–
ధ్యానం ఏదైతే నీకు క్రమబద్ధంగా (orderly), సమరసంగా కనిపిస్తుందో, దేని భవిష్యత్తును ముందుగానే చెప్ప వీలవుతుందో అవన్నీ సహజమైనవి అని నువు అన్నప్పుడు ఉన్నత సూత్రాలను (higher laws) శిరసావహించే దానినీ, ఉన్నత శక్తుల (higher powers) చే కదిలించబడేదానినీ స్వతస్సిద్ధములు (spontaneous) అనవలసి వుంటుంది. ఆ విధంగా మనకు రెండు సహజ శ్రేణులున్నట్లు : ఒకటి వ్యక్తిగతమైన, భవిష్యత్తును ముందే చెప్పగలిగిన శ్రేణి, రెండవది వ్యక్తిగతం కాని, లేక అధి వ్యక్తితగం (Super-Personal) అయినదీ, భవిష్యత్తును చెప్పనలవి కాని శ్రేణి. ఒకటి సామాన్య (lower) ప్రకృతి అనీ, రెండు ఉన్నత (higher) ప్రకృతి అని పేరుపెట్టుకో. జ్ఞానంలోనూ ప్రావీణ్యం (Insight) లోనూ నువు పెరిగిన కొద్దీ, నిమ్నోన్నత ప్రకృతుల మధ్యనున్న సరిహద్దు రేఖ తగ్గిపోతూ వుంటుంది; కానీ రెండూ ఒకటేనని నువ్వు గ్రహించేంత వరకూ ఉంటై. ఎందుకంటే ప్రతి విషయమూ, నిజానికి విశదీకరించడానికి వీలులేనంత అత్యాశ్చర్యకరంగా వుంటుంది.
: సైన్సు చాలా విషయాలను విశదీకరిస్తుంది.

ఆ
ధ్యానం:, పేర్లు ఆకృతులు, రాశి (quantity) గుణం (quality) నమూనాలు (patterns) నియమాలు (laws) తో వ్యవహరిస్తుంది. దానికుండే స్థానంలో అది చేసెడి పని సరియైనదే. కానీ జీవితాన్ని జీవించాల్సి వుంది, విశ్లేషణకు సరిపడే కాలం లేదు. (జీవితంలో ఎదురయ్యే సవాళ్ళకు) సమాధానం తక్షణం రావాలసి వుంటుంది – ఆ కారణంచేత సద్యో జీవితం (spontaneous), కాలంతో నిమిత్తంలేనిది, అంత ముఖ్యమని చెప్పడం. మనం జీవిస్తున్నదీ, కదులాడుతున్నదీ అజ్ఞాతంలో (unknown). తెలిసినదంతా గతానికి చెందినది.
ధ్యానకళ
ప్ర : ద్రష్ట, దృశ్యం ఒకటే అయితే, ఈ రెండింటి మధ్యా భేదం ఎలా ఏర్పడింది?
ధ్యానం: స్వభావరీత్యా నామరూపాలు భిన్నంగానూ వివిధంగానూ ఉంటై. వాటిని చూసి, సమ్మోహితుడిపై ఏదైతే సహజమో, దానిని విడివిడిగా ఎంచుతావు. ఏదైతే ఒకటిగా వుందో దానిని విడదీస్తావు. ఈ ప్రపంచం వైవిధ్యం సుసంపన్నమైనది. కానీ నీకింతా అన్యంగానూ, భయావహంగానూ కనిపిస్తున్నదంటే అందుకు కారణం
నీవు దీనినంతా అపార్థం చేసుకోడమే. అపాయాన్ని శంకించేది
నీవు కాదు.
శరీరంగానీ,
: శరీరం ఏమైపోతుందోననే ఈ మౌలికమైన ఆదుర్దాయే పలాయనం చిత్తగించేలా
చేస్తుంది; ఈ పలాయన సూత్రమే పలు రూపాలు ధరించి, నా
ఆలోచనల్ని
అనుభూతుల్నీ వక్రీకరిస్తున్నది. కానీ అసలీ ఆదుర్దా ఎలా ప్రారంభమైందంటారు?
ధ్యానం: ‘నేను శరీరాన్ని’ అనే భావం ద్వారా ఈ మానసిక పరిస్థితి ఏర్పడుతున్నది. ‘నేనీ శరీరాన్ని కాదు’ అనే వ్యతిరిక్త భావన ద్వారా దీనిని తొలగించవచ్చు. రెండు భావాలూ మిథ్యే అయినప్పటికీ, ఒకటి రెండవ దానిని తొలగిస్తుంది. ఈ భావాలనేవి ఏవీ కూడా నీ సొంతం కాదనీ, ఇవి బాహ్యం నుండి నీకు కలుగుతున్నాయనీ గ్రహించు. ఇదంతా నీకు నువ్వు ఆలోచించుకోవాలసిందే; నిన్ను గురించే నీవు ధ్యానించాల్సి వుంటుంది. నిన్ను నువ్వు అర్థంచేసుకోవడమే యోగసాధన. యోగివవు. యోగానికే నీ జీవితం అర్పించు; చేస్తున్న పొరపాటుకు మూలమేమిటో ఆ పొరపాటుకు ఆవలనున్న సత్యమేమిటో కనుగొనే వరకూ దీర్ఘంగా యోచించు, తెలుసుకోవాలని ఆత్రపడు, శోధించు.
ప్ర : ధ్యానంలో ధ్యానించేది ఎవరు? వ్యక్తియా సాక్షియా?
ధ్యానం : ధ్యానమనేది చైతన్యం యొక్క ఉన్నత స్థితుల్లోకి పొడుచుకు వెళ్ళి, చిట్టచివరకు చైతన్యం ఆవలివైపుకు చేరడానికి చేసే నిశ్చయపూర్వకమైన ప్రయత్నం చైతన్యంలోని ఒక్కొక్క స్థాయిని దాటుతూ, వదిలిపెట్టిన స్థాయిపై ఏర్పడిన పట్టును కోల్పోకుండా, మరింత సూక్ష్మమైన స్థాయిలపై సావధాన దృష్టిని నిల్పుతూ కొనసాగించేదే ధ్యానకళ.
ధ్యానం:ఒక విధంగా చెప్పాలంటే, మరణాన్ని తన అదుపులో వుంచుకోడమనవచ్చు. అన్నిటికన్నా తక్కువ స్థాయిలో వుండే స్థితి నుండి ప్రారంభించాల్సి వుంటుంది; సాంఘిక పరిస్థితులు, ఆచారాలు, అలవాట్లు; భౌతిక పరిసరాలు, శరీర భంగిమ, దాని శ్వాసక్రియ, ఇంద్రియాలు వాటి సంచలనాలు, వాటి గ్రహణశక్తి; మనసు
ధ్యానం: స్వభావరీత్యా నామరూపాలు భిన్నంగానూ వివిధంగానూ ఉంటై. వాటిని చూసి, సమ్మోహితుడిపై ఏదైతే సహజమో, దానిని విడివిడిగా ఎంచుతావు. ఏదైతే ఒకటిగా వుందో దానిని విడదీస్తావు. ఈ ప్రపంచం వైవిధ్యం సుసంపన్నమైనది. కానీ నీకింతా అన్యంగానూ, భయావహంగానూ కనిపిస్తున్నదంటే అందుకు కారణం
నీవు దీనినంతా అపార్థం చేసుకోడమే. అపాయాన్ని శంకించేది
నీవు కాదు.
శరీరంగానీ,
ధ్యానం: శరీరం ఏమైపోతుందోననే ఈ మౌలికమైన ఆదుర్దాయే పలాయనం చిత్తగించేలా
చేస్తుంది; ఈ పలాయన సూత్రమే పలు రూపాలు ధరించి, నా
ఆలోచనల్ని
అనుభూతుల్నీ వక్రీకరిస్తున్నది. కానీ అసలీ ఆదుర్దా ఎలా ప్రారంభమైందంటారు?
ధ్యానం: ‘నేను శరీరాన్ని’ అనే భావం ద్వారా ఈ మానసిక పరిస్థితి ఏర్పడుతున్నది. ‘నేనీ శరీరాన్ని కాదు’ అనే వ్యతిరిక్త భావన ద్వారా దీనిని తొలగించవచ్చు. రెండు భావాలూ మిథ్యే అయినప్పటికీ, ఒకటి రెండవ దానిని తొలగిస్తుంది. ఈ భావాలనేవి ఏవీ కూడా నీ సొంతం కాదనీ, ఇవి బాహ్యం నుండి నీకు కలుగుతున్నాయనీ గ్రహించు. ఇదంతా నీకు నువ్వు ఆలోచించుకోవాలసిందే; నిన్ను గురించే నీవు ధ్యానించాల్సి వుంటుంది. నిన్ను నువ్వు అర్థంచేసుకోవడమే యోగసాధన. యోగివవు. యోగానికే నీ జీవితం అర్పించు; చేస్తున్న పొరపాటుకు మూలమేమిటో ఆ పొరపాటుకు ఆవలనున్న సత్యమేమిటో కనుగొనే వరకూ దీర్ఘంగా యోచించు, తెలుసుకోవాలని ఆత్రపడు, శోధించు.
ప్ర : ధ్యానంలో ధ్యానించేది ఎవరు? వ్యక్తియా సాక్షియా?
ధ్యానం : ధ్యానమనేది చైతన్యం యొక్క ఉన్నత స్థితుల్లోకి పొడుచుకు వెళ్ళి, చిట్టచివరకు చైతన్యం ఆవలివైపుకు చేరడానికి చేసే నిశ్చయపూర్వకమైన ప్రయత్నం చైతన్యంలోని ఒక్కొక్క స్థాయిని దాటుతూ, వదిలిపెట్టిన స్థాయిపై ఏర్పడిన పట్టును కోల్పోకుండా, మరింత సూక్ష్మమైన స్థాయిలపై సావధాన దృష్టిని నిల్పుతూ కొనసాగించేదే ధ్యానకళ.
ఒక విధంగా చెప్పాలంటే, మరణాన్ని తన అదుపులో వుంచుకోడమనవచ్చు. అన్నిటికన్నా తక్కువ స్థాయిలో వుండే స్థితి నుండి ప్రారంభించాల్సి వుంటుంది; సాంఘిక పరిస్థితులు, ఆచారాలు, అలవాట్లు; భౌతిక పరిసరాలు, శరీర భంగిమ, దాని శ్వాసక్రియ, ఇంద్రియాలు వాటి సంచలనాలు, వాటి గ్రహణశక్తి; మనసు
దాని ఆలోచనలు అనుభూతులు, వీటన్నిటినీ గమనిస్తూ, వ్యక్తి స్వరూప స్వభావ నిర్మాణం తెలుసుకుంటూ, వీటన్నిటినీ గుప్పెట నిడుకోవాలి. ‘నేను ఫలానా, నేనింతటివాణ్ణి. నేను సాక్షీమాత్రుణ్ణి సుమా, ‘అది’ వున్నది అనే ఈ వివిధ దశలను దాటి, మనోభావనలకన్నిటికీ ఆవలనున్న వ్యక్తిగతం కాని వ్యక్తిత్వంతో ఆలరారే
స్వచ్ఛమైన సత్తను చేరాలి.
నువు ధ్యానం చేపట్టినప్పుడు చాలా శక్తితో కృషిచేయాలి. ఇది అడపా దడపా చేపట్టి నిర్వహించే కార్యక్రమం కానేకాదు; నీకుండే అభిరుచులు, నువు తలపెట్టే పనులు కేవలం నీకూ, నీమీద ఆధారపడినవారి కనీసావసరాలకే పరిమితం చేయాల్సి వుంటుంది. నీ కాలాన్ని నీ శక్తినీ నీ చుట్టూ నీ మనసు కట్టిన గోడలను ధ్వంసంచేయడానికే వినియోగించు. ఇదంతా అయిన తదుపరి పశ్చాత్తాపపడవలసి వస్తుందేమోనని అనుకోకు; నా మాటలను నమ్ము.
: నా అనుభవం విశ్వవ్యాప్తమైనదని నాకెలా తెలుస్తుంది?
: ధ్యానానంతరం అంతా ప్రత్యక్షంగానే తెలుస్తుంది. రుజువుల అవసరమేమీ వుండదు. సముద్రపు జలాల్లోని ప్రతి నీటి చుక్కలోనూ దాని రుచి వున్నట్లే, ప్రతి క్షణమూ కూడా ఆ శాశ్వతత్వం యొక్క రుచిని చూపిస్తుంటుంది. నిర్వచనాలు, అభివర్ణనలు మరింత అన్వేషణకు ప్రేరకాలే; వాటి స్థానం వాటికున్నది. అయితే వాటిని దాటి నకారాత్మక పదాలతో (‘అది కాదు, ఇది కాదు’ అనే పద్ధతి)తో తప్పితే, వర్ణింప నిర్వచింపనలవి కాని స్థితిలోకి చేరాలి.
సర్వోత్పృష్ట స్థితి
: జనక మహారాజు తానొక భిక్షుకుడన్నట్లు కలగన్నాడు. మేల్కొన్న తదుపరి తన గురువు వసిష్ఠుణ్ణి ఇలా అడిగాడు. ‘నేను భిక్షుకుణ్ణి అని కలగన్న మహారాజునా లేక మహారాజుని అని కలగంటున్న భిక్షుకుణ్ణా? అందుకు వశిష్ఠుడు నీవు అదీ కాదు, ఇదీ కాదు, నువ్వు రెండూను. ‘నువ్వు’ అనేది సత్యమైనప్పటికీ, నిన్ను గురించి నీవనుకున్నట్లు ప్రవర్తిల్లుతుంటావు కాబట్టి నువ్వు వున్నట్లే కానీ అది అలాగే కొసాగదు కాబట్టి, నువ్వు కావనుకోవాలి. రాజుగా గానీ భిక్షుకుడుగా గానీ ఎల్లకాలం వుండగలిగి వున్నావా? అవన్నీ మారక తప్పదు. ఏ మార్పూ చెందని వానివి నువ్వు. ఏది నువ్వు?’ అని సమాధానమిచ్చాడు.
అందుకు జనకుడు. “అవును, నేను రాజునీ కాదు, భిక్షుకుణ్ణి కాదు. అన్నిటినీ నిరాసక్తంగా నిర్లిప్తంగా చూసే సాక్షిని” అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు “నీవు జ్ఞానివనేది నీ చివరి భ్రమ. ఆ విధంగా సామాన్య మానవుడికి భిన్నంగా, అతడికన్నా ఉన్నతంగా ఉన్న మనిషిని అనేది నీ భ్రమ. మళ్ళీ నీ మనసుతోనే మమైక్యం అవుతున్నావ్. నీకున్న మనసు తిన్నగా ప్రవర్తిల్లేదనే విషయంలో ప్రాయమైనదనే విషయంలో సందేహం లేదనుకో. అదలా వుంచు.
ఆదర్శ
కానీ నీకున్నూ మరొకరికిన్నీ ఏ కాస్త భేదాన్ని చూచినా, నీవు వాస్తవాన్ని ఎఱగనట్లే భావించాలి. మనసు స్థాయిలో ప్రవర్తిల్లుతున్నావన్న మాట. ‘నేను నేనే” అనేది తొలగిపోగానే ‘నేను అన్నీని’ అనేది ప్రవేశిస్తుంది. ‘నేను అన్నీని’ అనేది కూడా తొలగితే, ‘నేను’ అనేది ప్రవేశిస్తుంది. ఆఖరికి ఈ ‘నేను’ కూడా పోతే, వాస్తవం మాత్రమే మిగులుతుంది. దీనిలో ‘నేను’లన్నీ సురక్షితంగా భద్రపరచబడి. మహిమాన్వితమవుతై. ‘వేర్వేరు’ భావం కలగకుండా నానా విధాలుగా ప్రవర్తిల్లడ మనేదే, మనసు ఊహించగలిగిన అంతిమ దశ. అటుపైన, అప్పటికే అన్ని లక్ష్యాలు సాధింపబడినందువల్ల అన్ని ఉద్దేశాలు నెరవేరినందువల్ల, సమస్తమైన మనో చలనాలు ఆగిపోతై.
: సర్వోన్నత స్థితినందుకున్న తర్వాత, ఆ స్థితిని ఇతర్లతో పంచకోగలమా? : ఈ సర్వోత్కృష్టస్థితి విశ్వవ్యాప్తం. ఇది ఇక్కడే ఇప్పుడే వున్నటువంటిది. దీనిలో అందరూ ఇప్పటికే భాగస్వాములు, పంచుకుంటూనే వున్నారు. నీ సత్తలో నీవు. జీవించడం, తెలుసుకుంటూ వుండడం, ఇష్టపడుతుండడమే ఈ స్థితి. ఇందులో వుండాలని కోరుకొనని వారెవరుంటారు? లేక తాను జీవిస్తున్నానని తెలియని వాడెవడుంటాడు? కానీ ఇలా తెలుసుకుంటూ బ్రతుకుతున్నామనే ఆనందాన్ని మనం సద్వినియోగపరచుకోవడంలేదు; దానిలోకి చొచ్చుకువెళ్ళి అందులో వున్న అన్య పదార్థాలనన్నిటినీ తొలగించి శుద్ధిచేయడం లేదు. మానసికంగా ఇలా మనల్ని మనం శుభ్రపరచుకోడం, ఈ అంతరంగాన్ని శుద్ధిచేయడం చాలా అవసరం. కళ్ళల్లో ఒక నలక పడితే, కన్ను వాచి, చుట్టూ వుండే ప్రపంచాన్ని కనిపించకుండా తుడిచేసినట్లే, ‘నేను ఈ శరీరం – మనసుని’ అనే పొరపాటు భావం, ‘స్వను గురించే ఆలోచించేట్లు చేసి, విశ్వాన్ని కనిపించకుండా చేస్తుంది.
భావాన్ని ఉర్దినే
తానొక ‘వేరుగానున్న’ పరిమితమైన వ్యక్తిననే ఈ నిగ్రహించాలని ప్రయత్నించడం వ్యర్థం; దీని వ్రేళ్ళు ఎక్కడైతే వున్నాయో అక్కడి వరకూ వెళ్ళి, దీనిని వెలికితీసి, విశదంగా చూడాలి. స్వార్థం, తనని గురించి తానేర్పరుచుకున్న భావాల్లో వ్రేళ్ళూని వున్నది. మనసును శుద్ధిచేసి తేటతెల్లంగా
చేయడమే యోగప్రక్రియ.
‘ఆధ్యాత్మిక శాస్త్రగ్రంథాల ప్రయోజనమేమిటి?” అని నిసర్గను అడిగి నప్పుడు, ‘అవి అజ్ఞానాన్ని తొలగించడానికి దోహదపడతాయి. ప్రారంభంలో ఉపయుక్తమైనవే. కానీ చివరకు ఆటంకం అయి కూచుంటై. వాటిని ఎప్పుడు
విసర్జించాలో తెలిసుండాలి’ అన్నాడు.
చూడడం
ప్ర : నేనిక్కడ కూచోనున్నప్పుడు నాకీ గదీ, ఇందులోని మనుషులూ కనిపిస్తున్నారు; మిమ్మల్నీ చూస్తున్నాను. మీ కళ్ళకు ఇదంతా ఎలా కనిపిస్తున్నది? మీరేం చూస్తున్నారు?
: ఏమీ చూడడం లేదు. కళ్ళుతెరిచే వుంటై, చూస్తూనే వుంటాను కానీ, తీర్పులు, అభిప్రాయాలతో కూడిన మనో చిత్రాలు కనిపించడమనేది ఉండదు. దేనినీ వర్ణించేది లేదు, విలువ కట్టేది లేదు. కళ్ళతో చూస్తాను, నువు కనిపిస్తావు; కానీ నీ యెడల నాకొక వైఖరి కానీ ఒక అభిప్రాయంకానీ, అలాంటి ఏరకమైన మేఘమూ నా దృష్టిని కమ్మేయదు. కళ్ళు ఇటు నుంచి అటు జరిగిపోయినప్పుడు మనసులో జ్ఞప్తిని తారట్లాడనివ్వను; వెన్వెంటనే దాని నుండి విడివడి తాజాగా అయిపోయి, తర్వాతి మనోభావానికి సిద్ధంగా వుంటాను.
వ్యక్తావ్యక్తాలు
: వ్యక్తిగా చెప్పుకునేవాడు, వ్యక్తమయ్యే దానికి భిన్నంగా తాను లేడు అని కనుగొన్నప్పుడు, వ్యక్తమయ్యే ఈ ‘వ్యక్తి’ అనేది, తన అభివ్యక్తీకరణేనని గ్రహించి నప్పుడు, అవ్యక్త స్థితిలోని శాంతి, నిశ్శబ్దం సిద్ధిసై.
స్పృశించే
నిజానికి ఈ మూడూ ఒక్కటే; వ్యక్తావ్యక్తాలు, విడదీయరానివి; వ్యక్తేమో – అనుభూతి చెందే, ఆలోచించే ప్రక్రియ – ఈ ప్రక్రియేమో శరీరం
మీద ఆధారపడి వున్నది – ఈ శరీరమేమో. వాటిపై ఆధారపడి వున్నది.
వాస్తవం : జీవితం
బడి
: కర్మాచరణలో వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ వుండే జీవితాన్నే, జీవితం అనగలం. మరణించేటప్పుడు “నేను చక్కగా జీవించాను. ఇక మళ్ళీ జీవించవవలసిన అగత్యం లేదు” అనగలిగే విధంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని ఏ విశ్వవిద్యాలయమూ
బోధించదు.
మనలో అధిక భాగం జనులు మళ్ళీ జీవిస్తే బాగుండుననే కోరికతోనే మరణిస్తారు ఈ గడచిపోయిన జీవితంలో ఎన్నో తప్పులు చేసి వుంటాం; చేయాల్సిన పని ఎంతో చేయకుండా మిగిలిపోయి వుంటుంది. మనుష్యుల్లో చాలామంది సోమరితనంతో నిరర్థకంగా జీవిస్తుంటారు. ఏవో కొన్ని అనుభవాలు పోగేసుకొని జ్ఞాపకాలను పెంచుకుంటారు. కానీ అనుభవమనేది ‘వాస్తవాన్ని’ కాదని తోసి పుచ్చడమే; వాస్తవమనేది ఇంద్రియ సంబంధమైనది కాదు, భావగ్రహణ సంబంధమైనదీ కాదు, శరీర మానసిక సంబంధమైనదీ కాదు. కానీ ఈ రెంటినీ తనలో ఇముడ్చుకుంటూ వీటికి అతీతంగా వుంటుంది.
శైశవ సూత్రం
ని
: ఆధ్యాత్మికను గురించి కానీ, భగవంతుణ్ణి గురించి కానీ నాకు తెలియనిదంటూ లేకపోవడానికి కారణం, నేను ఈ శైశవ సూత్రం ఎఱిగుండడమేనని చెప్పవచ్చు. అజ్ఞానంతో కూడిన ఈ శైశవ సూత్రాన్ని ఎఱిగినప్పుడు – అదే ఆ సత్వశక్తి (Beingness) నీ ఆముష్మిక, ప్రాపంచిక ప్రయత్నాలలో నీకు ఏ లోటూ రాదు.
అసత్యమైనదానినే నువ్వు తెలుసుకో గలవు. సత్యమైనది, నీకు నువ్వే అవాలి.