ప్రాణం:”ఎక్స్‌క్యూజ్‌మీ… కొంచెం దారి ఇస్తారా” అన్న మాటలకు సైడు బెర్తు కింద సామాన్లు సర్దుతున్న శంకర్రావు, సునంద తలెత్తి చూశారు. సికింద్రాబాద్ స్టేషన్ వదిలి గోదావరి ఎక్స్‌ప్రెస్ వేగం పుంజుకుంటోంది. అప్పటి వరకు హడావిడిగా ఆయాసపడుతూ రైలెక్కిన ప్రయాణీకులు నెమ్మది, నెమ్మదిగా స్థిమితపడటం ప్రారంభమయింది. ఎదురుగా నిలబడ్డ ఆ కుటుంబాన్ని వారి బెర్తుల్లోకి వెళ్లకుండా అడ్డుగా వున్నామని అప్పటికి గానీ గ్రహించలేదు శంకర్రావు. కొంచెం పక్కకు జరిగి వాళ్ళని వెళ్ళనిద్దామని భార్యకు సైగ చేసి వారికి సారీ చెప్పాడు.
ప్రాణం:”అమ్మయ్య మొత్తం సర్దేశాను. రేపొద్దున్న వరకు చూసుకోనక్కర్లేదు. ఇంత సామాన్లు వద్దంటే వినవు. మళ్ళీ దీనికి మించిన సామాన్లు తిరుగు ప్రయాణంలో ఖాయం” ఓ పక్క భార్యని సున్నితంగా విసుక్కుంటూనే పక్క బెర్తులవారి వైపు దృష్టి సారించాడు. వాళ్ళు ముగ్గురే. భార్య, భర్త మధ్యలో ఓ పదేళ్ళ కుర్రాడు. చాలా అందంగా వున్నాడు. అయితే ఆ కుర్రాడిలో ఏదో తేడా ఉందని చెప్పి కొంచెం పరీక్షగా చూశాడు శంకర్రావు. ఆ కుర్రాడు అందరు కుర్రాళ్ళలాగా చలాగ్గా, చురుగ్గా లేడు. ఆ కుర్రాడి చూపు చుక్కాని లేని నావలా అస్థిరంగా ఉంది. జీవితం పెట్టిన పరుగు పందెంలో “ఇహ చాలు బాబూ నేను పరిగెత్తలేను” అని రొప్పుతున్న బడుగు జీవిలా, ఆ కుర్రాడు కూడా మౌనంగా వాళ్ళమ్మ భుజంపై తల వాల్చాడు. ఆ తల్లి కుర్రాడి తల నిమురుతుంటే, ఇవేమీ పట్టనట్టు ఆ తండ్రి ఏదో మేగజైన్ తిరగేయటంలో మునిగి పోయాడు. ఆ కుర్రాడ్ని చూస్తూ శంకర్రావు బాధగా సునంద వంక చూశాడు.
ప్రాణం:“పాపం ఆ బాబుకు వయసు పెరిగినట్లుగా మెదడు పెరిగినట్లు లేదండీ. చూశారా… ఆవిడ ఆ బాబుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. ఆ తండ్రిని
చూడండి, ఇదేమీ పట్టనట్టు ఆయన మానాన ఆయన మేగజైన్ చదువుకుంటున్నాడు.
ప్రాణం:ఏం! మగాళ్ళకు బాధ్యత లేదా…” ఆవేశంగా మాట్లాడింది సునంద. “నెమ్మదిగా మాట్లాడు. మనం మాట్లాడేవి వాళ్ళకు వినిపిస్తాయి. పాపం కుర్రాడు బుద్ధిమాంద్యపు పిల్లాడిలా ఉన్నాడు. ఆయన్నెందుకంటావు. ఇంట్లో పనిచేసి దానికీ ఎందుకంత విసుక్కుంటావు” తనకు తెలియకుండానే తనకు పరిచయం లేని అలసిపోయి వుండవచ్చు కదా. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడేమో.
ఆ పెద్ద మనిషికి తన సపోర్టు ప్రకటించాడు శంకర్రావు.

ఆ కాస్త
ప్రాణం:”ఛీ…ఛీ… మీ మగాళ్లంతా ఇంతే. ఆడవాళ్లంటే కొంచెం గౌరవమైనా ఉండదు. చేయక ఏం చేస్తారు అన్న చులకన భావన తప్ప. ఆయన్ని చూస్తేనే అర్థమవుతోంది. అందరి కొడుకుల్లా తన కొడుకు లేడు కాబట్టి వాడంటే ఆయనకు ఇష్టం లేదని.
ప్రాణం:కుర్రాడికి దూరంగా కూర్చున్నాడు”. సునంద గొంతు శృతి మించుతుండ టంతో శంకర్రావు తనని వారించే ప్రయత్నం చేశాడు. ఏం చెయ్యాలి. వాళ్లని పరిచయం చేసుకొని అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనో. ఛ…ఛ… బావుండదేమో … వాళ్లు బాధపడతారేమో… ఇలా సందిగ్ధంలో పడి ఆ కుటుంబం వంక మళ్లీ చూశాడు. క్షణకాలంపాటు సునంద చెప్పింది నిజమేనేమో అన్పించింది అతనికి. ఆ తండ్రికి ఏదోమూల కొడుకంటే ఓ నిర్లిప్త భావం వుందా అనుకున్నాడు. చుట్టుపక్కల చూశాడు. కేవలం తాను మాత్రమే వాళ్ల గురించి ఆలోచిస్తున్నానేమో అన్పించింది అతనికి. ఎదురు బెర్తుల వాళ్లు వాళ్ల గొడవలో వాళ్లు ఉన్నారు. శంకర్రావు ఇలా తన ఆలోచనల్లో తానుండగానే, ఇవేవీ పట్టని గోదావరి ఎక్స్‌ప్రెస్ చీకట్లను చీల్చుకుంటూ తన గమ్యం వైపు పరుగులు తీస్తోంది. మొత్తానికి ఆ తండ్రీ పిల్లాడి అనుబంధం పూర్తి చేయని క్రాస్‌వర్డ్ పజిల్‌లానే మిగిలిపోయిందతనికి. ఎప్పుడయినా, ఇంకెక్కడయినా ఆ తండ్రి ఒంటరిగా కనిపిస్తే అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఇది సాధ్య మేనా. ఇంకొకరికి సాధ్యమయ్యేదేమో కానీ శంకర్రావు కున్న బిడియం, మొహమాటం అతనిని వెంటనే కొత్తవాళ్లతో మాట్లాడనివ్వవు. ఈ ఆలోచనల్తో సతమతమవుతూనే పై బెర్తుమీద అతను నిద్రలోకి జారుకున్నాడు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఆ కుటుంబం రైలు నుంచి దిగిన తర్వాత కూడా గమనించాడు. ఆ తండ్రి తనకేమీ పట్టనట్టు అంత రద్దీలో ఒక చిన్న సూట్‌కేసుతో ముందు వడివడిగా నడుస్తుంటే ఆ తల్లి ఒక చేత్తో కొడుకును నడిపిస్తూ, మరొక చేత్తో బ్యాగు భుజానికి తగిలించుకొని నడుస్తోంది.
ప్రాణం:“చూశారా… ఆ తండ్రికెంత నిర్లక్ష్యమో… భార్యా మీద, కొడుకు మీద కొంచెమైనా జాలి లేదేమిటండీ” సునంద విసురుగా అన్న మాటలకు శంకర్రావు సమాధానమేమి చెప్పగలుగుతాడు
“రైలు ప్రయాణాలలో ఎవరెవరో కలుస్తూ వుంటారు. పరిచయం వున్నవాళ్లమీద విసుక్కోవాలంటేనే ఇబ్బందిగా వుంటుంది. ఇలా అపరిచితుల మీద విసుక్కోవటం ఎంతవరకు సబబు చెప్పు” ఇలా సర్దిచెప్పే ప్రయత్నమయితే చేశాడు కానీ, తండ్రీ, అమాయకంగా వున్న ఆ కుర్రాడు… వాళ్లిద్దరి మొహాలు మాత్రం శంకర్రావు మస్తిష్కంలో ప్రింటయిపోయాయి. ఎన్ని సంవత్సరాల తర్వాతైనా సరే వాళ్లను అతను ఎక్కడ చూసినా గుర్తిస్తాడనటంలో అనుమానం లేదిప్పుడు.
***
ప్రాణం:కాలం తనదారిన తాను ప్రవహిస్తూనే వుంటుంది. పుట్టిన బిడ్డ మానసిక వైకల్యంతో వున్నాడనే కారణంగా ఆ పేగుబంధం పట్ల ఒక తండ్రి అంత కఠినంగా ఎలా ఉండగలుగుతాడన్న విషయానికి సమాధానం, కరిగిన కాలప్రవాహమివ్వక పోయినా ఆ ప్రశ్న శంకర్రావుని వెంటాడడం మానలేదు. ఆ తర్వాత అతను ఎప్పుడు విశాఖపట్నం వైపు వెళ్లినా అతని కళ్లు వాళ్లిద్దరి కోసం ఆత్రంగా వెతికేవి. వాళ్లు కన్పించని వైనాన్ని భార్యతో పంచుకునేవాడు. మనిషిలో సంకల్పం దృఢంగా వున్నప్పుడు తీరని కోరికలు ఏదో విధంగా తీరతాయంటారు. శంకర్రావు నిరీక్షణ సుమారు ఐదు సంవత్సరాలపాటు సాగింది. మళ్లీ అతను విశాఖపట్నం వెళ్లటం కోసం గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అసలే వేసవి కాలం. ఎండను భరించలేక ఏసీలో ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పటిలాగే అతని చూపులు కంపార్ట్ మెంటంతా పరచుకుని వున్నాయి. ఈ సారయినా వాళ్లు కన్పించకపోతారా అన్న ఆశ అతనిది. కన్పిస్తే ఆ తండ్రిని కడిగేయాలన్నది అతనిలో జ్వలిస్తున్న ఆకాంక్ష.
ప్రాణం:“ఎక్సిక్యూజ్మీ… కొంచెం జరుగుతారా…” ఈ మాటలకు శంకర్రావు తుళ్లి పడ్డాడు. ఐదేళ్ల క్రితం ఇదే గొంతుని ఇదే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విన్నాడు. చివాలున తలెత్తి చూశాడు. ఇది కలా నిజమా అన్న విభ్రమకు గురయ్యాడు క్షణకాలంపాటు. అదే తండ్రి, అదే కొడుకు, ఈ సారి వీళ్లిద్దరే. వెనక తల్లి మాత్రం లేదు. అయితే ఈ సారి ఆ కొడుకు ప్రేమగా తండ్రి భుజం మీద పొడుస్తున్నాడు. అంతే సరదాగా ఆ తండ్రి కొడుకు భుజం మీద చెయ్యేసి లాలనగా దగ్గరకు లాక్కుంటున్నాడు. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన శంకర్రావు ఆనందంతో అచ్చెరువొందాడు. కలలో
ఊహించని ఒక అద్భుత సన్నివేశమది. ఆనందంలోంచి తేరుకుంటూ 4. వాళ్లని కాస్త పరీక్షగా పరిశీలించాడు. ఆ రోజున పెడమొహంతో వున్న తండ్రి ఈ
రోజున పెనవేసుకున్న బంధంతో కొడుకును బుజ్జగిస్తున్నాడు.
ప్రాణం:సికింద్రాబాదు స్టేషన్‌కు వీడ్కోలు చెపుతున్నట్లుగా హారన్ మోతతో కదిలింది గోదావరి ఎక్స్ ప్రెస్ బరువుగా ఆవులిస్తున్నట్లుగా ట్రెయిన్ చక్రాలు కీచుమంటూ ముందుకు కదిలాయి. ప్రయాణీకుల్లో కొంతమంది పుస్తకాలు తీసి చదువుకుంటుంటే, ల్యాప్‌టాప్‌లతో నెట్ ప్రపంచంలో వీరవిహారం చేస్తున్నారు ఇంకొందరు. శంకర్రావు | ఎదురు బెర్తులోని ఆ తండ్రి మాత్రం కొడుక్కు ఎంతో శ్రద్ధతో ఆరెంజ్ ఒలిచిపెడుతూ తినిపిస్తున్నాడు. ఇంత మార్పు ఎలా సాధ్యం అని తనలో తానే తర్కించుకున్నాడు. ఇక ఉండబట్టలేక మొహమాటపు తెరలను తొలగించి తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ప్రాణం:“హలో అండీ! ఏమండీ! నా పేరు శంకర్రావు. ఒక కార్పోరేట్ సంస్థలో మానవ సంబంధాల విభాగంలో పనిచేస్తున్నాను. మీకు నేను గుర్తుండి ఉండపోవచ్చు. ఓ ఐదేళ్ల క్రితం మీరు ఇదే ట్రెయిన్లో వైజాగ్ వెళ్తున్నారు. అప్పుడు నేను, నా భార్య కూడా ఇదే ట్రెయిన్ మీ పక్క బెర్త్‌లో వున్నాం. ఇప్పుడు మీరెంత శ్రద్ధతో మీ బాబుని చూసుకుంటున్నారో అప్పుడు మీ బాబుని ఆవిడ చూసుకున్నారు. ఆ రోజున మీలో చికాకు, అసహనం అన్నీ కన్పించాయి. అది మాకు ఆశ్చర్యంగా తోచి మిమ్మల్ని అడగాలనిపించినా మొహమాటమడొచ్చి ఆ రోజు అడగలేకపోయాను. మీ మానాన మీరు ఒక మేగజీన్ చదువుకుంటూ ఒక అపరిచితుడిలా ఎలా వుండగలిగారన్నది ఆరోజున మాకు అంతుబట్టని విషయం. అప్పట్నించి మీరు ఎక్కడయినా కన్పిస్తారేమోనని వెతుకుతూనే ఉన్నాను. మళ్లీ ఈ రోజు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నారు. ఆ తండ్రి, ఈ తండ్రి ఒకరేనా అనిపిస్తోంది” చెప్పాలనుకున్నదంతా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు. శంకర్రావు.
ప్రాణం:కొన్ని క్షణాల తర్వాత ఆ తండ్రి మొదలు పెట్టాడు… “ఆ రోజు రైల్లో మీరు ఎంతోమందిని చూసినా మమ్మల్నే గుర్తుపెట్టుకున్నారంటే కారణం మా బాబు. మీరే కాదు చాలామంది ఇలా జాలిగొలిపేట్టు మా వైపు చూస్తుండేవాళ్ళు. కారణం వీడు. అయ్యో పాపం పిల్లాడు ఇలా వున్నాడేమిటి అన్న సానుభూతి ప్రధాన కారణం. అదే నన్ను పెంచుకునేలా చేసింది. వీడు పుట్టకముందు నేనూ, నా భార్య వీడి
గురించి ఎన్నో కలలు కన్నాం.
ఆ తర్వాత వీడు అందరిలాంటి వాడు కాదు అని
ప్రాణం:తెలిసిన దగ్గర్నించి నేను మామూలు మనిషిని కాలేకపోయాను. కానీ ఆ రోజున ఒక తల్లిగా వీడి బాధ్యతను తీసుకుంది మాత్రం నా వైఫే. అయితే ఇదంతా గతం. నేను మర్చిపోయిన ఆ గతాన్ని ఇదిగో ఇవ్వాళ మళ్ళీ మీ వల్ల గుర్తుచేసుకున్నాను. ఇలా గుర్తుచేసుకున్నప్పుడల్లా సిగ్గుపడుతూనే ఉంటాను. ఇకపోతే మీ అనుమానం నిజమే. అప్పుడలా ఉన్న వ్యక్తి ఇప్పుడిలా ఎలా మారాడు అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. కాదనను. అప్పట్లో మిగిలిన వాళ్ళంతా సంతోషంగా ఉంటే మాకే ఇలా ఎందుకవ్వాలన్న బాధ నన్ను అలా తయారుచేసింది. అప్పటి నా ప్రవర్తనకు ఇప్పటికీ వీడికి రోజూ సారీ చెబుతూ ఉంటాను”.
“అయితే మీలో ఈ మార్పు ఎలా వచ్చిందనేదే అంతుపట్టకుండా ఉంది” ఇంకా షాక్‌లోనే ఉన్న శంకరం అన్నాడు.
“ఒక విధంగా చెప్పాలంటే నేను ఇవ్వాళ ఒక మామూలు మనిషిని లేదా సాధారణ తండ్రిని కావటానికి కారణం వీడే. మా అబ్బాయి పేరు చెప్పలేదు కదూ… వీడి పేరు శ్రీనివాస్. నాన్నా ఒకసారి అంకుల్‌కు హాయ్ చెప్పు”
ఆ కుర్రాడు నెమ్మదిగా తన చేయిని శంకరంకు అందించాడు హలో అన్నట్టుగా. ఉద్వేగంగా ఆ చెయ్యిని అలాగే పట్టుకున్నాడు శంకరం కాసేపు.
“శంకరం గారూ, సుమారు మూడు సంవత్సరాల క్రితం వీడిని తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాను ఒకసారి. అప్పట్లో నాకున్న కోపంతో వీడికి కొంచెం దూరంగా ముందుకు నడుస్తూ ఉండేవాడిని. వీడు ఆ వెనకే వస్తూ వుండేవాడు. వీడికో అలవాటుంది. మధ్య మధ్య భుజం మీద కొట్టడం. ఇప్పుడు నాకది ఎంతో ఇష్టమే అయినా అప్పట్లో నాకు చికాకుగా ఉండేది. ఆ రోజు కూడా అలాగే వాడు నా భుజం మీద కొట్టకుండా పక్కకు తోసేశాడు. అలా ఎందుకు చేశాడన్నది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ రోజు గనక వాడు అలా చేయకుండా వుంటే నేను ఈ రోజు మీతో మాట్లాడుతూ వుండేవాడిని కాదు.
“అంటే…” కాస్త అర్థం కానట్టుగా అన్నాడు శంకరం.
Do“అలా నన్ను వాడు తోసెయ్యకపోతే నా వెనకే వేగంగా వస్తున్న లారీ కిందకు వెళ్ళిపోయేవాడ్ని. అలా వాడు నా ప్రాణం రక్షించాడు శంకరం గారూ, నాలోని దానవుణ్ణి అలా భూస్థాపితం చేశాడు. భగవంతుడే నా కళ్లు అలా తెరిపించి వాస్తవాన్ని గ్రహించేలా చేశాడు. వాడే నా ప్రాణం అని అప్పుడర్థమయింది. ఆ రోజు నుంచి నేను వీడికి బెస్ట్ ఫ్రెండునయిపోయాను. వీడితో గడపాల్సిన పది విలువైన సంవత్సరాలను
“ఏం నాన్నా మాట్లాడవు?”
బతుకుదామను కున్నావు. వెళ్ళిపోయావ్. అందుకే వచ్చేయండని జెప్తున్నవ్. ఈడ “ఏం మాట్లాడనురా! నువ్వు ఎలాగో భూమితో సంబంధం లేకుండా వ్యవసాయంలో ఉంటే నువ్వా మాటంటావురా చిన్నోడా! నేల మన తల్లిరా! మనకు కూడెట్టింది. పదిమందికి కూడెడుతోంది. ఇక గంగారెడ్డి లాంటోళ్ళంటావా! ఆళ్ళందరిది కానీ…” ఆపైన నాన్న మాట్లాడలేక పోయాడు. పొలం గురించి ఏం మాట్లాడినా
ఆయన సెంటిమెంటల్ అయిపోతాడు.
“కోపమొచ్చిందా నాన్నా…” అపరాధ భావనతో అన్నాను.
“లేదురా చిన్నోడా. మీ కాలమోళ్ళకు ఇయ్యన్నీ జెప్పడం మాతోటి అయ్యేది గాదురా. సర్లే గంగారెడ్డితో నేను మాట్లాడతలే. నువ్వు కోడలు, పిల్లలు అంతా బానే వున్నరు గద. పొద్దుగాలనే లేచి పొలానికి పోబడాలిరా చిన్నోడా”
“సరే నాన్నా” అంతకుమించి మాట్లాడలేకపోయాను.
ఆ తర్వాత కొన్నాళ్ళపాటు ఆఫీసు పని ఒత్తిడిలో పడి మిగిలిన విషయాల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. గంగారెడ్డి, నాన్న, అమ్మ మా పొలం కౌలుకివ్వడం అన్నీ మరుగునపడిపోయాయి. ఆఫీసులో ఇన్స్పెక్షన్ హడావిడి ఆ మరుగున పడిపోవటాన్ని మరింత వేగవంతం చేసింది. రాజ
ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్ళొచ్చి పేపర్ చూస్తున్నాను. ‘కరెంట్ ఇవ్వని అధికారుల నిర్బంధం’, ‘రుణాలివ్వలేమన్న బ్యాంకులు’, ‘యూరియా కోసం రైతుల అగచాట్లు’ వంటి హెడ్లైన్లు దీనంగా పలకరిస్తుంటే దీనికి భిన్నంగా రైతులందరికీ పావలా వడ్డీపై రుణాలు’, ‘రైతు ముంగిట్లో ఇంటర్నెట్తో సమాచారం – ఇంటింటా ఇంటర్నెట్’, రాయితీపై రైతులందరికీ వర్మీకంపోస్ట్ యూనిట్లు’ అంటూ ప్రభుత్వ ప్రకటనలు రంగులలో మెరిసి పోతున్నాయి. వాస్తవాలకు, ప్రచారానికి మధ్య సన్నని విభజన రేఖ చాలా సందర్భాల్లో కన్పిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం విభజన రేఖ భూతద్దం పెట్టి వెతికినా కన్పించేటట్టు లేదనిపించింది. రైతు అవసరాలు, ప్రభుత్వ ప్రకటనలు రెండు
కలవని దారుల్లా వేటికవే సాగుతున్నాయి.
వరంగల్
ర్బన్
నా ఆలోచనలను చెదరగొడుతూ ఫోన్ మోగింది. చూస్తే నాన్న. ఆయనంతట ఆయన ఫోన్ చేసే రకం కాదు. ఆయన ఆలోచనల్లో ఏదయినా మార్పొచ్చిందేమో అనుకుంటూ ఫోన్ ఆన్ చేశాను.
“చిన్నోడా ఏడున్నావురా… ఘోరం జరిగిపోయింది” నాన్న గొంతులో కన్నీటి జీర ధ్వనించింది.
“ఏమయింది నాన్నా… అమ్మకేమీ కాలేదు కదా” ఆందోళనగా అడిగాను. “మీ అమ్మ మంచిగానే వుందిరా… మన గంగారెడ్డి ప్రాణం తీసుకున్నాడురా. పురుగుల మందుతాగి చచ్చిపోయినాడురా” నాన్న గొంతులో దుఃఖం కట్టలు
తెంచుకుంది. నా గొంతు తడారిపోయింది.
“ఇదెలా జరిగింది నాన్నా”
“రాత్రేల ఇంట్లకెల్లి ఎల్లిండురా! ఎవరికీ సెప్పలేదు. పొద్దుగాల పొలంలో పడిపోయిండటం చూసిన రైతులు వచ్చి చెప్పి పోయార్రా. నువ్వు ఎంటనే బయల్దేరురా సిన్నోడా” నాన్న మాటలు విషపు చుక్కల్లా నా గొంతులో దిగుతుంటే అవతల నుంచి ఫోన్ కట్టయిపోయింది. మెదడంతా మొద్దు బారిపోయింది. లక్ష్మికి విషయం చెప్పి బస్సుకు బయల్దేరాను. గంగారెడ్డి ఇంత పిరికివాడుగా ఎలా మారిపోయాడు. చిన్న ప్పుడు మమ్మల్ని ముందుండి నడిపించిన గంగారెడ్డి ఇలా అర్థాంతరంగా ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నాడంటే నమ్మబుద్ధి కాలేదు. అలాంటి ఆలోచన వున్నట్లు ఎప్పుడూ మాట మాత్రమైనా అనలేదు. నలబై ఏళ్ళకే జీవిత పోరాటంలో అలిసిపోయా డా! నవ్విస్తూ, కవ్విస్తూ తిరిగే గంగారెడ్డి ఎప్పుడయితే తనలోకి తాను ముడుచుకుపోవటం మొదలుపెట్టాడో అప్పుడే ఒక స్తబ్దత అతన్ని ఆవరించిందేమో అన్పించింది. ఎంతోమంది అన్నదాతల ఆత్మహత్యల వార్తలు పేపర్లో చదువుతూనే వున్నాను. కానీ ఏనాడూ వాళ్ళ గురించి ఆలోచించలేదు. గంగారెడ్డి నా బాల్యమిత్రుడు కాబట్టి స్పందిస్తున్నాను. నాలాగే వ్యవస్థ కూడా మొద్దుబారిందా! వ్యవస్థలో నేను ఒక భాగమే కదా. రోజూ రైతుల కష్టాలు చదువుతూనే వున్నాం. పరిష్కారం మా చేతుల్లో ఎలాగూలేదు. కనీసం సానుభూతిగా రెండు క్షణాలు కూడా ఆలోచించం. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా కళ్ళు మూసుకున్నాను.
***
ఊరంతా గంగారెడ్డి ఇంటిదగ్గరే వుంది. నిన్న సాయంత్రం దాకా కళ్ళముందు తిరిగిన వ్యక్తి యిప్పుడు లోకంలోని బాధలకు, కష్టాలకు, క్రౌర్యానికి తనకేమీ సంబంధం