ప్రేమ:పనిలోనే ఉంటావు కాబట్టి నీకు చెప్పలేడు. పనులు చెప్పేది అన్నయ్యలు, అక్కయ్యలే ఈ ఇంట్లో వాడు చిన్నవాడు. అందరూ వాడికే పనులు చెపుతారు. నువ్వెప్పుడూ కాబట్టి ఏమీ అనలేడు. ఇక మిగిలింది ఎవరు? నేను, పోన్లే… అది మనసులో పెట్టుకుని బాధపడకుండా నన్నేగా అంటున్నాడు అన్నారు నాన్న.
ప్రేమ:మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి. చాలా రోజులు ఆలోచించాను. అంత ఉడుకు రక్తం వున్నవాడిని నెమ్మదిగా నా పద్ధతి మార్చుకోవటం మొదలు పెట్టాను. నాన్నకు దగ్గరవ్వటం మొదలు పెట్టాను. ఆయన తన చిన్నప్పుడు విషయాలు చెబుతూండేవారు. ఊళ్ళో తానూ చేసిన అల్లరి, తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ వుండేవారు. తాతయ్య కోపం గురించి, బామ్మ ఎప్పుడూ ఎలా వంటింట్లోనే వుండేది చెబుతూ వుండేవారు. నువ్వు విశాల్ పడే ఆందోళనకూ, దీనికి సంబంధం లేదు. ఆ రోజుల్లో మేం ఏడుగురం. కానీ ఇప్పుడు మనకు విశాల్ ఒక్కడే. అందుకని ఏం చేస్తున్నాం. మన ఫోకస్ అంతా వాడి మీద పెడ్తున్నాం. అది వాడిమీద ఒత్తిడి పెంచుతోందేమో ఆలోచించు. మన ప్రపంచం విశాలం అవ్వటానికి మనకు ఆ రోజుల్లో ముప్పై ఏళ్ళు పట్టింది. ఇప్పటి పిల్లలు అలా కాదు కదా. పదిహేనేళ్ళకే వాళ్ళు ఇంటర్ నెట్లో మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నారు. తెలుసుకుంటున్నారు. మనమే ఇంకా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. భర్త ఇంత వివరంగా చెబుతాడని సుజాత ఊహించలేకపోయింది. అలాగని మౌనంగా ఉండలేకపోయింది.
ప్రేమ:“మీరేమీ, మీ నాన్నగారితో మాట్లాడ్డం మానేయలేదు కదా. మీరూ అదే వాడికి చెప్పండి”. శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. ఒకసారి విశాల్తో మాట్లాడాలి అనుకున్నాడు.

***
విశాల్తో ఎలా ప్రస్తావించాలీ విషయం అని ఆలోచిస్తూండగానే ‘డాడీ’ అంటూ వచ్చాడు విశాల్.
రేపు వెళదామనుకుంటున్నాను డాడీ. మా ఫ్రెండ్స్ అందరూ బయల్దేరుతున్నారు. కొంచెం వర్క్ కూడా వుంది కాలేజీలో.
ప్రేమ:మీ “ముందరే నువ్వు సరిగ్గా మాట్లాడ్డం లేదని బాధపడుతోంది మీ అమ్మ. నువ్వేమో రేపే వెళ్ళిపోతానంటున్నావు” వీడింకో సమస్య తెచ్చి పెట్టాడు అనుకున్నాడు శ్రీధర్. “తప్పదు నాన్న. అమ్మకి నేను చెబుతాలే” విశాల్ అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
***
“నాతో అంత బాధపడ్డావు. వాడు రేపు వెళ్ళిపోతున్నాను అంటే ఏమీ అనకుండా
పంపించేశావు” విశాల్ని బస్సు ఎక్కించేసి ఇంటికి వచ్చాక భార్యని అడిగాడు.
“ఏం చేస్తాను. ప్లీజ్ అమ్మా అర్జంటు పనుంది అంటే. దానికి తగ్గట్టు వాడి
ఫ్రెండ్సందరూ వాడికి ఫోన్లు, ఎప్పుడు బయల్దేరుతున్నావని”.
ప్రేమ:సుజాత గొంతులో రాజీపడిన ధ్వనేదో విన్పించింది శ్రీధరు. నిన్నటి వరకు కొడుకు గురించి తల్లడిల్లిపోయింది ఈ సుజాతేనా అని మనసులో అనుకున్నాడు. శ్రీధర్. ఈ ఆడవాళ్ళంతే ఒక పట్టాన అర్థం కారు. ఉవ్వెత్తున కెరటంలా లేస్తారు. మళ్ళీ అంతలోనే విరిగిన కెరటమై తీరాన్ని చేరుతారు అనుకున్నాడు.
***
ప్రేమ:విశాల్ వెళ్లి పదిరోజులయిందేమో. విశాల్ యోగక్షేమాలు కనుక్కుంటూనే వున్నాడు శ్రీధర్. మనం చేస్తే కానీ వీడు ఫోన్ చేయడు అని విసుక్కుంటుంది సుజాత. ఎంతయినా తల్లి మనసు వేరే అని నవ్వుకున్నాడు శ్రీధర్.
ప్రేమ:ఆ రోజు జులై రెండో ఆదివారం. మదర్స్ డే. అంతకు రెండు మూడు రోజుల ముందర్నించే ఛానెళ్ళన్నీ ‘మదర్స్ డే’ గురించి హెూరెత్తిస్తున్నాయి. ఆదివారం బద్ధకంగా లేచే శ్రీధర్, ఆ రోజు ముందరే లేచి పాల పాకెట్లలో ఒకటి ప్రిజ్జులో పెట్టి, ఇంకోటి కాచి కాఫీ కోసమని స్టౌ మీద నీళ్ళు పెట్టి భార్యను లేపి ‘హ్యాపీ మదర్స్ డే’ అని విష్ చేశాను. సుజాత ఫ్రెష్ అయి వచ్చేలోపల వేడి కాఫీని కప్పుల్లో పోసి
చేశాడు.
“చూశారా. వాడింకా గ్రీట్ చెయ్యలేదు” కాఫీ కప్పు అందుకుంటూ భర్తతో బాధగా అంది సుజాత. అప్పుడే సుజాత ఫోన్ మోగింది.
“చూశావా తలుచుకోగానే ఫోన్ చేశాడు నీ కొడుకు ” సరదాగా అన్నాడు శ్రీధర్. కానీ ఆ ఫోన్ సుజాత అక్కయ్య సంజాతది.
“వెంటనే ఫేస్బుక్ చూడవే. విశాల్ నీ గురించి చిన్న వీడియో పెట్టాడు. నీ చిన్నప్పటి ఫోటోలన్నీ ఆల్బంలా పెట్టాడు. నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడే. హేపీ మదర్స్ డే నీకు” ఫోన్ పెట్టేసింది.
శ్రీధర్ తన మొబైల్లో ఫేస్బుక్ లో లాగిన్ అయ్యాడు.
ప్రేమ:నా కోసం, నాన్న కోసం, మా ఫ్యామిలీ కోసం ఎప్పుడూ కష్టపడే మా అమ్మకు ప్రేమతో ఓ తయారు చేశాను చూడండి. కష్టపడటం తప్ప మరొకటి తెలీదు మా అమ్మకు. అందరి అమ్మల విషయంలోనూ యిది అలాగే ఉండొచ్చు. మొన్న హైదరాబాద్ వెళ్లినప్పుడు తనతో ఎక్కువ మాట్లాడకుండా కంప్యూటర్ ముందే
కూర్చున్నానని అమ్మకు కోపం వచ్చింది. బాధపడింది అది నేను గమనించాను.
ప్రేమ:”సారీ అమ్మ. మదర్స్ డే నాడు జస్ట్ విషెస్ మాత్రమే చెప్పకూడదు. అమ్మకు ఏదయినా గిఫ్టు యివ్వాలనుకున్నాను. అది నా డబ్బులతో యివ్వాలని నా కోరిక. లక్కీగా ఒక ప్రాజెక్టుకు ఔట్ సోర్సింగ్ అసోసియేట్గా పనిచేశాను. అందుకని మొన్న హైదరాబాద్ వెళ్లినప్పుడు కూడా కంప్యూటర్ ముందే కూర్చున్నాను. నీకు కోపమొచ్చి వుంటే నన్ను ఎక్స్క్యుజ్ చెయ్యమ్మా. నువ్వూ అందరిలాగే ఓ స్మార్ట్ఫోన్ పట్టుకుని తిరగాలని నా కోరిక. ఫ్లిప్ కార్డ్ ఆర్డరు చేశాను. నీకు అందగానే అందులో నీ ఫోటో ఆల్బం చూడమ్మా. అందులో నేను కూడా వున్నాను. జనరేషన్లు మారుతూ వుంటాయి. మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు అంటూ ఉంటారు. బట్ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. నిన్న, నేడు, రేపు ఆ ప్రేమ ఎప్పుడూ ఒకేలా వుంటుంది. థాంక్యూ అమ్మా. యూ ఆర్ అండ్ యూ విల్ బి మై బెస్ట్ ఫ్రెండ్.” చివర్లో విశాల్ గొంతు పూడుకు పోయింది.
ప్రేమ:కొడుకు ఫేస్బుక్ వీడియో చూసిన సుజాతకు సంతోషం, బాధ కలగలిసిన కన్నీళ్ళో, ఆనంద బాష్పాలో వాటిని ఆపశక్యం కాలేదు. కొడుకులోని పరిణతి శ్రీధరికి ఒక అనిర్వచనీయమయిన అనుభూతినిచ్చింది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచిన శ్రీధర్కు ఫ్లిప్కార్ట్ కొరియర్ బాయ్ ఫోన్తో బాటు బొకే కూడా డెలివరీ చేయటానికి సిద్ధంగా వున్నాడు.
(రమ్య భారతి, ఫిబ్రవరి-ఏప్రిల్, 2015)
కొత్త పరుగు
కొద్ది రోజులుగా శంకర్రావు ‘చదువుకున్నంత
కాలం సమస్యలే. జీవితంలో
ప్రేమ:5. స్థిరపడ్డాక కూడా సమస్యలేనా’ అని వలపోస్తున్నాడు. పొద్దున్నే లక్ష్మి చదివిన లిస్టు గుర్తుకు వచ్చింది. పెద్దవాడికి ఎమ్.టెక్ సీటుకు ఏర్పాట్లు చేయాలి. చిన్నవాడి బి.టెక్ రెండో సంవత్సరం డబ్బులు సిద్ధం చేయాలి. అత్తగారి కేటరాక్టుకు కాసులు సమకూర్చా లి. ఇదీ ఆ లిస్టు ఇద్దరం వుద్యోగం చేస్తున్నాం. అయినా ఏం లాభం అని ఆలోచిస్తున్నా డు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాచ్మెన్ యాదయ్య వేదన మర్చిపోవడం కష్టంగా ఉ ంది. ఇద్దరు పిల్లలు యాదయ్యకి. ఇద్దరూ చిన్నవాళ్ళే. కాస్త కాన్వెంట్ చదువుతున్నారు. అదీ సమస్య. ఆ స్కూల్ ఫీజు సంవత్సరం, సంవత్సరమూ తిరుమల భక్తుల క్యూలా పెరిగిపోతోంది. గవర్నమెంట్ స్కూల్లో వేయవయ్యా అంటే మన వూరి బయట అపార్ట్మెంట్ల దగ్గర గవర్నమెంట్బడి యాడుంది సార్! అంటాడు.
తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి శంకర్రావుకి తండ్రి చిన్నతనంలో పోతే, తల్లి తనని చదివించటానికి ఎంత కష్టపడిందో తను మర్చిపోలేడు. బట్టలు కుట్టింది. అప్పడాలు, విస్తళ్ళు చేసి అమ్మింది. తన ఫీజులు కట్టడానికి సహాయపడ్డ వాళ్ళు గుర్తొచ్చారు శంకర్రావుకి. అప్పట్లో అన్నీ గవర్నమెంటు విద్యాసంస్థలే కాబట్టి ఇంత ఫీజులు లేవు. ఇన్ని ఇబ్బందులు లేవు. తను నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదనే అనాథ పిల్లల్ని చేరదీసే సంస్థలకు గుట్టు చప్పుడు కాకుండా తను ఇవ్వగలిగింది ఇస్తున్నాడు. ఇప్పుడు తన పిల్లల చదువు బరువునీ తట్టుకోవడమే కష్టమయిపోతోంది. అప్పటికి యాదయ్య పిల్లలకి పుస్తకాలు కొనటంలోనూ, ఫీ కన్సెషన్ ఇప్పించడంలోనూ
సహాయపడ్డాడు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ని కనిపెట్టుకునుండే యాదయ్యకు ఫ్లాట్ తొలిచేస్తోంది. ఆ మాత్రం మానవత్వం లేదేమిటి అనిపిస్తోంది. అప్పటికీ అసోసియేషన్ | ప్రెసిడెంట్ ప్రసాదరావుతో కదిపి చూశాడు, కాస్త యాదయ్యకు సహాయం చేద్దాం. సార్ . ఆయనేమో ఇంతెత్తున లేచాడు. ఇదేమన్నా ఛారిటీ సంస్థేమిటండీ, అంత ఇవ్వాలి అని మీరు పర్సనల్గా ఇచ్చుకోండి అంటూ. లాభం లేదు, రాత్రికి లక్ష్మితో మాట్లాడి యాదయ్య సమస్యకో పరిష్కారాన్ని వెతకాలి. ఆలోచనల మేఘాల్ని చీలుస్తూ బయటకు వచ్చాడు. కొలీగ్ తో కలిసి ‘టీ’కి బయలుదేరాడు.
***
సెల్లార్లో మోటార్ సైకిల్ పార్క్ చేస్తున్నాడో లేదో యాదయ్య ఎదురొచ్చాడు శంకర్రావుకి.
“సార్, మన సార్లని అడిగిండ్రా ఇస్కూల్ తెరుస్తాన్రు సార్” యాదయ్య జోరీగలా రొద పెడుతున్నాడు.
“ఒక్క రెండు రోజులు టైమివ్వు యాదయ్యా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను” యాదయ్యని తప్పించుకుని లిఫ్ట్ ఎక్కాడు.
“ఏమయింది, మీ జి.పి.యఫ్. లోను శాంక్షన్ అయ్యిందా, మీ ఎకౌంటులో డబ్బులు పడ్డాయా” శంకర్రావు ఇంట్లోకి అడుగుపెట్టాడో లేదో, టీ కప్పు అందిస్తూనే ప్రశ్నల వర్షాన్ని సిద్ధం చేయసాగింది లక్ష్మి.
“ఇంకో రెండు రోజులు పడుతుంది. దాంతోపాటు సొసైటీ లోను కూడా పెట్టాను. కానీ అందులో రావడం కష్టం అని చెబుతున్నారు. మన సమస్యలు సరే, ఆ యాదయ్యని చూస్తే బాధగా ఉంది. పిల్లల్ని గవర్నమెంటు స్కూల్లో అయితేనే చదివించగలడు. అలాంటి స్కూలు ఈ చుట్టుపక్కల లేదు. ఉన్న ప్రైవేటు స్కూలు వాడు దోచేస్తున్నాడు. అపార్ట్మెంట్ వాచ్మెన్ వాడికొచ్చే నెలజీతం వాడి కుటుంబానికి రెండు పూటలా భోజనం పెట్టడానికి సరిపోదు. ఏదో రకంగా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కాస్తో కూస్తో పనులు చేయించుకుని డబ్బులిస్తున్నారు కాబట్టి బతకగలుగుతున్నాడు. పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించొద్దు అని మనం చెప్పలేం కదా లక్ష్మీ. అందరూ సహాయం చేయబట్టే నేను ఏదో రకంగా చదువుకోగలిగాను. నా కాళ్ళమీద నేను నిలబడగలిగాను. ఆ సంగతి నీకూ తెలుసు. ఇంచుమించుగా యాదయ్యది అదే పరిస్థితి. కానీ యాదయ్య ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు. మన పిల్లల కన్నా నాకు యాదయ్య పిల్లల