తండ్రి:మౌనం మాట్లాడింది”బాపు నేను చదువుకుంట, కొడిమ్యాలలో నన్ను ఇంటర్ లో చేర్పించు. నుకుంట బోయి నడ్చుకుంట వస్త. టెన్త్ లో నాకు మంచిగానే వచ్చినయి కదామార్కులు”
తండ్రి:”నీకు చెప్తే సమజ్ గాదేమిరా రాజూ. టెన్త్ వరకు ఎట్లనో చదివిపిచ్చిన. నీ ఎన్క ముగ్గురు పిలగాల్లున్నరు. నిన్నే చదివిపించుకుంటూ కూసోమంటే ఆ పిల్లగాలను
ఎవడు సూస్కోవాలిరా” నాయన ఒప్పుకోకుండా అన్న మాటలు.
తండ్రి:“ఏందయ్యా, పోరనికి మంచిగచ్చినయి మార్కులు. గవర్నమెంటు ఫీజులు కట్టింది. బువ్వకూడా పెట్టింది. ఇప్పుడు గూడా ఆనికి గవర్నమెంటే పైసలు కడతది. నువ్వే మయినా కడతవ ఏంది. అయినా నువ్వు తాగుడు బందుచేస్తే ఆన్ని మా బాగా సదివి పించొచ్చు” తల్లి తనకి అండగా మాట్లాడింది.
“నీకేమి ఎరుకనే సదువు గురించి. మా చెప్పొచ్చినవు. ఆనికి ఇద్దరు తమ్ముల్లున్నరు. సెల్లెలున్నది. ఆల్లని సదివిపియ్యాలనా వద్దా? నువ్వు ఊకే లొల్లి జేయకు. ఆడ్ని పట్నంల పెట్రోలు బంకులో కొలువుకు పెడుతున్న. మనూరాయనే సూపర్ వైజర్ గున్నడు ఆయనకు చెప్పుంచిన”
తండ్రి:“బాపూ, గట్లనకు. నన్ను చదివిపియ్యి బాపూ, నేను చదివినంక తమ్ముల్లను, చెల్లిని నేను జూస్కుంట” ఎంత బతిమాలాడు తను ఆరోజు బాపుని.
“గీముచ్చట్లు నాకు జెప్పకు. రేపు పట్నం బోతున్నం. ఆడ పెట్రోలు బంకులో చేరుతున్నవు”
తండ్రి:మొత్తుకున్నది “సిన్న పోరడయా వీడు. వీడితోటోల్లు మంచిగ సదువు కుంటుంటే, వీడ్ని కొలువుల పెడతనంట వేందయ్యా
తండ్రి:బాపు ఎవరి మాటన్నా, ఎప్పుడన్న యిన్నడా, బాపు మాటే నెగ్గింది. తనొచ్చి ఈ బంక్ బడ్డాడు. ఇప్పటికి ఆర్నెల్లు దాటిపోయింది. చదువుకునే పిల్లగాలను ఎవుర్ని
జూసిన గుండె చెరువవుతున్నది.
తండ్రి:”ఏరా రా ఇంకా అదే ఆలోచనలయితే ఎట్లరా. నువ్వు మీ ఊరొదిలేసినవ్. ఇక్కడ వున్నవని మరువకు. ఆ సార్ నువ్వు పెట్రోల్ పోస్తవేమోనని బండి నిలుపుకుని వున్నడు. ముందు సార్ సంగతి చూడు”.

రాజు
తండ్ర:తేరుకున్నాడు. ఒక్క క్షణం సిగ్గుపడ్డాడు. బంక్‌లో రాజు వయసు వాళ్ళు ఆరేడుగురున్నారు. అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అందరి జేబుల్లో సెల్ ఫోన్లు, చెవుల్లో ఇయర్ ఫోన్లూ. ఒక్క ఈ కుర్రాడు మాత్రమే ఎందుకిలా వుంటాడో అనుకున్నాను. ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకోవడం నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటయింది. దీనిక్కారణం ఆ మేనేజర్‌తో ఏర్పడిన పరిచయం కావచ్చు. ఇంటికి దగ్గరలో వుండటం కూడా కావచ్చు.
తండ్ర:ఈ కుర్రాడి పేరు రాజు అని నాకు తెలుసు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాడు. ముభావంగా ఉంటాడు. చాలా మందికి ఆ కుర్రాడున్న చోట పెట్రోలు నింపుకోవటం అంతగా ఇష్టముండదని నేను కొద్దిరోజులుగా గమనిస్తున్న
విషయం.
“సార్ ఎంతకు పోయాలి”
“రెండొందలు పోయ్ బాబు”
పర్స్‌లోంచి ఐదొందల రూపాయల నోటు తీశాను.
తండ్ర:పెట్రోల్ ముదురు గోధుమ రంగులో గన్నులోంచి పడుతోంది. చూస్తుండగానే పెట్రోల్ మీటరు రీడింగ్ ఐదొందల రూపాయలు చూపించసాగింది.
‘బాబూ, నేనడిగింది రెండొందలు పోయమని, నువ్వు ఐదొందలు పోసేశావు” విసుగ్గా అన్నాను.
“లేదు సార్. ఐదొందలన్నట్టు విన్పించింది సార్” ఎప్పుడో గాని మాట్లాడక పోయినా, మాట్లాడినప్పుడు స్థిరంగా మాట్లాడాడు.
ఎగిసి వస్తున్న కోపాన్ని అణచుకుంటూ బండిని స్టార్ట్ చేశాను.
***
“ఏమిటి సార్ మొహం వస్తూనే చిటపటలాడుతోంది. ఎవరితోనయినా గొడవా
ఏమిటి?” స్వప్న అడుగుతోంది.
“పిల్ల వెధవలు కూడా మోసం చేస్తున్నారు. ఇంకీ దేశం ఏం బాగుపడుతుంది”
చికాకుగా అన్నాను.
తండ్ర:1 “అబ్బ అసలు విషయంలోకి వద్దురూ” జుట్టును చెరిపేస్తూ అడిగింది స్వప్న అంటే అప్పటిదాకా వున్న కోపం టప్మని గాలి తీసేసిన బెలూన్ లా చప్పబడి
‘అనుమానాన్ని వ్యక్త పరిచాను. అనుమానం.
పోయింది. బంకులో జరిగిన తతంగం చెప్పాను. నా “అంతకు ముందు ఆ మీటర్ రీడింగ్ మూడొందలు వున్నదేమోనని
నా
తండ్ర:నేనడిగిన రెండొందల రూపాయల పెట్రోల్ పోసేసి ఐదొందలు తీసుకున్నాడని o ముసుగేసుకుని మోసం చేస్తున్నాడనుకోలేదు. మేనేజర్ తెలిసిన వాడే కదా కంప్లైట్ అనుమానం. అమాయకంగా, ఏదో బాధపడుతూ వుంటాడనుకున్నాను, కానీ
యిస్తాను. అప్పుడుగాని తిక్కకుదరదు వాడికి” కసిగా అన్నాను.
తండ్ర:”కమాన్ డియర్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి. మూడు, నాలుగురోజులాగండి మీ బండే మీకు బోధపరుస్తుంది. అసలా అబ్బాయి ఎందుకంత ముభావంగా వుంటాడో ముందర కాస్త ఎంక్వయిరీ చేయండి సార్” జోకొట్టినట్లు మాట్లాడినా స్వప్న మాటల్లో
విషయముంటుంది.
తండ్ర:”పదండి సార్. ఆకలి దంచేస్తుంది. మీ కోసం చూసి, చూసి పిల్లలు తినేసి పడుకున్నారు. ఇంకాసేపాగితే పడిపోయేట్టున్నాను” స్వప్న తినలేదన్న విషయం బాధపెడుతుండగా తాత్కాలికంగా పెట్రోలు మంటను ఆర్పేశాను.
***
తండ్ర:ఆఫీసు వ్యవహారాల్లో పడిపోయి పది రోజుల పాటు పెట్రోల్ బంకు వైపు వెళ్ళలేదు. మీటరు రీడింగుని చెక్ చేస్తే ఐదొందల రూపాయలకు సరిపడా పెట్రోల్ పోశాడని అర్థమయింది. అనవసరంగా ఆ కుర్రాడిని అనుమానించినందుకు కించిత్
చింతించాను.
తండ్ర:“నువ్వు చెప్పింది నిజమే. ఆ అబ్బాయి తప్పేమీలేదు” అన్నాను స్వప్నతో.
“తండ్ర:ఇంత చదువుకున్న వారు, ఇంత తెలిసిన వారు. అంత కోపమయితే ఎలా సార్! కనీసం ఆ కుర్రాడిని అనవసరంగా అనుమానించినందుకు చిన్న గిఫ్టయినా ఇవ్వండి.”
స్వప్న యిచ్చిన సలహా నచ్చి దాన్నమలు చేయాలని నిశ్చయించుకుని దారిలో
చిన్న గిఫ్ట్ ఒకటి కొని ఆ పెట్రోల్ బంకు వెళ్లాను.
తండ్ర:“నమస్తే సార్. ఏమిటి మీ గాలి బంక్ మీదకు మళ్ళింది. మేమేమయినా తప్పు చేయలేదు కదా” ఇబ్బందిని నటిస్తూ అన్నాడు మేనేజర్ మూర్తి.
తండ్ర:పోశాడేమోనని అనుమానించి కేకలేశాను. అలా అనుమానించటం నేను చేసిన తప్పని తెలిసింది. ఆ కుర్రాడి నిజాయితీని శంకించినందుకు నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఈ చిన్న గిఫ్టుని ఆ కుర్రాడికి అందజేయటం. మీరు కాస్త ఆ కుర్రాడిని పిలుస్తారేమోనని”.
తండ్ర:”అందరూ మమ్మల్ని తిట్టేవారే. మా మీద కంప్లైంట్లొచ్చేవారే. మీ లాంటి వారు కూడా ఉంటారని ఇవాళే తెలిసింది. వుండండి మా సూపర్ వైజర్ని పిలుస్తాను. అతన్ది ఆ రాజుది ఒకటే ఊరు. మా సూపర్ వైజరే అతన్నిక్కడ పెట్టాడు” అంటూ బెల్ నొక్కి సూపర్వైజర్ని, రాజుని తీసుకురమ్మని ఎవరో పురమాయించాడు.
“సార్ పిలిచారా” అంటూ సూపర్వైజర్ అతని వెనకే ఆ కుర్రాడు రాజు వచ్చారు.
తండ్ర:”శంకర్రావుగారని ఈ సార్ మన బంకుకు రెగ్యులర్‌గా వస్తారు. అయితే మొన్న ఒకరోజు పెట్రోల్ పోయించుకున్నప్పుడు, మన రాజే పోశాడుట. తక్కువ పోశాడేమోనని అనుమానపడి, మన రాజుని కొప్పడ్డారుట. కానీ అలాంటిదేమి జరగ లేదని తెలుసుకుని, రాజుని అభినందిద్దామని వచ్చారు కంగారుపడకండి” విషయాన్ని చాలా సూక్ష్మంగా చెప్పేశారు మూర్తిగారు.
“బాబూ రాజూ సారీనయ్యా, నువ్వే కరక్టు, నేను రాంగ్” అన్చెప్పి మరీ సంభాషణని పొడిగించకుండా నేను తెచ్చిన గిఫ్టు ఇచ్చేశాను.
“వద్దు సార్…వద్దు సార్” బిడియపడుతుంటే ఆ సూపర్ వైజర్ రాజుని ముందుకు తోసి గిఫ్టు తీసుకునేలా చేశాడు.
మూర్తి గారు రాజుని వెళ్ళమని సైగ చేయటంతో రాజు వెళ్లిపోయాడు. నేనా సూపర్ వైజర్ని అడిగాను “ఎందుకు ఆ కుర్రాడు రాజు అంత డల్‌గా, ఏదో బాధపడు తున్నట్లుంటాడు. అదే మిగిలిన బాయ్స్ అందరూ ఉత్సాహంగా తుళ్ళుతూ వుంటే”
తండ్ర:“ఆ రాజుది మా వూరే సార్. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల దగ్గర చిన్న పల్లెటూరు. వాడికి మొన్న టెన్త్ పరీక్షల్లో 90 శాతం మార్కులొచ్చాయి. ఎట్లయినా చదువుకోవాలని వాడి కోరిక. వాడి నాయన కుదరదని బంకులో పెట్టించిండు. ఏందన్నా అంటే వీనెన్క ముగ్గురున్నరంటడు. రాజు నాయన తాగుబోతు సార్. రాజు అమ్మే కూలీపని చేసి అందర్నీ పోషిస్తుంది. చదువుకోలేకపోయిన్నే అని వీడట్లయిపోయిండు” ఆ
సూపర్వైజర్ కూడా బాధపడ్డాడు.
“రాజు తోటి నేనొక్కసారి మాట్లాడొచ్చా” అభ్యర్ధించాను,
“తప్పకుండా, రాజేష్ ఆ కుర్రాడ్ని పిలు” మూర్తిగారు అర్ధరేయ బోయారు. శ్రీ ఫ్యా”వద్దాద్దు. నేనే వెళ్లి మాట్లాడతాను” మూర్తి గారి దగ్గర సెలవు తీసుకుని
సూపర్వైజర్తో కలిసి రాజు దగ్గరకు వెళ్లాను,
***
“రాజూ, సార్ నీతో మాట్లాడాలంటున్నారు” అని సూపర్ వైజర్ చెప్పటంతో
రాజు నా వంక కొంచెం భయం భయంగా చూశాడు.
“చెప్పు రాజూ, నీకు టెన్త్ క్లాసులో మంచి మార్కులొచ్చాయని మీ సార్లు చెప్పారు. నీకు చదువుకోవటం ఇష్టమని కూడా చెప్పారు. పెట్రోల్ బంకులో ఈ ఉద్యోగం చేస్తూనే చదువుకుంటావా? అసలు ఏం చదవాలని అనుకుంటున్నావు?” నెమ్మదిగా,
అనునయంగా అడిగాను.
“కంప్యూటర్ చదువు చదవాలనుకున్నా సార్” నెమ్మదిగా చెప్పినా, దృఢంగా
చెప్పాడు.
“ఏదయినా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరి ఉద్యోగం చేస్తూ చదువుకుంటావా?” మౌనంగా తలూపాడు. మళ్ళీ కలుస్తానని భుజం తట్టి బయల్దేరాను.
***
“ఎంతదాకా వచ్చింది మీ ‘ఆపరేషన్ రాజు” షూస్ విప్పుకుంటుంటే కొంటెగా అడిగింది స్వప్న.
తండ్రి:“నన్ను వేధించిన అపరాధ భావనను కొంతవరకు కడిగేసుకున్నాను. ఆ కుర్రాడు బ్రైట్ స్టూడెంట్. చదువుకోవాలన్న తపన ఉంది. తల్లి ప్రోత్సాహం ఉంది. కానీ తండ్రి ‘అనేవాడు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. చాలా చోట్ల తండ్రులే కదా విలన్లు. ఏదయినా కంప్యూటర్ ట్రైనింగ్‌కు వెళతావా అంటే తలూపుతున్నాడు”
“ఇంకేం, మీ నాగభూషణాన్ని అడిగి చూడండి. అతనేదో కంప్యూటర్ ఇన్స్టిట్యూ నడుపుతున్నాడు కదా”
“గుడ్ ఐడియా. నువ్వు ‘కరణేషు మంత్రివోయ్. ఈ పురుషుడి విజయం వెన స్త్రీవి నువ్వే” మెచ్చుకోలుగా అన్నాను.
కదా, కాఫీ తెస్తానుండండి, అవతల మీ సుపుత్రుడు, సుపుత్రిక కోర్కెల చిట్టాతో మీ “బావుంది సంబడం, మాటలు తప్పిస్తే కనీసం మల్లెపూలు కూడా రాల్చరు కోసం వేయికళ్ళతో చూస్తున్నారు” బుగ్గమీద చిటికేసి మరీ లోపలికెళ్ళింది స్వప్న.
– పనిలో పనిగా నాగభూషణానికి ఫోను కలిపాను.
” స్. ఊరక రారు మహానుభావులు నిన్నటి మాట. ఊరక ఫోన్ చేయరు మహానుభావులు ఇది ఇప్పటి మాట. ఏం సంగతి” ఆరా తీశాడు నాగభూషణం.
విషయం వివరించాను.
తండ్రి:”మూడు నెలల సర్టిఫికెట్ కోర్సుంది. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులున్నాయి. ఎమ్. ఎస్. ఆఫీస్ నుంచి ఒరాకిల్ వరకు అన్నీ వున్నాయి. నువ్వు చెప్పిన కుర్రాడికి ఓపికుంటే ఆర్నెల్ల కోర్సులో చేర్పించు. ఇదేదో సామాజిక బాధ్యతలా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి పూర్తి ఫీజు మాఫీ గురించి నన్నడక్కు గరిష్టంగా నేన్నీకు పదివేలు తగ్గించగలను. మిగిలిన ఇరవైవేలు నువ్వు పెట్టుకుంటావో, ఎవరిచేతయిన పెట్టిస్తావో నీ ఇష్టం. కొన్ని పుస్తకాలు ఉడతాభక్తిగా ఇవ్వగలను. అంతేనా ఇంకేమయినా ఉందా? రెండు రోజుల్లో కొత్త బ్యాచ్ మొదలవుతోంది. వెంటనే తీసుకొస్తే నాకూ మంచిది, ఆ కుర్రాడికీ మంచిది” ఠక్కున ఫోన్ పెట్టేశాడు నాగభూషణం ఈ నాలుగు మాటలు చెప్పి. అతనెప్పుడూ ఇంతే ‘కట్టె కొట్టె తెచ్చె’ వ్యవహారం.
తండ్రి:”నాగభూషణంతో మాట్లాడేసినట్టున్నారు. ఆయనగారు కూడా డీల్ ఖరారు చేసినట్టున్నారు. అయ్యగారికి అంతగా నచ్చినట్టులేదు” కాఫీ కప్పు అందిస్తూ అంది
స్వప్న
తండ్రి:”మనసుని స్కాన్ చేసి విషయాన్ని కనిపెట్టే ప్రావీణ్యం నీకెలా వచ్చింది స్వప్నా. నాగభూషణం ఇరవై వేలు కట్టాలంటున్నాడు. చూద్దాం ముందు పదివేలు కడదాం” ఎప్పుడొచ్చారో పిల్లలిద్దరూ పిడుగుల్లాంటి మాటలొదిలారు…. “డాడీ నువ్వు మమ్మల్ని షాపింగ్‌కు తీసుకెళ్తావని అమ్మ చెప్పింది. మా షాపింగ్ డబ్బులు కూడా తీసేసుకో డాడీ”
“ఏమిటీ ట్విస్టు” అన్నట్టు స్వప్న వంక చూశాను.
“పిల్లలకు ఇవన్నీ ఇప్పటి నుంచే చెబితే వాళ్ళకు కూడా బాధ్యతతో మెలగడం అంటే తెలుస్తుంది” నేనేమయినా అంటానేమోనని నెమ్మదిగా చెప్పింది. నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. పిచ్చీ అంటూ దగ్గరకు తీసుకుని నుదిటిమీద