మౌనం:ఆ తర్వాత రెండు రోజులు మా తమ్ముడి పని మీద తిరిగాల్సి వచ్చి గంగాధరం ఆరోగ్యం గురించి వెంటనే వాకబు చెయ్యలేకపోయాను. ఏమీ కాకుడదని భయపడు తూనే గంగాధరానికి ఫోన్ చేశాను. ఫోన్లో గంగాధరం కొడుకు మాట్లాడడంతో మనసేదో కీడుని శంకించింది. “అంకుల్ నాన్న పరిస్థితేమి బావుండలేక పోవటంతో హాస్పిటల్లో చేర్పించాం. మీరొక సారొస్తే బావుంటుంది.”
మౌనం:నాకు తెలియకుండానే మనస్సు, శరీరం ఒక అచేతన స్థితిలోకి వెళుతుండగా నవనాడుల్ని కూడదీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాను. కేన్సర్ మనిషిని రోజుల్లో కబళిస్తుందని అర్థమయింది.
మౌనం:హాస్పిటల్లో గంగాధరం చివరిక్షణాలల్లో ఉన్నాడు. వెంటిలేటర్ మీదుంచారు. కళ్లు మూతలు పడివున్నాయి. మృత్యుదేవత ఐ.సి. యులా మారి రెక్కలు చాచి అతన్ని ఆహ్వానిస్తున్నట్లుగా వుంది. ఈ పరిస్థితిల్లో గంగాధరం ఏం ఆలోచిస్తూ వుండుంటాడు. అతడు డస్సిపోయి సుషుప్తావస్థలో వున్నా అతని ఆలోచనలు ఆగవు కదా. ఈ ప్రపంచాన్ని వదిలి బాల్యంలోకి వెళ్లాలనుకుంటాడేమో. మళ్లీ గంగాధరం నాతో కలసి వాకింగ్‌కు వస్తాడా! ఈ ప్రశ్నకు బదులు చెప్పకుండానే మరుసటి రోజు గంగాధరం స్వేచ్చాజీవిలా ఎగిరిపోయాడు. ఆ తర్వాత చాలాకాలం గంగాధరం ఇంటికేసి వెళ్లలేకపోయాను. నా పిల్లలకు హితవు చెప్పు అన్న గంగాధరం మాట నెరవేర్చలేక పోయానన్న దిగులు మాత్రం అప్పుడప్పుడూ నన్ను కప్పేస్తూ వుండేది.

***
మౌనం:ఆ రోజు ఆదివారం. ఆదివారం పేపర్లన్నింటిని ముందేసుకుని మగ్‌లోని “టీ” తో పాటు వార్తల్నీ తాగేస్తున్నాను. కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాను. అనుకోని అతిథిలా గంగాధరం పెద్దకొడుకు గాంధీ లోపలికి ప్రవేశించాడు. అంకుల్ మీకో విషయం చెప్పాలి అంటూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సమయాన్ని వృధా చేయకుండా ఉపోద్ఘాతం లేకుండా క్లుప్తంగా చెప్పేశాడు. ఇప్పటి తరంవారిలో చెప్ప దలచుకున్న విషయం పట్ల స్పష్టత, మొహమాటం లేకపోవడం వరమో, శాపమో అర్థం కావటం లేదు అనుకున్నాను. వాళ్లమ్మ జానకమ్మ బాధ్యతను పూర్తిగా తమ్ముడు తనకే వదిలేశాడని, తమ్ముడికున్న బాధ్యతను నేనయినా గుర్తించి నెహ్రూకు చెప్పాలన్నది గాంధీ వుద్దేశం.
మీవాళ్లెవరయినా చెబితే బావుంటుంది కదా. నేను చెబితే నెహ్రూకి నచ్చక పోవచ్చు” తప్పించుకునే ప్రయత్నం చేశాను. గంగాధరం బతికుంటే ఏమోగానీ, ఇప్పుడు నాకా విషయం గురించి మాట్లాడ్డం కష్టమనిపిస్తోంది. అదేవిషయం చెప్పాను
కూడా.
మౌనం:”మా నాన్న మా చుట్టాలతో మాట్లాడింది ఎప్పుడంకుల్. ఆయన తన ప్రపంచంలో తనకిష్టమయిన వాళ్లను పిల్చుకున్నాడు కానీ, మా చుట్టాలెవ్వరికి అంత సీన్లేదు” “పోనీ నువ్వే నెహ్రూతో చెప్పి చూడకపోయావు. ఏమన్నా ప్రయోజనం వుంటుం
దేమో” లౌక్యం ప్రదర్శించబోయాను.
“అలా బిరించాల్సిన పని నాకు లేదంకుల్” నా మాట పూర్తవకుండానే సమాధానమొచ్చింది. ఆ తర్వాత ఇంక సంభాషణ పొడిగించలేకపోయాను. “నెహ్రూకి చెప్పి చూస్తానయితే” అని మాత్రం అనగలిగాను.
మౌనం:ఇది జరిగిన రెండు రోజులకి నెహ్రూకి ఫోన్ చేశాను. కుశల ప్రశ్నల తర్వాత విషయంలోకి దిగాను. నా ఫోన్ అనగానే సంగతేమిటో అతను వూహించినట్లున్నాడు. “చూడండి అంకుల్. మీరంటే గౌరవం వుంది. అందుకని చెప్పి మీరు చెప్పిన ప్రతి దానికి గుడ్డిగా తలూపలేను. అమ్మకి, నాన్నకి చిన్నప్పట్నించి అన్నయ్య లేదంటే భారతి వీళ్లిద్దరే ఇష్టం. నాకే రోజూ ప్రాధాన్యత లేదు. అదీ కాక నాన్న కొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని అన్నయ్య తీసుకున్నాడు. అలాంటప్పుడు అమ్మని ఆ మాత్రం చూడలేడా?” నేను అనుకున్నదానికంటే నిక్కచ్చిగానూ చాలా కచ్చిగాను వున్నాడు నెహ్రూ అనుకున్నాను.
ఇక మిగిలింది భారతి. భారతికి తల్లి గురించి ఏం చెప్పగలను అనుకున్నాను. కొడుకులిద్దరు తన గురించి వాదులాడుకుంటున్నారంటే ఆ తల్లెంత బాధపడుతుందో అనుకున్నాను. కనీసం జానకమ్మ గారితో ఈ విషయం చర్చిస్తే ఎలావుంటుంది | అన్పించింది ముందు నెహ్రూ చెప్పిన విషయాన్ని గాంధీకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
***
ఇంకా నేను గాంధీకి ఫోన్ చేసేలోపలే ఒక రోజు భారతి ఫోన్ చేసింది. ఇది నేను వూహించని పరిణామం.
“అంకుల్ మీకీ సంగతి తెలుసా” ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టింది.
మౌనం:“నాన్నగారికి ఎప్పుడో రావలసిన డబ్బులు ఇప్పుడొచ్చాయి. ఓ మూడు లక్షల దాకా వచ్చాయి. అన్నయ్యలిద్దరు ఓ ప్రపోజల్ తెచ్చారంకుల్. నాన్నగారికొచ్చిన ఆ మూడు లక్షలూ నాకిచ్చేస్తారట. నేను అమ్మను శాశ్వతంగా నాదగ్గరే ఉంచుకోవాలట. ఏమన్నా అంటే మీ అత్తగారూ, మీ మామగారూ ఎలాగూ మీతో ఉండరు నీకేమిటి ఇబ్బంది అంటారు. కావాలంటే మా ఆయనతో మాట్లాడతారట. ఇద్దరు కొడుకులు వుండి ఆవిడ నాదగ్గరుంటే అందరూ ఏమన్నా అనుకుంటారన్న ఆలోచనే లేదు వాళ్లిద్దరికి. చివరికి ఆడపిల్ల ఇంటికి తల్లిని తరిమేస్తారా అంకుల్. మీరయినా న్యాయం చెప్పండి” ఆ పిల్లగొంతులో దుఃఖం అడ్డుపడుతుండగా ఇంకేం మాట్లాడలేకపోయింది. ఈ విషయం గురించి గాంధీని అడగాలని నిశ్చయించుకున్నాను.
నేను శ్రమ తీసుకుని గాంధీని కలిసేలోగా లేదా ఫోన్ చేసేలోపే గాంధీ నా ఇంటికొచ్చాడు ఓ ఉదయాన్నే. వాకింగ్ అయిపోయి షూస్ విప్పుకుంటున్నానప్పుడు. అంతపొద్దున్నే వచ్చిన గాంధీని చూసి ఆశ్చర్యపోతూనే టీ కలిపి ఓ కప్పు అతని చేతి కిచ్చాను. గాంధీ ఏమీ మాట్లాడకుండా ఓ ఉత్తరం నాచేతికిచ్చాడు. అది జానకమ్మ గారు తన పిల్లలకు రాసిన ఉత్తరమని అర్థమయింది. జానకమ్మ గారు కళ్లముందు కన్పించారు.
“పిల్లలకు ఆశీస్సులు…
మౌనం:గత కొద్ది రోజులుగా నేను ఎక్కడ ఎవరిదగ్గర వుండాలా అని మీరు మధనపడటం నేను గమనిస్తూనే వున్నాను. ఇది నాకు బాధ కలిగించినా దీనికో పరిష్కారం చూపటం నాబాధ్యతగా అన్పించింది. మా రోజుల్లో అత్తమామలకు సేవ చేయటం అనేది ఓ బాధ్యతగా మేమనుకోలేదు. కొత్తగా పెళ్ళై వచ్చిన మాకు ఓ జీవన విధానాన్ని చూపించేటట్టుగా వుండేవి వారి సూచనలు, సలహాలు. మమ్మల్ని వాళ్లు శాసించలేదా, పెత్తనం చెలాయించలేదా అని మీరడగొచ్చు. కొంత అలాంటిది జరిగినా దాని గురించి మేమెక్కువ ఆలోచించలేదు. బహుశా ఉమ్మడి కుటుంబం కాబట్టి అత్తగారేద యినా అన్నా, మా తోడికోడళ్లు మాకు అండగా వుండేవాళ్లు. అలాంటి వాతావారణం లోపించినందువలనో లేకపోతే చదువు తప్పితే ఇంకో విషయం గురించి చెప్పని మా వైఫల్యం వల్లనో అప్పటికి, ఇప్పటికి ఏదో తేడా కన్పిస్తోంది. ఇందుకు ఎవర్నీ తప్పు పట్టలేం, కాలధర్మం అనుకోవడం తప్ప. అందుకే మీకెవరికీ కష్టం కలిగించకుండా ఓ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి వాళ్లు వుండే వృద్ధాశ్రమాలు ఈ రోజుల్లో చాలానే
వున్నాయి. ఒక వయసు వాళ్లం అందరం ఒకచోట చేరితే మా కష్టసుఖాలు ఒకరికొకరం చెప్పుకోవటానికి వీలు వుంటుంది. అలాంటి ఒక వృద్ధాశ్రమాన్ని కున్నాను. అయితే ఒకటే ఇబ్బంది. నాన్నగారికి వచ్చిన ఆ
గురించి తెలుసు ఆశ్రమాని
డబ్బుల్ని ఆ
మౌనం:కిచ్చేస్తున్నాను. ఏమీ అనుకోరుగా. మనిషి పక్షిలాంటివాడు. పక్షి తన పిల్లలకు ఎగరటం నేర్పిస్తుంది. ఆహారాన్ని సేకరించటం ఎలాగో చూపిస్తుంది. ఆ తర్వాత స్వేచ్ఛగా తమ కిష్టమొచ్చినట్లు జీవించమని తనే చెబుతుంది. పిల్ల పక్షి ఎగిరే వరకే తన రక్షణ అనుకుంటుంది కానీ మనం మాత్రం అలా ఆలోచించలేకపోతున్నాం. మన వైవాహిక వ్యవస్థ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచినా మార్పు సహజం కాబట్టి, ఈ కాలానికి మీరు చేసిందే ఒప్పని నేను భావిస్తున్నాను. మీ స్వేచ్ఛకు అడ్డుకాకూడదనే ఈ నిర్ణయం | తీసుకున్నాను. మీ నాన్న గారికి ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పి చూశాను. ఎక్కడికన్నా వెళ్లిపోదామని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. ఇప్పుడు నాకావకాశం మీరు కల్పించారు. నా నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారన్న ఆశతో వెళుతున్నాను. ఈ నా నిర్ణయం గురించి వాదులాడుకోవద్దు, కీచులాడుకోవద్దు. నా ఈ ఒక్క కోరికను
మన్నిస్తారని ఆశిస్తూ…
అమ్మ
మౌనం:జానకమ్మ గారి దృక్పథాన్ని అభినందించకుండా వుండలేకపోయాను. గంగాధరం ఏ రోజూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎంతయినా మగవాడు కదా అనుకున్నాను. ఉత్తరాన్ని తిరిగిచ్చేస్తూ “మీ సమస్య మీ అమ్మగారే పరిష్కరించారు” అన్నాను. గాంధీ మొహంలో ఎక్కడయినా పశ్చాత్తాప ఛాయలు కన్పిస్తాయేమోనని వెతికాను.
“ఏం పరిష్కారం అంకుల్. మా అమ్మ మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఇలా చేసి” ఈడ్చి కొట్టినట్లు చెప్పాడు గాంధీ.
గాంధీ పురుషాధిక్య సమాజపు సగటు మనిషి. ఇంతకు మించి ఆలోచిస్తాడని నేననుకోలేదు. కాలమే అతనిలో మార్పు తీసుకొస్తుందన్న ఆశేదో మాత్రం నాలో
వుంది.
కోరిక
మౌనం:ఈ తరం పిల్లల తల్లిదండ్రులకి వున్నట్టుగానే సుజాత, శ్రీధర్ కి కొత్తగా ఒక సమస్య వచ్చి పడింది. ఇంజనీరింగ్ చదువు కోసం ఒక్కగానొక్క కొడుకుని విశాల్ ని మంచి పేరున్న కాలేజీలో చేర్పించారు. అదిక్కడ లేదు. వేరే రాష్ట్రంలో వుంది. వాళ్ళలో మొదటిసారి సంవత్సరం వరకు బుద్ధిగా వున్న విశాల్ రెండో సంవత్సరానికి వచ్చే సరికి మారిపోయాడు. రెండో సంవత్సరంలో అవసరార్ధం ల్యాప్‌టాప్ కంప్యూటర్ కొనిచ్చారు. అంతే అపట్నించి విశాలు అదే ప్రపంచమయిపోయింది వారి దృష్టిలో. ఎప్పుడు ఫోన్ చేసినా రెండు మాటలు మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను అంటాడు అంటుంది వాళ్ళమ్మ. వటుడింతింతై అన్నట్లు ఈ సమస్య విశ్వరూపం ఎప్పుడు కన్పించిందంటే జూన్‌లో అతను సెలవులకి వచ్చినప్పుడు.
మౌనం:“హాయ్ డాడ్, ఎలా వున్నావు అమ్మా” అంటూ అమ్మా నాన్నలను పలకరించి తర్వాత విశాల్ కంప్యూటర్‌కు అతుక్కుపోయేవాడు. టిఫిన్ చేయడు. అన్నానికి రాడు. వాళ్ళమ్మ బలవంతం చేసి గట్టిగా అరిస్తే కానీ ఆ ల్యాప్‌టాప్ ముందు నుంచి లేచే వాడు కాదు. సుజాతంత కాదు కానీ, శ్రీధర్ కూడా కొంచెం గట్టిగానే మందలించేవాడు. 10 కొడుకు ఇలా అయిపోతున్నాడేమిటి అని తట్టుకోలేక ఒక రోజు రాత్రి సుజాత వెంకట్రావుని పట్టుకుని ఏడ్చేసింది. మనుషుల కంటే వాడికి కంప్యూటర్ ఎక్కువయి పోయిందేమిటి అంటూ, ఇప్పటి పిల్లలకి కంప్యూటర్ కళ్ళజోడు కంటే ఎక్కువ అని వెంకట్రావు జోకేసే ప్రయత్నం చేశాడు. అయితే మాత్రం “సెలవులకు యింటికి వచ్చాడు. ఫోన్లో ఎలాగూ మాట్లాడ్డం లేదు. ఇంటికొచ్చినా కూడా మాట్లాడకపోతే ఎట్లా బావురుమంది సుజాత.
“చూడు సుజాతా, మన రోజులు వేరు. మనం ఉద్యోగంలో చేరే వరకు తల్లి దండ్రుల చాటున పెరిగిన వాళ్ళం. కానీ విశాల్ జనరేషన్ పిల్లలు వేరు. మనమే వాళ్ళకు విపరీతమయిన స్వేచ్చనిచ్చాం. వాళ్ళకున్న ఎక్స్పోజర్ వేరు” సర్ది చెప్పే
ప్రయత్నం చేశాడు శ్రీధర్.
మౌనం:”అదేమిటి మీరు కూడా అలా అంటారు? అమ్మా, నాన్న కన్నా ఎక్కువయి పోయిందా వాడికా కంప్యూటర్” సుజాత గొంతులో దుఃఖపు జీర.
“కమాన్ సుజాతా. పిల్లలెక్కడ దారి తప్పుతారో అని మనమంతా నిఘా పెడుతూనే వుంటాం కదా. పావుగంట ఆలస్యమయితే వాళ్ళ మొబైల్‌కి ఫోన్ చేస్తాం. ఫ్రెండ్స్‌తో వెళితే వాళ్ళు ఎలాంటివాళ్ళే అని ఆరా తీస్తాం. యివి తప్పని నేననటం లేదు. అలా చేయాలి నిజమే. కానీ వాడింట్లోనే వుండి కంప్యూటర్ ముందు లేవట్లేదంటే వాడేం అవసరమొచ్చి కూర్చున్నాడో ఆలోచించు” మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు శ్రీధర్.
“చాల్లెండి. ఆ ఫేసుక్కో, ట్విట్టరో కెలకటం తప్ప వీడేం చేస్తున్నాడు. లేదంటే గంటలు, గంటలు ఛాటింగ్. ఆ ఛాటింగ్ చేసేది ఆడపిల్లో, అబ్బాయో తెలీదు. ఆ కంప్యూటర్ వ్యసనంగా మారిందేమోనని నా భయం. అందులో చెత్త చెత్త సైట్లు చూస్తున్నాడేమోనని నాకొకటే టెన్షన్. మీరయినా అర్ధం చేసుకోకుండా వాడు చేసేదాంట్లో తప్పేమీలేదంటారేమిటి” ఈ సారి సుజాత కనుకొలకుల నుంచి ఆశ్రుధార
మొదలయింది.
“మన విశాల్ అలాంటివాడు కాదు. సరేనా. నేను వాడితో మాట్లాడతాను. నువ్వు ముందు నార్మల్ అవ్వు” అనునయంగా అంటూ సుజాత భుజమ్మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. గువ్వపిట్టలా ఒదిగిపోయింది సుజాత.
“సుజా, నీకెప్పుడయినా చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మా ఇంట్లో నేను చిన్నవాడినవ్వటం వలన నాకు పనులు చెప్పటం తప్ప, నాతో సరిగ్గా మాట్లాడే వారు కాదు. దాంతోటి నాలో ఒక కసి వుండేది. అది ఎవరి మీద చూపించాలో తెలిసేది కాదు. పోయి పోయి నాన్న మీద చూపించేవాడిని. ఎవరు చెప్పినా చేసేవాడిని కాని, నాన్న చెబితే విసుక్కునే వాడిని. పోట్లాడేవాడిని. నాన్న ఏదయినా దగ్గర కూర్చో పెట్టి చెబితే అర్ధం పర్ధం లేకుండా వాదించేవాడిని. కరెక్టుగా నాదప్పుడు మన విశాల్ వయసు. ఒకరోజు రాత్రి అమ్మ నాన్నని అడుగుతోంది. ఏమిటి వాడు మీతో అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. నాలుగు తగిలించండి వాడికి అని అంటోంది. అప్పుడు నాన్నే ఒక నవ్వు నవ్వారు. ఆ వయసు అంతే. అప్పుడు అందర్నీ ఎదిరిద్దామనిపిస్తుంది.