథల్లో సానుకూల దృక్పథం తొంగి చూస్తుంది. పాత్రల రూపకల్పనలోనూ, భార్య. మరికొన్నిసార్లు భర్త పాత్రల్లో నేర్పు, ఓర్పు తొంగి చూస్తుంటాయి. కొన్ని కథల్లో సన్నివేశాల నిర్వహణలోనూ సంయమనదృష్టి ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నిసార్లు. లాలనలో, చూపే మమతలో భార్య సేద దీరడం చూస్తాం. మరికొన్ని కథల్లో భార్య నేర్పు, కౌశలం, చూపే వాత్సల్యం భర్తని వివశుణ్ణి చేస్తుంది. ఒకరు లేనిదే మరొకరు లేనంత ప్రగాఢమైన చిత్రణ ఈ కథల్లో కనిపించే లక్షణం.
అలాగే తండ్రీ కొడుకుల, తల్లీ కొడుకుల సంబంధాల్లోనూ సంక్లిష్టతల్ని, వైరుధాల్ని మనుషుల మధ్య ఎడాన్ని పెంచే వ్యవస్థీకృత దుర్మార్గాన్ని గురించి కొన్ని చోట్ల చూపారు. చెప్పారు. వారి నడుమ ఉండేటువంటి అనురాగపు పార్శ్వాల్ని అర్ధంగా చిత్రించారు. అయితే ఆయా పాత్రల్ని దుర్మార్గంగా చిత్రించలేదు. వారి దుష్ప్రవర్తనకు గల మూలాల్ని
ప్రతీకాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించారు.
తరాల అంతరాల్ని చిత్రిస్తూనే తప్పు తెలుసుకున్న క్షణాన పశ్చాత్తాపం చెందే కొడుకులు ప్రవర్తనలోని సౌశీల్యాన్ని సూచ్యప్రాయంగా వ్యక్తం చేశారు. హృదయ సంస్కారానికి తావునిచ్చే ముగింపులే చాలా కథల్లో ఉంటాయి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు నెట్టివేసే పిల్లలతో పాటు, రిటైరయ్యాక తమదైన జీవితాన్ని నిర్మించుకునే తల్లిదండ్రుల మాటని మన్నించే కొడుకుల్ని రాంబాబు కథల్లో చూస్తాం. ఎందుకంటే రెండూ వాస్తవాలే. ఓ వాస్తవాన్ని మాత్రమే చూపితే అసంపూర్ణంగా ఉంటుంది. మరో మేలిమి వాస్తవాన్ని చెబితేనే సమాజంలోని మంచీచెడుల పట్ల పాఠకులు ఓ అవగాహనకు రాగలుగుతారు. ఈ దృష్టి ఉన్నందునే రాంబాబు కథల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా వ్యవహరించే పాత్రల ప్రవర్తన విస్మయం కలిగిస్తుంది. వాస్తవ విరుద్ధం అనిపించని కథనరీతి వల్ల కథ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడే కథకునిగా రాంబాబు సాఫల్యం దాగుంది.
రాంబాబు మాత్రమే కాదు, అతని కథల్లోని పాత్రలు కూడా ఒక తీవ్రత నుంచి మరో తీవ్రతకు లోనయ్యే పరిస్థితుల్లో చిక్కుబడరు. ముఖ్యంగా స్త్రీల పాత్రలు గొప్ప చొరవనీ, స్థితప్రజ్ఞతనీ, దయనీ, మానవీయ సుగుణాల్ని ప్రదర్శిస్తాయి. సాధారణంగా అత్తాకోడళ్ళకు పడదనే మాట చాలా సందర్భాల్లో వింటుంటాం. కానీ అత్తయ్యల్ని సమర్థించి, వారిని ఆదరించే కోడళ్ళను రాంబాబు కథల్లో చూస్తాం. కొడుకుల కన్నా కోడళ్ళు మరింత ఉండటం చూసి విస్తుపోతాం. సంక్షుభిత సమయాల్లోనూ భర్తకు దారిచూపే దేవతలా ఉంటుంది భార్య పాత్ర. ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలనే ఆరాటం,
తపనలు గల భర్తలనే ఈ కథల్లో చూడొచ్చు.
ఆల్ ఇండియా రేడియో అదిలాబాద్‌లో కథకులతో రెండురోజుల పాటు నిర్వహించిన సదస్సు ఓ మంచి జ్ఞాపకం. తన చుట్టూ ఉండే పరిసరాల్ని చక్కటి వాతావరణంతో వెలిగించే కౌశలం ఏదో రాంబాబుకు తెలియకుండానే అబ్బింది. స్నేహవాత్సల్యం తొంగి చూసే తన చెవిన పడినా పట్టనట్లు ఉంటాడు. అయితే పొరపాటునో, గ్రహపాటునో తటస్థించే సహజమైన ప్రవర్తన, నొప్పించని మాట అతనికే ప్రత్యేకం. గాసిప్స్‌ను పట్టించుకోడు. సంఘటనలు బాధించకపోవు. ఎదుటివారి తప్పిదాలే కారణమయినప్పటికీ కోపగించుకొనే ధోరణి లేదు. తన బాధను సైతం చాలా సున్నితంగా వ్యక్తం చేయడం రాంబాబు నైజం. సాహిత్యం విషయంలో మాత్రం ఆషామాషీగా ఉండడు. మంచీచెడుల పట్ల పట్టింపు ఉంది. సాహిత్యంలోని విభిన్నవాదాలు, ధోరణుల, గ్రూపుల పట్ల అవగాహన వుంది. అయినా కాగితం మీది రాతనే ప్రమాణంగా తీసుకోడం, దానిలోని మేలిమినే ముఖ్యంగా చూడడం రాంబాబు లోని సుగుణం. ఏ రచయితలో నైనా, కవిలో నైనా పదుగురికి ఉపకరించే అంశాల్ని చూసి ప్రస్తావించడం గమనించా.
తెలిసీ తెలియకనే ఓ సంయమన దృష్టి అలవరుచుకున్నాడేమో అనిపిస్తుంది. ఇది పనిగట్టుకొని ఆపాదించుకున్నది కాదు. అతని మూర్తిమత్వంలో భాగమిది. కాలం గడుస్తున్న కొద్దీ సాహిత్యం, సృజనాత్మక సంబంధాలపై ఆసక్తి పెరిగిందే తప్ప నిస్పృహ కనిపించలేదు. ఈ క్రమానే రాంబాబు రచనా వ్యాసంగం విస్తృతిని సంతరించుకుంది.
ఇంటర్వ్యూలు, సాహిత్యసభల రిపోర్టులు, పుస్తకసమీక్షలు, విశ్లేషణలు చేయడంతో పాటు అప్పుడప్పుడు కథలు రాస్తూ వచ్చారు. ఈమధ్యన కవిత్వం రాయడం రాంబాబు దినచర్యలో భాగమైంది. ‘అయితే ఏదో ఒక సాహిత్యప్రక్రియకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ పరిమితి విధించుకోనక్కర్లేదు. ఏకకాలంలో ఈ పనులన్నీ చేయగల సామర్థ్యం వుందతనికి. అయితే అంత తీరిక, సమయం లేదు. ఎందుకంటే సాహిత్యాంశాలపైనే కాదు, ఉద్యోగ విధుల్లోనూ నిబద్ధత, నిమగ్నత, కొత్త పుంతలు తొక్కాలనే ఆరాటం రాంబాబు లో చూసాను. ఉద్యోగవిధుల నిర్వహణకే అతని తొలి ప్రాధాన్యం. తన వల్ల అయ్యే పనులు చేయడమే కాదు, సాధ్యాసాధ్యాల్ని పక్కనపెట్టి కొత్త ప్రయోగాలు చేయడం రాంబాబు లో గమనించిన మరో అంశం. ఈ కారణంగానే ఆకాశవాణికీ, సాహిత్య ప్రపంచానికీ, పాఠకులకీ నడుమ సాన్నిహిత్యం, అనుబంధం ఇనుమడించాయి.
ఈవిధంగా ఎన్నో కోణాల్నించి రాంబాబును అసంకల్పితంగానే చూసాను. అందుకే ముందుమాట రాయడం మొదలెట్టగానే పలు సందర్భాలు, జ్ఞాపకాలు కళ్ళముందు తారసిల్లాయి. మరి వీటికీ, రాంబాబు కథలకీ ఏమిటి సంబంధమనే ప్రశ్న రావచ్చు.
వృద్ధాశ్రమం మాయిద్దరి కల. ఆ కల నిజమవ్వటానికి యిద్దరిలో ఎవరున్నా చాల ఇందులో ఇంకో అభిప్రాయం లేదు. శంకరం అంటే ఇష్టమున్న వాళ్ళు ఈ వృద్ధాశ్రమం లో పాలు పంచుకుంటే పై నుంచి శంకరం సంతోషిస్తాడు. దయచేసి మేం దాచుకున్న న్నది నా అభిప్రాయం. శంకరం అనుకున్నట్లే ‘అమ్మ ఒడి’ రూపుదిద్దుకుంటుంది. సొమ్ముని వృధా చేస్తున్నామని మాత్రం భావించకండి. రఘు, వాణిలు కూడా మా
ఇష్టాన్ని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా.
“ఇంకో విషయం. కర్మ కాండలు పూర్తయినా వైవాహిక జీవితం తాలూకు గుర్తుల్ని నేనింకా కొనసాగిస్తున్నానని మీరు అసంతృప్తితో వున్నారు”..
బొట్టు నాకు మా అమ్మ ఇచ్చింది. నా మెళ్ళో శంకరం కట్టిన ‘తాళి’ తను లేక పోయినా అతని నీడలాగా నా వెంట వున్నట్లు నాకు గుర్తు చేస్తుంది. నాకు రక్షణ కవచంలా ఈ తాళితో నిలుస్తున్నాడు శంకరం. మీ అందరికీ నేనంటే ప్రేమ ఉండ బట్టే ఈ మాట నాకు ఎలా చెప్పాలా అని మధనపడుతున్నారని తెలుసు. మీకు కష్టం కలిగించినా, నేను నమ్మిన మార్గంలోనే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. మీ అందరి గుసగుసలు నాకో వేదిక కల్పించాయి. నేను ఇలా చేసినప్పుడే శంకరం ఆత్మకు శాంతి లభిస్తుంది”. విశాలాక్షి మొహంలో అదే నిబ్బరం. అదే ఆత్మ విశ్వాసం. విశాలాక్షి మాటలకు తిరిగి మారు మాట్లాడలేక మొహాలు చూసుకున్నారు.
అందరూ, పిల్లలతో సహా.
తనకు నచ్చినట్టుగా జీవించి, ఇంకా అదే మార్గంలో సాగాలనుకున్న విశాలాక్షి ఏం సాధించింది అన్న ఆలోచనలో పడ్డా. ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని మనుషుల్ని ప్రేమించడానికి, ఆప్యాయతను రంగరించటానికి జీవితాన్ని మలుచుకుంది అని అర్ధమయింది.
ఆ బాటలో సాగే క్రమంలో ఎదురయ్యే రాయీ, రప్పల్ని తొలగించింది. బాటంతా అందమయిన పూలను పరుచుతూ ముందుకెళ్ళింది.
ఆ దారి ఏర్పరచిన పూల పరిమళాలు ఆ బాటన సాగేవారందరికీ అందాయి. ఈ సత్యాన్ని తెలుసుకునే సరికి నా జీవితం అయిపోయిందనిపించింది.
ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. విశాలాక్షిని ఆరాధించి ప్రేమలేఖ పంపి తొలి చెంపదెబ్బ తిన్న భగ్న ప్రేమికుడిని. ద్వేషం పెంచుకోకుండా ఆమె జీవితాన్ని దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న వాడిని. ఏమీ ఆశించకుండా మనుషుల్ని ప్రేమించటమే నిజమయిన ప్రేమ అని విశాలాక్షి ద్వారా గ్రహించిన వాడిని.
. ఇటు శంకరం కూడా అనుకోని ఈ పరిణామానికి మానసికం గా చాలా దిగులు చెందాడు. విశాలాక్షి ఊరుకుంటుందా లెక్క ప్రకారం ఊ కదా. ముందుగా శంకరం కొలీగ్ భార్యను కలిసి మాట్లాడింది. తనమీద అండాలు వేయటానికి, నిందించటానికి వచ్చిందేమోనని మొదట భయపడింది. కానీ తర్వాత విశాలాక్షి అసలు ఉద్దేశాన్ని గ్రహించి బావురుమంది. ఆవిడ్ని తీసుకుని విశాలాక్షి హెడ్డాఫీసుకు వెళ్ళింది. తోడుగా ఆఫీసు వాళ్ళని ఇంకో ఇద్దరిని తీసుకెళ్ళింది. కేవలం శంకరం నిజాయితీని సమాధి చేయటం కోసం చేసిన ఫిర్యాదు తప్ప మరొకటి
కాదని నిరూపించింది.
ఆ తర్వాత శంకరం జోలికి రావటానికి సాహసించలేదెవ్వరూ.
***
విద్యాదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్మేది విశాలాక్షి. తమ వీధిలో ఉన్న పిల్లలకి సాయంత్రం పూట చదువు చెప్పేది. చదువుతో మంచి నీతి
కథలు చెప్పేది. క్రమశిక్షణ నేర్పేది.
పిల్లలు రఘు, వాణిలకు మాత్రం వాళ్ళమ్మ అలా వీధిలో అందరి పిల్లలకు చదువు చెప్పటం అంతగా నచ్చేది కాదు. వాళ్ళమ్మ మీద విసుక్కునే వాళ్ళు. అలాగే . తమ పిల్లలకు నచ్చని మరో నిర్ణయం కూడా తీసుకుంది విశాలాక్షి.
అందరూ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలోనూ, కార్పొరేట్ బళ్ళలోనూ చేరుస్తూ ఉంటే విశాలాక్షి, శంకరాలు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చేర్చారు. చుట్టాల పిల్లలందరూ వీళ్ళని కొంచెం చులకనగా చూసేవారు. తెలుగు పప్పు ముద్దలు
అని వెక్కిరించేవారు.
అలా వెక్కిరించే పిల్లల్ని దాటి ముందుకెళ్ళాలని విశాలాక్షి పిల్లలు తపన పడు తుండేవారు కాదు. ఆ విషయాన్ని వాళ్ళమ్మకు చెప్పకపోయినా తమని ఇలా గవర్నమెంట్ బళ్ళో వేశారని మాత్రం అమ్మా, నాన్నమీద కొంచెం కోపం ఏర్పడింది పిల్లలకు. అయితే ఆ కోపాన్ని చదువు మీద చూపించేవారు.
తెలుగు మీడియంలో చేర్పించినందుకు పిల్లలు కొంచెం కినుక వహించారని విశాలాక్షి, శంకరాలు గ్రహించకపోలేదు. పెద్దయితే వాళ్ళే అర్ధం చేసుకుంటారను కునేవారు. పిల్లలిద్దరూ మంచి ర్యాంకులు సంపాదించారు. ఉన్నత చదువులు చదివారు. కానీ వాళ్ళమ్మా నాన్నలకు ఇష్టంలేని పనొకటి చేశారు.
పై చదువుల కోసమని అమెరికా వెళ్ళిపోయారు. తల్లిదండ్రులకు అది ఇష్టం లేదని తెలిసినా సర్దుకోలేకపోయారు. అంతటితో ఆగలేదు వాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా
ఇద్దరికీ ఒకటే న్యాయం. ఆడవాళ్ళు బలహీనులు కాబట్టే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారని. సహించకూడదని ఉద్బోధించేది. ఇందుకు తండ్రి వెంకట్రావు చిన్నప్పట్నించి చూపిన పిల్లలకి చెప్పేది. తానూ చేసి చూపించేది. ఆడవాళ్ళ పట్ల జరిగే అన్యాయాన్ని కారణమయితే, తను చేస్తున్న పనులకు అందరి ప్రోత్సాహం లభించడం
నమ్మేది. శరీర దారుఢ్యాన్ని మగవాళ్ళతో సమానంగా ఉంచుకోవాలని ఆడ
మరో కారణం.
చాలా మందికో సందేహం ఉండేది. విశాలాక్షి పెళ్ళి చేసుకుంటుందా?
చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటుంది?
అసలు విశాలాక్షి కాలేజీలో చదివే రోజుల్లో అమ్మాయిలతో బాటు అబ్బాయిలకు కూడా ఓ ఆరాధన భావన ఉండేది. అది విశాలాక్షి అందం చూశా, విశాలాక్షి ధైర్య సాహసాలు చూశా అంటే చెప్పటం కష్టమే. అప్పటికి కొంతమంది ప్రేమలేఖలు రాసి ఎంత దెబ్బతిన్నారంటే మళ్ళీ జీవితంలో ఇంకో ఆడపిల్ల వైపు చూసే ప్రయత్నం
చేయలేదు.
విశాలాక్షి బంధువులు, తెలిసిన వాళ్లంతా కూడా అసలు విశాలాక్షి ఏదో ఒక ఉద్యమంలో చేరటం ఖాయమని భావించారు. అందుకని ఇంకా విశాలాక్షి తెలిసి, విశాలాక్షికి సంబంధాలు చెప్పటానికి జంకారు. విచిత్రంగా విశాలాక్షి ఉద్యో విశాలాక్షికి పెళ్ళి సంబంధాల వేట ప్రారంభించారు తండ్రి వెంకట్రావు, అన్నలు. గాల వైపు కూడా కన్నెత్తి చూడలేదు. విశాలాక్షి ఉద్యోగానికి దూరంగా ఉండటంతో “చిన్నప్పట్నించి మీ నాన్న చేసిన గారాబం ఇవ్వాళ కొంపమీదకు తెచ్చింది” విశాలాక్షి తల్లి దెప్పటం మొదలు పెట్టింది.
ఈ క్రమంలో విశాలాక్షి అన్నలిద్దరు పెళ్ళిళ్ళయిపోయాయి. కొత్త కోడళ్ళిద్దరూ విశాలాక్షి ఆలోచనల్ని చూసి విస్మయం చెందారు. వదినలిద్దరూ ఉద్యోగస్తులే. చక్కటి క్వాలిఫికేషన్స్ ఉన్న ఆడపడుచు ఉద్యోగం చేయకపోవటం వాళ్ళకు ఆశ్చర్యమని
పించింది. అదే విషయం అడిగారు కూడా.
“ఇవాళ కాకపోతే రేపయినా పెళ్ళి చేసుకునేదాన్నే. ఒకసారి ఉద్యోగం అంటూ చేయటం మొదలుపెడితే మానటం మళ్ళా కష్టం. ఆ తర్వాత పుట్టే పిల్లలకు అన్యాయం చేసిన దాన్నవుతాను. అందుకే ఉద్యోగానికి దూరంగా వున్నాను”. విశాలాక్షి మాటలతో వదినెలు తృప్తి చెందలేదు.