వెనుకబడ్డ:నిశ్చలంగా వున్నాడు. గంగారెడ్డి భార్య, పిల్లల దు:ఖం పొరలు పొరలుగా సిద్ధంగా ఉన్నట్లు వారందరిని చూసిన తర్వాత నాకనిపించింది. 2 ఊరిని కమ్మేస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒక దుఃఖ కెరటం పోటెత్తి కబళించడానికి
“వద్దురా
ఎక్కువయిపోయె. దిగుబడి తక్కువయి పోయె. పోనీ రేటన్నా వున్నదా అంటే 3 ఇన్నాడా. అప్పులు చేసి చేసి ఆ పత్తిమీదే పెట్టిండు. పెట్టుబడి,
లేకపోయె” ఎవరో మాట్లాడుతున్నారు.
అదీ
వెనుకబడ్డ:”ఏ కంపెనీ వాడు చెప్పిండంటూ ఏమేమో వాడిండు. దశతిరుగుద్ది మావా! ఎకరానికి ముప్పై క్వింటాళ్లు తీస్తా ఏమనుకున్నవో అన్నోడు ఈ పని జేస్తడని ఎట్లను
కుంటాం” వూరి సర్పంచ్ అంటున్నాడు.
“ఏమయింది, దిగుబడి రాలేదా?” అడుగుతున్నారు.
“యాడొచ్చింది. పూతొచ్చింది. కాతలేదు. మొక్క మాత్రం పెరిగింది. ఈడి
గుండె సెరువయింది”.

“ఇంకెవరూ జెయ్యలేదా ఇట్ల” చర్చ ఆగలేదు.
వెనుకబడ్డ:”జేసిన్రు, కానీ మనోనికి స్పీడెక్కువ కదా. కిందపడ్డాడు. దెబ్బతిన్నడు” ఇదన్న మాట. గంగారెడ్డి కోలుకోలేని దెబ్బ ఎలాతిన్నాడో అర్థమయింది. మరి ఎందుకు ఈ విషయాలన్నీ గంగారెడ్డి తన దగ్గర పోనీ తను అడిగాడా! ఆ ఆలోచనే నా చెంప ఛెళ్లుమనిపించినట్లుగా తోచింది. గంగారెడ్డి మొహంలో దిగులు చూశాను. కానీ దిగులు వెనక ఉన్న కారణాన్ని వెతికే ప్రయత్నం చేయలేదు. నేనేం స్నేహితుడ్ని అని ఆ క్షణాన దు:ఖం నాలో కమ్ముకుంది. ఉబికివస్తున్న కన్నీటిని కర్చీఫ్తో అదిమి పెట్టాను. ఆ సాయంత్రం అమ్మను అడిగాను గంగారెడ్డి భార్యా,పిల్లల పరిస్థితి ఏమిటని.
వెనుకబడ్డ:”చిన్నోడా మీ మొగోళ్లంతా ఇంతేరా. మీకు తోచింది మీరు చేస్తారు. కనీసం పెళ్లానికో మాట కూడ చెప్పరు. ఆ గంగారెడ్డి ఏ రోజయిన ఇదీ నా కట్టం అని పెళ్లాంతో జెప్పుకున్నాడ్రా! ఆడి పెళ్లాం గౌరి మొత్తుకునేది ఈ మడిసి ఏ విషయమూ చెప్పడమ్మా. మనం జెప్పేదీ ఇనడూ అని. పీకల మీదకు రాగానే చేతులెత్తేసి తన చావు తాను చూసుకున్నాడు. ఆడదాని సహకారం లేకుండా యవసాయమెట్ల జేత్తరా మీరు! మీ నాయనా అంతే. ఏ రోజయినా నాకో మాట జెప్పిండా! పంట బాగా వత్తే రొమ్ము ఇరుసుకుని తన గొప్ప అని చెప్పటం, మునిగిన్నాడు మునగదీసుకు పడుకోవటం, ఇదే కదా మీ నాన్న జేత్తా వత్తింది. కానీ కట్టమంతా నేను సేయాల. ఆడకూలీలు | సేయాల. గంగారెడ్డి పద్ధతులంటే ఆయనకు ఇష్టం లేదు. అందుకియ్యలేదు కౌలుకు
పైకేమో నాకిట్టంలేదని చెప్పిండు. మనమెంత బరువు మొయ్యగలమో జూసుకోవాల. అంతేకాని బరువు ఎత్తలేక సతికిలపడితే ఇట్లనే అయితది”
వెనుకబడ్డ:గంగారెడ్డి ఇలా అకస్మాత్తుగా తనువు చాలించటంతో ఆవిడ దుఃఖం ఆపుకోలేక పోయింది. అణచిపెట్టుకున్న బాధంతా నిరసన రూపంలో లావాలా తన్నుకొచ్చింది. కన్నీటితో అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.
***
వూర్లో జరిగిన విషయాల్ని వివరంగా లక్ష్మికి చెప్పాను. అమ్మ మాటల్ని నాకన్నా తనే బాగా అర్థం చేసుకుంది.
ఆ
వెనుకబడ్డ:“అత్తమ్మ మాటల్లో తప్పేముంది. పొలంలో పనిచేసేది, చేయించేది భార్య. భార్యకేమీ చెప్పకుండా తనిష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్లిపోయాడు గంగారెడ్డి. ఏ రోజన్నా తన కష్టాన్ని భార్యతో చెప్పుకున్నాడా. గంగారెడ్డే కాదు మీ మొగాళ్లందరూ భార్యలకు మీ కష్ట సుఖాల్ని చెప్పరు. చెప్పుకుంటే అది మీకు నామోషీ”
నాకు బుర్ర తిరిగిపోయింది. వూర్లో వున్న అమ్మ, ఇక్కడ లక్ష్మీ ఒకేలా ఆలోచిస్తు న్నారు. అటు నాన్న ఇటు నేను, మా ఇద్దరి ఆలోచనల్లో ఎక్కడా సారూప్యత లేదు. ఆడవాళ్లలో వుండే అభద్రతా భావం వల్ల అలా ఆలోచిస్తున్నారేమో అని సరి పెట్టుకున్నాను.
వెనుకబడ్డ:కాలం ఎవ్వరికోసం ఆగదు. తన దారిన అది ప్రవహిస్తూనే వుంటుంది. మా పెద్ద వాడి పదోతరగతి చదువు, ఎనిమిదో తరగతి చదువుతున్న మా అమ్మాయి సైన్స్ ఫెయిర్ కోసం వూళ్లు తిరగటం, ఆఫీసు పని ఒత్తిడి వీటన్నిటితో గంగారెడ్డి నా ఆలోచనల్నించి కనుమరుగయిపోయాడు. ఎందుకో నాకు మా వూరు వెళ్లాలనిపించ లేదు. నాన్న, అమ్మ వచ్చి కనిపించి వెళ్లిపోతున్నారు.
వెనుకబడ్డ:”చిన్నోడా గంగారెడ్డి పోయి సంవత్సరం అయిపోయిందిరా. ఆడి సమత్సరీకం నాటికయినా రారా! ఆడ్ని, ఆడి కుటుంబాన్ని మర్సిపోయావురా” అమ్మ నిష్ఠురంగా ఫోన్లో పలికింది. అమ్మ మాటలు కొరడా దెబ్బల్లా తాకాయి. ఎలా మర్చిపోతాను బాల్య మిత్రుణ్ణి. పని ఒత్తిడి, కుటుంబ ప్రాధాన్యతల్ని సాకుగా చూపించి నా మనస్సాక్షిని నేనే నొక్కేశాను.
పురోహితుడు మంత్రాలు చదువుతూ పూజ చేయిస్తున్నాడు. గంగారెడ్డి ఫోటోలో నుంచి నవ్వుతూ నన్ను పలకరిస్తున్నాడు. “ఇన్నాల్టికి గుర్తొచ్చానా క్రిష్ణా” అంటున్నాడు.
బాధగా తలొంచుకున్నాను. ఊరివాళ్లు, గంగారెడ్డి చుట్టాలు
అందరూ
వచ్చారు.
వెనుకబడ్డ:ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వద్దనుకుంటున్నా అవి నా చెవిలో పడుతున్నాయి. . ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదా? మన మధ్య వుండేవాడు కాదూ!” సర్పంచ్ అంటున్నాడు. “గంగారెడ్డి భార్య మాట వినుంటే, కనీసం తన కష్టాలు భార్యకి చెప్పుకుంటే “ఫోన్లే మావా! మొగుడు పోయాడని మూలనే కూసోకుండా మా కోడలు తురాలు కాబట్టి యవసాయంలోకి దిగింది. మొగుడు జేసిన తప్పుల్ని ఎతికింది. ఉన్న కత్తి పొలంలోనే ఇన్నెయ్యొచ్చు అన్న విషయమే తట్టలేదు నాకు” గంగారెడ్డి తీసేది. కూరగాయలు పెట్టింది, జొన్నలు పెట్టింది, పసుపేసింది, నువ్వులేసింది,
తండ్రంటున్నాడు.
వెనుకబడ్డ:“అంతేనేం, పొలం కౌలుకు తీసుకుంది. దాంట్లో కందులు, మినుములు పెట్టింది. పిల్లల్ని తోడు పెట్టుకుని మరీ యవసాయం చేసింది. గంగారెడ్డి మీద ప్రేమతోనో, సానుభూతోనో శానామంది ఆళ్లకి సాయపడ్డారు. ఇయ్యాల మనూళ్ల ఇన్ని లేసిన మొగాడంటే గంగారెడ్డి పెళ్లామే” ఆశ్చర్యంతో నాకు మతిపోయింది.
ఇదేమాట అమ్మని అడిగాను.
వెనుకబడ్డ:”అవునా, ఆ గంగారెడ్డి బతికుండి ఇయ్యన్ని పెళ్లాన్ని అడిగిసేస్తే ఆ కుటుంబంత సుకంగా ఉండేది. అయితేనేం గంగారెడ్డి పెళ్లాం ఇంత దుక్కంలో కూడా తను సెయ్యాల్సింది మర్సిపోలేదు. మొగుడి దుక్కాన్ని ఇలా పూడుకుంది”.
“మరి కౌలుకు పొలమెవరిచ్చారు”
వెనుకబడ్డ:“మన పొలమే ఇచ్చాం. మీ నాన్నకు నమ్మకం కుదిరి ఇద్దామన్నాడు. నా మనసులో కూడా అదే వుండింది. అయితే గంగారెడ్డి అన్నీ తను అనుకున్నట్టుగానే సెయ్యాలనుకునే మొండోడు. కానీ ఆడి పెళ్లాం గౌరి సూడు., అందర్ని అడిగింది, తెలుసుకుంది. కట్టబడింది. సంవత్సరం తిరక్కుండా అనుకున్నది సేసి సూపించింది. ఇదేరా చిన్నోడా మొగోడికి, ఆడదానికి వుండే అంతరం. ఇది మీ మొగోళ్లకి అర్థం
కాదు.”
లోపం మా మగజాతిలో వుంది. ఇంకెక్కడా లేదు.
ఆ క్షణాన అమ్మలో గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు కనిపించాడు.
ఇరుకు
వెనుకబడ్డ:విసుగ్గా వాచీ చూసుకున్నాను. రోజు ఈ పాటికి వచ్చేసేవాడు శంకరం. ఈ రోజింకా రాలేదు అనుకున్నాను. కారు ఎ.సి చల్లదనం మెత్తగా స్పృశిస్తుంటే సెల్లో ఈ మెయిల్స్ చెక్ చేసుకోవటం మొదలుపెట్టాను. ఇంతకీ శంకర్రావు, నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇద్దరం సెక్షన్ ఇన్ఛార్జులమే. ఇద్దరివి పక్కపక్క క్యూబికల్స్. శంకరం నాకన్నా ఐదారేళ్ళు చిన్నవాడు. ప్రభుత్వం వారు సూచించినట్లు ఫూల్ ట్రాన్స్ పోర్ట్ భాగంగా ఇద్దరం ఆఫీసుకు ఒకే కారులో వెళ్తాం. నిజం చెప్పొద్దూ, ఇది నాకు సౌకర్యంగా ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. కారు నాది కాబట్టి పెట్రోల్ ఖర్చులో 60 శాతం శంకరానిది, నలబై శాతం నాది. మా ఇద్దరిళ్ళు ఎదురెదురుగానే ఉంటా యి. నాది సొంతిల్లు. శంకర్రావు అపార్టుమెంటులో అద్దెకుంటున్నాడు. మా వ్యక్తిత్వాలు కూడా కలవవు. కానీ అవసరం మమ్మల్ని కలిపింది. శంకరానిది జాలి గుండె. చాలా సున్నితంగా ఉంటాడు. అతను మనసుతో ఆలోచిస్తాడు. నేను నా బ్రెయిన్ పవర్ ఉపయోగిస్తాను. ‘బీ ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్’ అంటాన్నేను. మనిషి ఆలోచన ప్రాక్టికల్గా ఉండాలని బలంగా నమ్ముతాను. అందుకే ఆఫీసులో వీళ్ళిద్దరికీ లంకె ఎలా కుదిరిందా అని ఆలోచిస్తారు.
ఏదయినా పని చేయాలంటే నాకు గిఫ్టులు కావాలి. డబ్బులు బల్లమీదయినా పెట్టాలి. కాదంటే బల్లకిందనుంచి ఇవ్వాలి. కొండకచో పార్టీలు ఇవ్వాలి. అవిచ్చే వాళ్ళు నా ప్రాధాన్యత క్రమంలో ఉంటారు. అదే మీరు శంకరాన్ని కదిలించి చూడండి ఎవరయినా ఒకటే అంటాడు. సీరియల్ నెంబరు ప్రకారం వెళతానంటాడు. అందుకనే చాలామంది తమ ఫైల్స్ అతని టేబుల్ మీదకు కాకుండా నా టేబుల్ పైకి వస్తే
విరహ నాయికలా ఉంటుంది. శంకరం
నాకు అతని
నేనా
చెప్పినా
అసలు శంకరం ఆలస్యం చేస్తున్నందుకు ఈ పాటికి నాకు కోపం వచ్చేయాలి కదా. వింటాడు. నాకో పెద్దరికమిస్తాడు. దానివల్ల నా అహం తృప్తిపడుతూ ఉంటుంది. దాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. శంకరం ఆలస్యంగా వచ్చినప్పు డల్లా ‘కామత్’ లో కట్లెట్, కాఫీ ఇప్పించాలి. ఇది మా ఒప్పందం అని నేను పైకి
చెప్పినా, అది నేను పొందే లాభం.
అదిగో వస్తున్నాడు శంకరం ఆయాసపడుతూ భుజానికి తగిలించుకున్న బ్యాగుతో, కామల్లో కాఫీ తాగి చాలా రోజులయింది అనుకున్నాను తృప్తిగా.
శంకర
–
‘సారీ ఆనంద్ – ఇవ్వాళ గురువారం కదా! కొంచెం చిల్లర తెచ్చుకునేటప్పటికి ఆలస్యమయింది. కారు తలుపు తీసి లోపల కూర్చుంటూ అన్నాడు. గేరు మారుస్తూ
ఇవ్వాళ శంకరం ఆలోచనల రూట్ మార్చాలనుకున్నాను.
“అది సరే శంకరం. ప్రతివారం గుడిదగ్గర నువ్వు దానం చేసే మొత్తం ఓ వంద రూపాయలుంటుంది. నెలకు నాలుగు వందల చొప్పున లెక్కవేసినా సంవత్సరా నికి నాలుగు వేల ఎనిమిది వందలు. పోనీ ఒక్క గురువారమే అంటే మళ్ళీ శనివారం సాయంత్రం గుడికి వెళతావు. అక్కడ లెక్క వేరే. ఇలా నెలకి ఎనిమిది వందల రూపాయలు. దీని వల్ల ఎవరికి లాభం? పుణ్యం సంపాదించుకుని వచ్చే జన్మలో మరింత బాగా ఉండాలనా? లేదంటే పునర్జన్మ లేకుండా ఉండాలనా? అంటే నీ స్వార్థం కోసమేగా ఈ దానాలు?” ఎ.సి చల్లదనంలో శంకరానికి నా మాటలు చెమటలు పట్టిస్తాయనుకున్నాను. అందుకేనేమో వెంటనే సమాధానం ఇవ్వలేదు.
రెండు నిమిషాలాగాడు.
‘ఆనంద్, పాపపుణ్యాల చిట్టా దగ్గర పెట్టుకుని నేనేదో ఇస్తున్నానని అనుకోవటం లేదు. ఎన్నో జన్మలెత్తిన తర్వాత మనిషి జన్మ ప్రాప్తిస్తుందని చదివాను. విన్నాను. వచ్చే జన్మలో ఎవరం ఎలా ఉంటామో తెలీదు. అసలు జన్మంటూ ఉంటుందో కూడా తెలీదు. ఇలా అందరికీ ఇవ్వు అని ఆ బాబా నన్ను ఆజ్ఞాపించాడనుకుంటున్నాను. 5 ఇస్తున్నాను. మనం మల్టీప్లెక్స్ లో సినిమా చూసి ఒక పిజ్జానో, బర్గరో తింటే అయ్యే
ఖర్చు కన్నా ఇది ఎక్కువని నేననుకోవటం లేదు’
శంకరం వాదన ఇలాగే వుంటుందని నాకు తెలుసు. అయినా అతనిలో ఏదో మార్పు తేవాలని నా వెర్రి ప్రయత్నం.
రీడు ‘నువ్వు చెప్పిందే రైటనుకుందాం. నీ కుటుంబానికి ఇవ్వవలసిన ఆనందాన్ని సుఖాన్ని ఆ మేరకు నువ్వు త్యాగం చేసినట్టే కదా’
‘ఎంతసేపూ నేనూ నా కుటుంబం అని ఆలోచిస్తూ కూర్చుంటే సమాజం ఇలాగే ఉండేదా ఆనంద్?’ ఈ శంకరం ఎప్పుడూ ఇంతే. ఏదో సమాజాన్ని ఉద్దరిస్తున్నాననే ఒక భ్రమలో బతుకుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా మార్చలేడని దృష్టి రోడ్డు మీద పెట్టాను. మొత్తానికి వీడి నోరు మూయించగలిగానని శంకరం కూడా అనుకుంటున్నాడేమో! శంకరం కూడా నాలాగే ఆలోచిస్తాడన్న నా పిచ్చి ఊహకు నాకే నవ్వొచ్చింది.
ఇద్దరం మా కేబిన్లలో కూలబడ్డామో లేదో, మా ప్యూన్ సాయిలు వచ్చాడు డైరెక్టర్గారు రమ్మన్నారంటూ. క్రీగంట శంకరం వంక చూశాను. మొహంలో ఏ ఫీలింగూ లేదు. శంకరానికి మా బాగా క్లాసు ఆనందించాలన్న కోరిక కలిగింది
ఆ క్షణాన.
***
గ్లాస్ చప్పుడు చేయకుండా మమ్మల్ని లోపలికి నెట్టింది. ఒక్క క్షణం తలెత్తి చూశాడు బాస్. ‘టేక్ యువర్ సీట్స్’ అన్నాడే కానీ చాలా అసహనం ధ్వనించింది ఆ గొంతులో. నేరుగా విషయంలోకి వచ్చేశాడాయన.
‘శంకరం గారూ డైరెక్టరేట్ వాళ్ళడిగిన స్టేట్ మెంట్ ఎంతదాకా చేశారు. మీకు చెప్పి రెండు రోజులయింది. ఢిల్లీ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా అవ్వలేదా అంటున్నారు. అయినా మనకున్న ఇన్పుట్స్తో చెయ్యమన్నాను కదా. మీరేమిటి మొత్తం రికార్డులన్నీ తవ్విస్తున్నారట. ఆ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి. మీ స్టేట్మెంట్ ఎప్పుడవుతుంది. ఎవడో ఢిల్లీలో కొత్తగా వచ్చాడు. వాడి ఉనికిని చాటుకోవటం కోసం ఇలాంటి అర్థం పర్థం లేనివి అడుగుతూ ఉంటాడు. అది వాడికీ తెలుసు. మనకూ తెలుసు. అక్కడ స్టేట్మెంట్ ఎంత కరెక్టుగా ఉన్నది అన్నదానికంటే ఎంత తొందరగా పంపించామన్నది ప్రధానం. ఈ మాత్రం చిన్న లాజిక్ తెలుసుకోకపోతే ఎలా మీరు? ఆనంద్, ఆ స్టేట్మెంట్ మీరు తయారు చేయండి. సాయంత్రం లోపల పంపించాలి. నౌ యు కెన్ గో’. నాకు ఆనందం కలిగించే ఆ నాలుగు మాటలు అని తన ఫైళ్ళలో మునిగిపోయా