అవగాహన:ప్రసంగించిన తర్వాత నిశ్శబ్దం. ఒక జీవిత కాలమంతా నిశ్శబ్దంతో గడిచిన తర్వాత నిశ్శబ్దం, అదే ఈ నిశ్శబ్దం కూడాను. అస్మిత్ (నేను) అనే దాని నుండి స్వేచ్ఛయే, | అమరత్వం; అయినప్పటికీ అస్మిత్ నాశనం కాదు. అందుకు విరుద్ధంగా, నువ్వు . దానికన్నా అది అపార వాస్తవం, ఎఱుక, ఆనందంతో కూడిన స్థితి. పోయినదల్లా సంఘంలో తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకునే లక్షణం మాత్రమే. : మనసు యొక్క మహామృత్యువు కాకతాళీయంగా దేహం యొక్క సామాన్యమయిన మృత్యువుతోబాటు ఎందుకు సంభవిస్తుంది?
అవగాహన : అలా సంభవించదు! నువ్వొక వందమార్లు చనిపోవచ్చుగాక, అయినప్పటికీ మానసిక సంక్షోభంలో అంతరాయ ముండకపోవచ్చు. అలాకాక నీ దేహాన్ని తలచుకొని కూడా మానసికంగా మరణించవచ్చు. మానసిక మరణం, తెలివి (wisdom) యొక్క జననం.
: వ్యక్తి వెళ్ళిపోతాడు, సాక్షి మాత్రమే మిగులుతాడు.
అవగాహన: ‘నేను సాక్షిని’ అని చెప్పడానికి ఎవరు మిగులుతారు? సాక్షి ఎక్కడున్నట్టు? కాల రహితమైన స్థితిలో, ఆశ్రయం పొందడానికి వ్యక్తి, ‘తాను’ అనే మనిషి లేడు.
అవగాహన:మూట తీసుకు వెళుతున్నవాడికి, దానిని పోగొట్టుకో కూడదనే ఆదుర్దా వుంటుంది. అతడు మూట యొక్క స్పృహతోనే వుంటాడు. ఏమనిషైతే ‘అస్మిత్ నేను’ అనే భావనని మనసులో వుంచుకుంటాడో, అతడు సంఘంలో తన వ్యక్తిత్వం | పరిగణింప బడాలని చూస్తుంటాడు. జ్ఞాని దేనినీ పట్టుకొని వుండడు. సచేతనంగా లేడు. అతణ్ణి ‘ఎఱుక హృదయమే’ననవచ్చు. మన మతణ్ణి దిగంబర, అంటే ఆకాశముచే కప్పబడ్డాడు అంటాం- అంటే అన్ని రూపాలు, అన్ని ఆకారాలు ఆవల. ఏ పేరునగాని, ఏ రూపంగాగాని అతడు ఉన్నాడని అనగలిగి లేము. కాని సత్యంగా వున్నదతడే.

ప్ర : సాక్షి వాస్తవ మైనవాడా, లేక అవాస్తవ మైనవాడా?
అవగాహన:: రెండూను, భ్రాంతి యొక్క చివరి శేషాంశం, వాస్తవం యొక్క ప్రథమ సంసర్గం. ‘నేను కేవలం సాక్షినే’ అనే మాట అబద్ధమూ, నిజమూను; అస్మిత్ (నేను) అనే వాడున్నంతసేపు అబద్ధం, సాక్షి వున్నాడు కాబట్టి నిజము. అలా అనే బదులు ‘సాక్షీమాత్రంగా వుంటం జరిగింది!’ అస్మిత్(నేను) అని నువ్వనేసరికల్లా, మొత్తం సృష్టితో సహా సృష్టికర్తను కూడ ప్రవేశపెడతావు.
రమేష్ బల్సీకర్ విశ్లేషణ
అవగాహన:నిసర్గదత్త మహరాజ్ యొక్క ముఖ్య అనుచరుడైన శ్రీ రమేష్ బల్ సేకర్, నిసర్గ మాటలను విశ్లేషించి పాఠకులకు తెలియజేసిన కొన్ని విషయాలను అందిస్తున్నాను.. ఒకటి గుర్తుంచుకోండి. ఏ మహనీయుడి మాటలనైనా ప్రత్యక్షంగా చదివి, పాఠకులు
| తమకు తాము అర్థంచేసుకోడమే శ్రేష్ఠం; ఎందువల్లనంటే, అర్థం బాష్యం చెప్పేవారు. ప్రమాదవశాత్తూ తమ సొంత ఆలోచనను కూడా, అనుకోకుండా జతచేయవచ్చు. అయినప్పటికీ నిసర్గ మనసుతో ప్రత్యక్షానుభవం లేని పాఠకులకు, ఈ విశదీకరణ కొద్దిగానైనా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈ మాటలు ఇక్కడ పొందుపరిచాను – రచయిత అవగాహన, వింటున్న క్షణాన్నే
అవగాహన:ఈ అవగాహన అనేది కాలంతో ముడిపడి లేదు. అది అచ్చం వింటున్న క్షణాన ఒక ‘షాక్’ తగిలినట్టు, కాలాతీతమైన గ్రహింపు సంభవిస్తుంది. అంటే వ్యవధానమనేది లేకుండా అప్పటికప్పుడే జరిగిపోతుంది. తిరుగులేని గ్రహింపు లోన ఏర్పడుతుంది. గ్రహింపుయొక్క విత్తనం నాటుకున్న తర్వాత, మనిషి ఊహించుకున్న బంధనం తొలగిపోవడానికి కాలం పట్టవచ్చునేమో కానీ, గ్రహింపుమాత్రం తక్షణమే సంభవిస్తుంది. దృక్ దృశ్యమైన వేళ
అవగాహన:అంతఃస్ఫూర్తితో (Intuition) నువ్వు చూసినప్పుడు ఆలోచన లేదు. ‘అవగత మయింది’ అని నువ్వు అనుకున్నప్పుడు, అవగతం కాలేదు. ప్రత్యక్షంగా చూచి గ్రహించేప్పుడు, ఆలోచించడం అనేది లేదు. నువ్వు ప్రాణంతో జీవించి వున్నావు అని తెలుసు; నువ్వు జీవించి వున్నానని అనుకోడం, ఆలోచించడం లేదు.
సంపూర్ణమైన మనసుతో, చూచెడివాడు ద్రష్ట అంతర్ధానమై దృక్ మాత్రం దృశ్యమవుతుంది.
అవగాహన:ఆధ్యాత్మికంగా మేల్కొనుట, చూచి గ్రహించుట, ఇది సంకల్పం ద్వారా సాధించేది కాదు. సాధారణంగా నువ్వు నిద్రించిన తర్వాత మేల్కొనడం దానంతట అదే సంభవిస్తున్నదా, లేక సంకల్ప బలంతో మేలుకొంటున్నావా? సద్యోస్ఫురణతో అప్రయత్నంగా, అకారణంగా అదే జరిగే విషయాన్ని, నీవైపు నుండి ఏ కాస్త ప్రయత్నం జరిగినా, దానంతట అదే సంభవించే దానిని అడ్డు కుంటుంది. ‘నువ్వేమీ చేయకుండా ఉంటేనే అది సంభవిస్తుంది’ అని తీర్మానించడం కూడా దానిని ఆటంకపరుస్తుంది.
నిజానికి విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. అందుకై ‘ప్రయత్నిస్తాను అన్నప్పుడూ, ప్రయత్నించను’ అని తీర్మానించినప్పుడూ, రెండు సందర్భాల్లోనూ నీ ఇచ్ఛను, సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నావు.
అవగాహన:ఈ చేసేవాడు, కర్త, ఉండకుండా పోవాలి. సకారాత్మక, నకారాత్మకమైన ‘చేయుట’ లేకుండా పోవాలి. బాగా చూడడమే నిజమైన సమర్పణ భావం.
శ్రీరామునికైనా తప్పని ఆత్మజ్ఞానం
నిసర్గ : రాముడు పుట్టుకతో రాకుమారుడైనప్పటికీ, నీలాంటి ఓ సామాన్య మానవుడనేది నీకు తెలుసా? వసిష్ఠ మహాముని అతడికి దీక్ష ఇచ్చి జ్ఞానబోధ చేసేవరకూ, అతడు దేవుడు కాలేదని నీకు తెలుసా? ఇక ఆ బోధ ఏమిటి; ఆత్మజ్ఞానం, అనగా మనిషి యొక్క నిజస్వారూపం కాదా?
అందువల్ల సంవత్సరాల తరబడి నువ్వు పోగేసుకున్న భ్రాంతిజనకమైన భావాలన్నీ వదిలేసి (అంతా రామమయం అంటూ తన వద్దకు వచ్చిన వ్యక్తితో) నీ ఆత్మతో నువ్వు ప్రారంభించు.
నేను కాలబుద్ధుణ్ణ?
‘నువ్వూ, నేనూ” ఈ రెండూ కూడా కాలం (Time) అనేది గుర్తుంచుకో. నువ్వెవరని అనుకుంటున్నావో (ఐతే నిజానికి కాదో) – అది తాత్కాలిక (Temporal) మైనటువంటిది. కానీ వ్యక్తమైన సన్నిధి (Conscious Presence) గా, నువ్వు ఎవరై వున్నావో (ఈ చైతన్యాన్ని
ఎఱిగిన వాడివి), అది మాత్రం తాత్కాలికం కాదు.
నీ గతం, ఒక స్మృతి; నీ భవిష్యత్తు, మదిలోని ఒక ఆశ మాత్రమే. ఇప్పుడు, ఈ క్షణం (Now) ఇదొక్కటే మనకు అర్థవంతమైనటువంటిది; ఎందువల్లనంటే మనం కాల సంబంధం కాని, సన్నిధి కాబట్టి.
నువ్వు కాలానివే. నువ్వెవరని అనుకుంటున్నావో, అది కాలవ్యవధి (Duration). నీవు ఆత్మగతంగా (Subjective) ఎవరై వున్నావో, అది అనంత (Timeless) మైనది. దృగ్గోచర వస్తువుగా నీవు కాలానివి కావా? శైశవం నుండి వృద్ధాప్యం వరకూ, జననం నుండి మరణం వరకూ, సృష్టి నుండి ప్రళయం వరకూ తదితర దృగ్గోచర జీవులలాగా, ప్రవహించే కాలానివి కావా?
నువ్వెవరవని నీవు అనుకుంటుంటావో (మనశ్చర్య సంబంధిత పరికరం), అది కేవలం ఒక గమనం (Movement); నిద్రలో కూడా మేల్కొనడం వైపు ఈ గమనం సాగుతూనే ఉంటుంది, ఎందువల్లనంటే చైతన్యం యొక్క లక్షణం ‘గమనం’ కాబట్టి, నిన్ను నిశ్చలంగా వుండనివ్వదు. ఈ నిరంతర కర్మాచరణ, లేక ఏదో ఒకటి చేయు’ చుండుట, ఇదే గర్ష్వనీయమైన కర్మగా పరిణమిస్తున్నది. ఇది నీ భౌతిక రూపంతో తాదాత్మ్యం చెందినందువల్లనే బాహ్యంగా కనిపించే కర్మకూ, దానితోబాటు దాని ఫలితాలకూ, బాధ్యత వహిస్తుంటావు. ఇలా కనిపించే ప్రతి కర్మ కూడా, దేశ కాలాలలో వ్యక్త ప్రపంచంలో కనిపించెడి ఒక సంఘటనగా పొడిగించబడుతుంది.
పుట్టుట అనే పదం నిజానికి కాలానికి సంబంధించినది; ఎందుకంటే దానితోబాటు కాలవ్యవవధి పుట్టకపోతే (దేశ (Space) సంబంధితం కూడానూ) వ్యక్తస్థితి (Manifestation) ప్రత్యభిజ్ఞత్వం (Perception) సంభవించేది కాదు.
నీవు పుట్టానని అనుకుంటావు కానీ, నిజానికి పుట్టింది ‘కాలవ్యవధి’; ఆ వ్యవధిలో నువ్వు కనిపించెడి వస్తువువి.
కాలానికి చెందని ఆ సంపూర్ణమైన దాని (Absolute) గురించి మనమేమను కున్నప్పటికీ, అది కేవలం భావనాత్మక (Conceptual) మైనటువంటి సూచకం, సంకేతం మాత్రమే. ఈ భావన మనం కాలానికి చెందిన వాళ్ళం కాదని మనకు ఏనాడూ తెలియనీయదు; కానీ నిజానికి మనం కాలానికి చెందిన వాళ్ళం కాదు. మనం అనగలిగినదల్లా ‘నేనిక్కడ ఇప్పుడు ఉన్నాను’ – ఇక్కడ అంటే ఈ ప్రదేశం (Space) లేనిచోట, ఇప్పుడు అంటే ఈ కాలం లేని సమయమందు.
తన (నిసర్గ) మాటలు వినేవారు ప్రత్యక్షంగా చూచి గ్రహించవలసిందే కానీ, భావనాత్మకత (Conceptual) తో నున్న వ్యక్తి నెవరినీ మధ్యవర్తిగా జోక్యం చేసుకోనివ్వరాదు. ప్రాసంగికుడు చెప్తున్నటువంటిది వింటున్నప్పుడు, శ్రోత జాగ్రత్తగా గమనిస్తూ, వినాలి. నిసర్గ అనేదేమంటే, తాను నిబద్ధీకృతుడైన వ్యక్తితో కాక, అతడి చైతన్యాన్ని ఉద్దేశించి, మాట్లాడుతున్నానంటాడు.
శ్రోతలకు నిసర్గ సలహా ఏమిటంటే, ‘ప్రత్యక్షంగా, సూటిగా గ్రహించండి, వెన్వెంటనే చెప్పినది మరచిపోండి’ అని. (ఈ మరచిపోవట మేమిటని పాఠకులు ఆశ్చర్యపోవచ్చు. కానీ చదవండి, మీకే తెలుస్తుంది) తాను (వక్త) వాడిన పదాలను వేదికగా చేసుకొని తమ (శ్రోతల) సొంత భావన (Concepts) లను ప్రవేశపెట్టటం చేయరాదంటున్నాడు. భావనలు (Concepts) ఆలోచనలలో నుండి పుట్టుకొస్తె కాబట్టి, అవీ ఇవీ అన్నీ కలిసి ఒక మూట అవడాన్నే ‘మనసు’ అంటారు. ఆలోచించడం అంటే భావన (Concept) లోకి మార్చటం, మనసులో కొన్ని వస్తువులు (Objects) సృష్టించడం; ఇది బంధనం. పదాలు మౌలికంగా ద్వంద్వంతో కూడుకున్నవి, భావనాత్మకమైనవి; ఆ కారణంచేత ఇవి జ్ఞానావిర్భావానికి ఆటంకాలు. పదాలు అనేవి తెలియబరచటానికి, సూచించటానికి తాత్కాలికంగా పనికివచ్చేవే కానీ, అటు తర్వాత అవి ఒక బంధనమే.
అన్ని రకాల జ్ఞానమూ బంధనమే; ఆ కారణం చేత అనృతమే. ఆలోచన భావనాత్మకమైన (Conceptual) చింతన, చూడగలిగిన వస్తువుగా మాట్లాడుట అనేది ఆగిపోవాలి; ఎందువల్లనంటే స్థితమైన (what is) దానికి చూడబడే లక్షణం ఏ కాస్త కూడా లేదు. అది అన్ని రకాల చూడబడే పదార్థాలను, వస్తువులను చూచెడిది (Subject); అది చూడబడే వస్తువు కాదు కాబట్టి, దానిని గమనించగలిగి లేము. కన్ను మిగతా వాటన్నిటినీ చూస్తుంది కానీ తనని తాను చూచుకోజాలదు.
ద్రష్ట – దృశ్య సంబంధం
అవ్యక్త (Non-Manifestation) స్థితిలో అంతస్తత్వం (Noumenon) ఒకటే ఉంటుంది. ఆ స్థితిలో మనకు (నాకు) అసలు ఉన్నామన్న సంగతి కూడా తెలియదు.
మనం ఉన్నామని తెలిసేసరికి, ఇంతకు మునుపు ఉన్నటువంటి ఏకత్వం ఉండజాలదు. ఎందుకంటే చైతన్యం యొక్క సారమే ద్వంద్వం.
విభజన అనివార్యం.
మనం ఏమైవున్నామో (అవ్యక్త స్థితిలో) అది వ్యక్తమయ్యేసరికి దృశ్యరూపం, వస్తు రూపం ధరించక తప్పదు; అట్టి సమయాన చూచేవాడు – చూడబడేది (Subject object) రకాల భావనాత్మకత (Conceptualizing) కు, ఈ చైతన్యమే మూలం – తత్కారణంగా . ఇలా చూడబడే దృశ్యంలాగా రూపొందడం చైతన్యంలో సంభవిస్తుంది; చూచేవాడు (ద్రష్ట) చూడబడే వస్తువు లేక ‘దృశ్యం’, రెండూ కూడా చైతన్యంలో దృగ్గోచర విషయాలే; రెండూ స్వప్న ఆకృతులే, రెండూ వస్తువులే (objects) అనేది గుర్తుంచుకోవాలి. | అయితే గుర్తించే వస్తువు, తాను ‘చూచేవానిగా’, ‘నేను’గా రూపుదిద్దుకొని ద్రష్టపాత్ర ధరిస్తుంది; గుర్తించబడిన వస్తువును ‘దృశ్యం’గా వర్ణిస్తుంది. నిజానికి రెండూ వస్తువులే (objects). అది ‘వేరు’ అంటుంది. ఈ విధంగా ‘వ్యక్తి’ అనే భావన, ఈ మాయ పుట్టు
కొస్తుంది.
చైతన్యంలో జరిగిన ఈ విభజన ద్రష్ట – దృశ్యంగా రూపొంది ద్వంద్వం ప్రారంభ మవుతుంది. నిబద్ధత యొక్క ప్రభావం చేత మరింత విస్తరించి బలపడుతుంది. ఈ ద్రష్ట | అనబడే వస్తువు, తానొక మధ్యవర్తి పంచాయతీదారు అన్నట్లు, తలపాగా ధరించి, ప్రతి విషయంమీద, వస్తువు మీద తన తీర్పులు చెప్పనారంభిస్తాడు. ఆ విధంగా అది తప్పు, ఇది ఒప్పు, అది మంచి ఇది చెడు, పెద్ద – చిన్న, దగ్గర – దూరపు విభజన చేస్తాడు. అందులో నుండి సమర్ధన ఖండన మొదలైనవన్నీ ప్రారంభమౌతై.
దృగ్గోచరమైనటువంటి అనేక రూపాలు, చైతన్యం యొక్క విధి నిర్వహణ తప్పితే మరేమీ కాదు; అందులో వ్యక్తిగతమైన జీవి అంటూ ఉండడు. చైతన్యంలో ఉండేవన్నీ చూడబడేవే (Objects) స్వప్న ఆకారాలు; వాటి వాటి పాత్రలను అవి పోషిస్తుంటై. మనకు కేటాయించిన పాత్రలో మనం ఐక్యం చెంది, ఆ పాత్ర మనమేననుకొని ఆ బాధ్యతనంతా మన తలమీద వేసుకోవడంవల్ల, మన బాధలు దుఃఖాలు ప్రారంభమౌతై. భ్రమజనితమైన, నిజానికి అనవసరమైన ఈ పాత్రలో తాదాత్మ్యం చెందడంవల్ల మనకీ బంధన ఏర్పడుతుంది.
మనమేదైతే కాదో, అయినప్పటికీ అదేనని అనుకుంటున్నామో అది కేవలం ఒక భావన (concept); ఈ భావన మనమెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. మని
నిబద్దత (conditioning) ఈ అపార్థం, మనమెవరో ఏది కాదో, సరియైన అవగాహనతో