కృషి: పెట్టుకున్నాను.1. పిల్లలున్నారు దూరం దూరం” అంటూ మాయాబజార్ సావిత్రిలా అభినయించింది స్వప్నసుందరి.*****రాజు మీదఆ షిప్టుకు ఒప్పుకోవడం.సమస్య ఎక్కడొచ్చిందంటే బంకులో పనిచేసే మిగిలిన బాయ్స్ కోపం పెట్టుకోకుండా అతను ఏ షిఫ్టు కావాలంటే
మొత్తం
కృషి: బంకులో పది మంది బాయ్స్ ఉన్నారు. రాజుకి క్లాసులు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు. వీళ్ళకి ఒక్కొక్క వారం ఒక్కో డ్యూటీ వుంటుంది. రాజుకి పొద్దున్న బాయ్స్ అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపు వాళ్లు అతనికి సంబంధం అన్నారు. అప్పటి వరకు ముభావంగా ఉండే రాజులో ఇప్పుడో కదలిక అండగా నిలిచే ప్రయత్నం చేస్తే రెండో గ్రూపు వాళ్లు అతని చదువుతో మాకేమిటి వచ్చింది. తను కలలు కన్న కంప్యూటర్ కోర్సు చదువు కళ్ళముందు నిలిచే సరికి అవ అతనిలో ఆ ఉత్సాహాన్ని నింపింది. ఇది రెండో గ్రూపు అభిప్రాయాన్ని మార్చుకునేలా

చేసింది. అగంతో
కృషి:ఈ క్రమంలో నాకు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిశాయి. ఈ బాయ్స్ అందరూ ఇంచుమించుగా అందరూ కలిసే వుంటున్నారు. వంట వండుకోవటం దగ్గర్నుంచి బట్టలుతుక్కోవటం వరకు అంతా సామూహికమే. ఆ ఏర్పాటు ఆ పెట్రోల్ బంకు యాజమాన్యమే చేసింది. ఉండేవాళ్ళు ఉంటున్నారు. వెళ్ళిపోయేవాళ్లు వెళ్ళిపోతున్నారు. వారికొచ్చే కొద్దిపాటి జీతాన్ని అలా పొదుపుగా వాడుకుంటే కానీ ఇంటికి కాస్త డబ్బు పంపించడం వీలు కాదు. వారికి పెద్ద వినోద కార్యక్రమాలేమీ లేవు. అందుకనే పొద్దస్తమానం సెల్ ఫోన్ హెడ్ ఫోన్లని చెవుల్లో ఇరికించుకు ఎఫ్.ఎమ్.రేడియోల పాటలు వింటారు. అందరివి ఒకటే కలలు. ఒకటే సంతోషాల ఒకటే దుఃఖాలు.
కృషి:ఈ అంతస్సూత్రమే వాళ్ళని సర్దుకుపోయేలా చేస్తోంది. వారందరిలోకీ చిన్నవాడు కావటం, చదువుకుంటానన్నా, బలవంతాన బంకులో చేర్పిం వారికి తెలుసు కాబట్టి చాలామంది రాజు చదువుకుంటానంటే సంతోషంగా మీ మేరకు తమ సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మాకేమిటి అ మందిని మిగిలిన వాళ్ళు నచ్చజెప్పి ఒప్పించారు. ఈ మొత్తం వ్యవహా
అసంతృప్తితో ఉన్నదెవరంటే రాజు నాయన ఓదేలు. “పిల్లగాణ్ణి మీరు చెడగొడుతున్రు సార్” అంటూ నా మీద నిష్టూరాలాడుతూ ఉండేవాడు. రాజు తల్లి యాదమ్మ మాత్రం నాకు దండాలు పెట్టింది.
కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో మొదటి రోజున భయంభయంగా అడుగుపెట్టినా,
మూడు వారాలయ్యేసరికి
రాజు తన బ్యాచ్ వారిలో ముందుకు దూసుకుపోయాడని
కృషి:నాగభూషణం చెప్పాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పట్ల రాజుకున్న ఆసక్తి పట్టుదల ఇంకెవరిలోనూ తనెప్పుడూ చూడలేదని చెప్పాడు. దాంతో పాటు నాకు శుభవార్త చెప్పాడు. ఇరవైవేల కోర్సుకు నేను పది వేలే కట్టాను. అతని పట్టుదల చూసి రెండో పదివేలు మాఫీ చేస్తున్నట్టు నా చెవికి చల్లని కబురందించాడు. ఒక ఆర్నెల్ల కాలం ఒక వ్యక్తి జీవితంలో ఎంత మార్పయినా తీసుకురావచ్చని నాకు రాజుని చూశాకే అర్థమయింది. ఇప్పుడు రాజు శరీర భాష మారింది. బిడియం పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి రాజు ఒక మైనపు ముద్ద అయితే ఇప్పటి రాజు
చెక్కిన శిల్పం.
కృషి:ఒకసారి నేనూ, స్వప్న ఇద్దరం పెట్రోలు బంకు దగ్గరకు వెళ్ళినప్పుడు “హలో మేడం హౌ ఆర్ యూ” అంటూ ఆశ్చర్యపరిచాడు. కిడ్స్కివ్వండి అంటూ రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్లు తన చేతిలో పెట్టాడు.
అది స్వప్నకు ఎంత ఆనందాన్ని కలిగించిందంటే ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై డియర్ అంటూ స్వప్న ముద్దాడేంత,
కృషి:బంకులో మూర్తిగారు కానీ, ఆ సూపర్వైజర్ కానీ నన్ను చూస్తే పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. నాకు ఇబ్బందిగా అన్పించి వాళ్ళకి కన్పించకుండా వెళ్ళిపోవటం అలవాటు చేసుకున్నాను. అయితే బంకులో బాయ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇది రాజు వల్ల నాకు కలిగిన అదనపు సౌకర్యం.
కృషి:అందరూ ఊహించినట్టుగానే వాళ్ళ బ్యాచ్లోనే కాదు అంతకు ముందు బ్యాచ్ టాపర్లు కూడా స్కోర్ చేయని మార్కులు సాధించాడు. దాంతోటి నాగభూషణం ఆనందానికి హద్దుల్లేవు. అతని ఇన్స్టిట్యూట్లో సరికొత్త గుర్తింపు వచ్చింది. నాగభూషణా నికి రద్దీ పెరిగింది. ఇది నాగభూషణానికి రాజు వల్ల కలిగిన సౌకర్యం.
రాజు గర్వంగా కోర్సు సర్టిఫికెట్ తీసుకుని బంకులోకి వచ్చిన రోజున బంకు మేనేజర్ మూర్తి కూడా ఉదారంగా రాజుని తమ కంప్యూటర్ ఆపరేటర్గా తీసుకోబోతు న్నట్లు ప్రకటించాడు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. చాలా రోజుల బట్టి
• పోస్టు ఖాళీగానే ఉంది. ట్రయినింగ్ కాలంలోనే రాజు ఆ చేస్తూ ఉండేవాడు.
ఆ
కంప్యూటర్ మీద
ప్రాక్టీసు
కృషి:అంతవరకూ బానే ఉంది. కానీ అతనిజీతం పెంచటం గురించి మూర్తి మాట్లాడక చదువుకోవటానికి ఏర్పాటు చేశాం పోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే మాట స్వప్నతో అన్నాను. “ఇందులో
ఆశ్చర్యపోవటానికేముంది హబ్బీగారూ, రాజు
కాబట్టి కొంతకాలమయినా జీతం పెంచాల్సిన అవసరం లేదనుకుంది మేనేజ్మెంట్.
కృషి:రాజు అంత వెంటనే జీతం పెంచండి అని అడగడని కూడా వాళ్ళకు తెలుసు”. నిజమే రాజునడిగాను అదేమిటి నీకు మీ బంకు వాళ్ళు జీతం పెంచలేదేమిటి అని. “పోన్లెండి సార్, ఇవ్వాళ్ళకాకపోతే రేపు” అంటున్నాడు.
ఉన్నాడా కుర్రాడు.
ఇంకా ట్రాన్స్ లోనే
కృషి:“మీరేం కంగారు పడకండి. ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన మరుక్షణమే తనేమిటో తెలుసుకుంటాడు. ఆ పాటికి మీ నాగభూషణం తన ఇన్స్టిట్యూట్లో చేరమనే ఆఫర్తో సిద్ధంగా ఉంటాడు”
అప్పుడే ఫోన్ రింగయింది.
“నమస్తే సార్… నేను బంకు మూర్తిని. ఏమిటి సార్ మీ రాజు ఇలా చేశాడు” “ఏం చేశాడు సార్”
కృషి:”మీరు కష్టపడి డబ్బులు కట్టి చదివించారా! మేం అతనిక్కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశామా? అతను మాకు మాటన్నా చెప్పకుండా మీ నాగభూషణం గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాడు. తాపీగా రేపటినుంచి రాను అని ఇప్పుడు చెబుతున్నాడు. కొంచెమయినా మనిషికి కృతజ్ఞత లేకపోతే ఎట్లా సార్”
కృషి:“కేవలం కృతజ్ఞత కోసమో, గుర్తింపు కోసమో అతని కష్టంలో నేను పాలుపంచు కోలేదు. మీరూ అంతే అనుకుంటున్నా” ఈ మాటలు చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. “వెల్సెడ్ డియర్” స్వప్న వెనకనుంచి చుబుకం మీద ముద్దు పెట్టింది.
(ఆంధ్రభూమి, ఆదివారం అనుబంధం – మే 16, 2014)
.
పితౄణం
కృషి:రిటైర్మెంట్ కొందరిలో ఉత్సాహాన్ని నింపితే, మరికొందరిలో నిర్లిప్తతను రేపుతుంది. అదృష్టవశాత్తూ పరమేశం మొదటి కోవకు చెందిన వాడు. ఉద్యోగంలో చురుకుగా వున్నవాళ్లు పదవీవిరమణ చేసిన తర్వాత చేసేందుకు పనిలేక నిస్తేజంగా మారిపోతారను పరమేశం లాంటి వాళ్లు అది కరక్టు కాదని నిరూపిస్తూ వుంటారు. పరమేశం పదవీ విరమణ చేసి ఇప్పటికి మూడు నెలలయింది. తను అనుకున్న కార్యక్రమాలను అమలు చేసే ప్రయత్నంలో పడ్డాడు. జీవితంలో ఉదయపు నడక గానీ, సాయంత్రపు నడక గానీ అలవాటు లేని పరమేశం ఇప్పుడు సాయంత్రం పూట పార్కుకి వెళ్లి తనలాంటి మిత్రులతో కాలక్షేపం చేస్తున్నాడు. ప్రస్తుతం అతనిది చీకూ, చింతా లేని జీవితమేనా అంటే అవును, కాదు అని రెండు సమాధానాలొస్తాయి.
కృషి:తనకింకా చక్కదిద్దవలసిన పనులు చాలా ఉండగానే, కొడుకు రఘు మాత్రం “మీరు హైరదాబాద్ వచ్చేయండి” అంటూ తండ్రి పరమేశాన్ని, అమ్మ శాంతని తెగపోరుతున్నాడు. అలాంటి ఒక ఫోన్ కాల్ ఆ రోజు పరమేశం సాయంత్రం వాకింగ్ లో మిత్రులతో ఉండగా వచ్చింది. ఆ ఫోన్ కాల్ సంభాషణ ఇక్కడ అప్రస్తుతం కానీ దాని సారాంశం మాత్రం రేపొద్దున్నే దిగుతున్నాను, సిద్ధంగా ఉండమని. పరమేశం కూడా ఈ సారి వీడికి అసలు విషయం చెప్పేయాలి, ఇంకా ముసుగులో గుద్దులాటలు అనవసరం అనుకున్నాడు. తను ఎదుర్కొంటున్న సమస్యకు అలా అయినా పుల్ స్టాప్
పడుతుందని ఆలోచించాడు.
కృషి:తలుపు తీసిన భార్యతో మాట కూడా మాట్లాడకుండా సోఫాలో కూలబడ్డాడు. “ఏమిటి అలా వున్నారు” అన్న భార్య ప్రశ్నకు కాస్త విరామం తీసుకుని “రేపొద్దున్న
రఘు బయల్దేరి వస్తున్నట్లు ఫోన్ల్చేశాడు” ఇలా విషయాన్ని ఒక్క మాటలో వివరించి మౌన ముద్ర దాల్చాడు. “మనల్ని ఉన్న పళంగా వాడితో బయల్దేరమని అయితే
అడగడు కదా” భర్త మూడ్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది.
కృషి:ఫోన్లో వాడి వాలకం చూస్తే అలాగే వుంది. చూద్దాం ఏమవుతుందో”. “మీరేం చేద్దామనుకుంటున్నారో, చూచాయగా అయినా వాడికి చెప్పారా లేదా? “చెబితే వాడర్దం చేసుకుంటాడా! మా నాన్న నాకు చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. నేనర్థం చేసుకున్నానా?” పరమేశం మాటల్లో కొడుకు పట్ల కోపం ధ్వనించలేదు చేసుకున్నట్లుగా వుంది. తన నిర్ణయాన్ని కొడుక్కు అర్ధం అయ్యేలా చెప్పటం కూడా తన బాధ్యతే అనుకున్నాడు. పరమేశం ఆలోచనలో పడటం చూసి శాంత కాఫీ
తేవటం కోసం లోపలికి వెళ్లింది.
ముప్పై ఏళ్ల క్రిందట తండ్రి తనని ఎంత బతిమాలాడు. తండ్రి కనుకొలకులలో చిప్పిల్లిన కన్నీటి చుక్కలు ఇప్పటికీ తనని వెంటాడతాయి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ బాధ్యతల్లోంచి బయటకు వచ్చే ముందర నుంచి మరింత ఎక్కువగా వెంటాడుతున్నాయి. రఘు బహుశా ఇప్పుడేం చేద్దామనుకుంటున్నాడో అప్పుడు తనూ అదే చేశాడు. పరమేశానికి గతం గుర్తుకొస్తోంది. తమదో చిన్న పల్లెటూరు. తండ్రికి ఐదెకరాలు భూమి వుండేది. ఆయనో కష్టపడే రైతు. పొద్దున్నే పొలానికి వెళితే మళ్ళీ సాయంత్రానికే తిరిగి వచ్చేది. అమ్మకేమో తను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలన్న కోరిక. తండ్రి మాత్రం “ఇప్పుడు చదువుకుంటే సదువుకోరా చిన్నా, పెద్దయినంక ఈ పొలమంతా నీదేరా, నువ్వు మంచిగ యవసాయం జేయాలయ్య” అని తాపత్రయ
పడుతూ ఉండేవాడు.
కానీ తన మీద అమ్మ ప్రభావమే ఎక్కువ. తల్లి చెప్పినట్లు పట్నంలో ఉద్యోగం చేయాలన్న ఆశతో ఉండేవాడు. పదవ తరగతి పూర్తి కాగానే హాస్టలు జీవితం మొదలయింది. పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వోద్యోగంలో ప్రవేశించాడు. శాంత లక్షణంగా వుందిరా, నీకన్ని విధాలా సరిపోతుంది అని అమ్మా, నాన్న అంటే మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు.
పెళ్లయిన తర్వాత తను ఊరికి మరీ దూరంగా జరిగిపోయాడు. దీన్ని నాన్న గుర్తుపట్టాడు. “ఏరా అయ్యా రైతుబిడ్డవు. పొలం కాడికి రాకుండా నేల తల్లికి దూరం జరిగిపోతే ఆ భూలచ్చిమికి కొపమొస్తదయ్యా. కొంచెం సెలవుల్లో రా అయ్యా.
సుట్టూ చూడు, యవసాయంలో కొత్త కొత్త విషయాలు నాకు జెప్పొచ్చుగా” అని మొరపెట్టుకునేవాడు. వూరు వాసన, మట్టి కంపు అని చీదరించుకునే వాడు. నాన్న మాత్రం “పోరా నీకన్నీ ఎకసెక్కాలు” అని ప్రేమగా విసుక్కునే వాడు కానీ, ఏ రోజూ తిట్టింది లేదు. ఈ లోగా కుటుంబంలో మూడో సభ్యుడిగా రఘు ఊపిరిపోసుకున్నాడు.
దాంతోటి అవసరాలు పెరిగాయి, ఖర్చుల లిస్టు చాంతాడంతయ్యింది. దానికి తోడు స్నేహితులందరూ సొంతింటి కలను నెరవేర్చుకుంటుంటే, తనకీ, శాంతకి మనకు మాత్రం ఎందుకు వద్దు సొంతిల్లు అన్పించడం మొదలయ్యింది. ఒక రోజు అమ్మకి బాగాలేదని కబురొచ్చింది. హడావిడిగా బయల్దేరి వెళ్లారు. తన కోసమే ప్రాణాలు . నిలుపుకుని వుంది అమ్మ. “వచ్చావా చిన్నా నాన్నని జాగర్తగా సూసుకోరా” అంటూ తన చేతిలో వేసిన అమ్మ చేయి మంచు ముద్దలా మారిపోయింది.
అమ్మ పోయిన తర్వాత కొన్ని నెలల వరకు నాన్న ఊళ్ళోనే వుండిపోయాడు. పొలం పనులు చూసుకోవటం మానలేదాయన. రఘు ఇప్పుడు వస్తున్నట్లుగానే ఒక రోజు తను కూడా వూరికి వెళ్లాడు తండ్రిని తీసుకురావటం కోసం. అప్పుడు తండ్రి అన్న మాటలు ఇప్పటికీ తనలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రోజు తను తండ్రిని పొలం అమ్మేయమని ఒత్తిడి చేశాడు. ఊరితో శాశ్వతంగా బంధం తెంచుకుని తనతో వచ్చేయమన్నాడు. దానికాయన ఏమన్నాడు.
“ఏరా చిన్నా…పొలం అమ్మేయమంటావా! అది మనకి బువ్వ పెట్టిందిరా, ఇంకా పెడుతోంది. రైతు అనేవాడు పొలమమ్ముకోడురా! ఇన్నాళ్లు మనల్ని కడుపులో పెట్టుకుని కాపాడిన ఆ నేల తల్లిని ఇంకోడి సేతిలో పెడతామురా! నా గొంతులో వూపిరున్నంత వరకు నా తిప్పలేవో నేపడతారా చిన్నా”!.
తండ్రిని సమాధానపరిచే ప్రయత్నం చేశాడు తను.
“అదేంటి నాన్నా! ఈ వయసులో ఇంకా ఏం కష్టపడతావు. అయినా యవసాయం గిట్టుబాటుగా లేదురా చిన్నా అని నువ్వే ఒక పక్క అంటావు. మరోపక్క దండగ మారి యవసాయం అంటావు. నువ్వీ పల్లెటూర్లో ఒక్కడివి ఎలా ఉంటావు. నిన్నెవరు చూసుకుంటారు! అదే నువ్వు మాతో పాటు టౌనులో వుంటే మాకు తోడు, మేం నీకు తోడు. నేల తల్లి నేల తల్లి అని మరీ అంత అనుబంధం, ప్రేమ పెంచుకుంటే ఎట్లా. కాస్త పరిస్థితుల్ని అర్ధం చేసుకుని మాట్లాడు. ఈ పొలం అమ్మేస్తే అక్కడ మనకో స్వంత గూడు ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు కష్టపడ్డావు. నువ్వు రెస్టుగా ఉండొచ్చు. మనవడితో ఆడుకోవచ్చు. అమ్మను వాడిలో చూసుకోవచ్చు” అమ్మ గురించి, మనవడి గురించిన